spot_img
Homeప్రత్యేకంసోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

సోంపు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

Fennel Seeds
సాధారణంగా మనలో చాలామంది హోటల్, రెస్టారెంట్లలో భోజనం చేసిన తరువాత సోంపు విత్తనాలు తింటూ ఉంటారు. అయితే మనం ప్రతిరోజూ భోజనం చేసిన తరువాత సోంపు విత్తనాలను తింటే మంచిది. సొంపు విత్తనాలను తినడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఇంగ్లీష్ లో ఫెన్నెల్ సీడ్స్ అని పిలవబడే సోంపు విత్తనాలు గుండెజబ్బుల బారిన పడకుండా మనల్ని మనం రక్షించుకోవడంలో సహాయపడతాయి.

Also Read: పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు మీకు తెలుసా..?

పొటాషియం పుష్కలంగా ఉండే సోంపు రక్తపోటును అదుపులో ఉంచడంలో సహాయపడుతుంది. యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉన్న సోంపు గింజలను మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. సోంపు జీర్ణవ్యవస్థను మెరుగుపరచడంతో పాటు అజీర్తి, అసిడిటీ లాంటి సమస్యలను సులభంగా దూరం చేస్తుంది. రక్తహీనత సమస్యతో బాధ పడేవాళ్లు సోంపు గింజలను తీసుకోవడం వల్ల ఆ సమస్యను అధిగమించవచ్చు.

Also Read: బొప్పాయి ఎక్కువగా తినడం వల్ల కలిగే నష్టాలు తెలుసా..?

సోంపు గింజలను రోజూ తీసుకోవడం వల్ల శరీరంలోని అధిక కొవ్వు కరగడంతో పాటు సులభంగా బరువు తగ్గవచ్చు. సోంపు గింజలను రోజూ తీసుకోవడం ద్వారా అజీర్తి సమస్యకు సులభంగా చెక్ పెట్టవచ్చు. సోంపులో పీచు పదార్థం పుష్కలంగా ఉండటం వల్ల రక్తంలో ఆరోగ్యవంతమైన స్థాయిలో కొవ్వులు ఉంటాయి. సోంపు గింజలు క్యాన్సర్ బారిన పడకుండా రక్షించడంలో సహాయపడతాయి.

మరిన్ని వార్తలు కోసం: ఆరోగ్యం/జీవనం

ఇమ్యూనిటీ పవర్ ను పెంచడంలో సోంపు గింజలు సహాయపడతాయి. స్త్రీలలో ఋతుక్రమ సమస్యలకు చెక్ పెట్టడంలో సోంపు గింజలు ఉపయోగపడతాయి. సోంపు గింజలు కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు కంటి సంబంధిత సమస్యలను దూరం చేస్తాయి. అందువల్ల రోజూ సోంపు గింజలను తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

Kusuma Aggunna
Kusuma Aggunnahttps://oktelugu.com/
Kusuma Aggunna is a Senior Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.

Related News

Most Popular

Gabbar Singh Actor Ramesh

Gabbar Singh Actor Ramesh: విషమించిన ‘గబ్బర్ సింగ్’ నటుడు ఆరోగ్య పరిస్థితి.. హృదయాలను కలిచివేస్తున్న వీడియో..

Gabbar Singh Actor Ramesh: పవన్ కళ్యాణ్ కెరీర్ లో 'గబ్బర్ సింగ్' చిత్రం ఎంత ప్రత్యేకమో అందరికీ తెలిసిందే. వరుస డిజాస్టర్ ఫ్లాప్స్ లో ఉన్న పవర్ స్టార్ కి ,...
Chiranjeevi

Chiranjeevi: 2027 సంక్రాంతి బరి నుంచి తప్పుకున్న చిరంజీవి… కారణమిదే…

Chiranjeevi: గత 50 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఎనలేని సేవలను అందిస్తున్న వాళ్ళలో మెగాస్టార్ చిరంజీవి మొదటి స్థానంలో ఉంటాడు. తమిళ్ సినిమా ఇండస్ట్రీ నుంచి ఎదురయ్యే పోటీని తట్టుకొని...
Mokshagna

Mokshagna: బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కు ఎట్టకేలకు మోక్షం…

Mokshagna: నందమూరి నటసింహం బాలయ్య బాబు హీరోగా చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇప్పటివరకు ఆయన మాస్ లో తిరుగులేని హీరోగా మారిపోయాడు. తన కొడుకు అయిన మోక్షజ్ఞ...
Star Heroes

Star Heroes: డైరెక్టర్లు గా మారుతున్న స్టార్ హీరోలు…

Star Heroes: సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు నటులుగానే కాకుండా రైటర్లుగా, దర్శకులుగా కూడా రాణించాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే వాళ్ళ ఇమేజ్ కి తగ్గ కథలను...
Oktelugu Epaper