Vastu Tips – Tortoise : మనం వాస్తు ప్రకారం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇంట్లో ప్రతికూల శక్తులు రాకుండా ఉండటానికి పరిహారాలు పాటించాల్సిందే. ఈ సందర్భంగా ఇంట్లో తాబేలు బొమ్మను ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తాయి. అందుకే మనం తాబేలు బొమ్మను ఇంట్లో ఉంచుకోవడానికి మొగ్గు చూపాలి. తాబేలంటే శ్రీకృష్ణుడికి ఇష్టం. కూర్మావతారంలో విష్ణువు చేసిన మాయ అందరికి తెలుసు. అందుకే తాబేలును ఇంట్లో ఉంచుకుంటే ఇంట్లో సానుకూల శక్తులు వస్తాయని నమ్ముతుంటారు.
తాబేలును ఏ దిక్కున ఉంచుకోవాలి
తాబేలును ఇంట్లో ఉంచుకోవడంలో ఏ దిక్కున ఉంచుకుంటే మంచి ఫలితాలు వస్తుందో తెలుసుకుని పెట్టుకోవాలి. తాబేలును ఇంట్లో తూర్పు వైపు ఉంచుకోవడమే మేలు. తూర్పు దిశ అన్నిటికంటే పవిత్రమైనది కావడంతో ఆ దిక్కునే తాబేలు బొమ్మను ఉంచుకోవడం శ్రేయస్కరం. సానుకూల ఫలితాలు రావాలంటే తాబేలును సరైన దిశలో ఉంచుకుంటేనే సాధ్యం.
ఏరోజు తెచ్చుకోవాలి
తాబేలును ఇంటికి ఏ రోజు తెచ్చుకోవాలంటే పౌర్ణమి రోజు మంచిదని చెబుతారు. పౌర్ణమి రోజు తాబేలును కాసేపు పాలలో ఉంచాలి. తరువాత అభిజిత్ ముహూర్తంలో పాలలో నుంచి తీసి నీళ్లలో పూర్తిగా కడగాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో సానకూల శక్తులు లభిస్తాయి. దీని వలన మన ఇంట్లో మంచి ఫలితాలు రావడానికి కారణమవుతుంది.
సుఖశాంతుల కోసం..
ఇంట్లో సుఖశాంతులు నెలకొనాలంటే గదిలో తూర్పు వైపు తాబేలును ఉంచాలి. లోహపు తాబేలును ఎల్లప్పుడు నీటిలో ఉంచాలనే విషయం నమ్మాలి. దీంతో పాటు రంగురాళ్లను కలపొచ్చు. మానసిక ప్రశాంతత ఏర్పడటానికి కారణమవుతుంది. ఆరోగ్యం బాగుంటుంది. తాబేలును ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎన్నో మంచి ఫలితాలు వస్తాయని తెలుసుకోవాలి.
ఎలాంటి తాబేలు
తాబేలు నుంచి నోరు బయటకు వచ్చిన ముఖాన్ని ఇంట్లో ఉంచుకుంటే మంచిది కాదు. ఇలా చేస్తే ప్రతికూల ప్రభావాలు వస్తాయి. ఇలాంటి తాబేలును ఇంట్లో ఉంచుకోవడం సురక్షితం కాదు. ఇలా చేస్తే ఇంట్ల గొడవలు, అశాంతి, ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యంలో తాబేలును ఉంచుకోవడం వల్ల మనకు చాలా రకాల ప్రయోజనాలు దాగి ఉన్నాయి.