Brain function : ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం ఉదయం నుంచి రాత్రి వరకు రకరకాల పనులు చేసి అలసిపోయేవారు ఎందరో ఉంటారు. ఇలా ఇంటికి రాగానే రిలాక్స్ కోసం కొన్ని అలవాట్లను చేసుకుంటారు. వీటిలో టీవీ చూడడం.. సినిమాలో చూడడం లాంటివి చేస్తారు. ఇలా చేయడం వల్ల పొద్దంతా పడ్డ కష్టమంతా మరిచిపోతామని అనుకుంటూ ఉంటారు. అయితే టీవీ, మొబైల్ ఎక్కువగా చూడడం వల్ల మెదడు పనితీరు తగ్గుతుంది. వీటిని భారంగా చూడడంతో మెదడు కూడా ప్రతికూల ఆలోచనలను చేస్తుంది. అయితే ఒత్తిడి నుంచి దూరం కావడానికి రిలాక్స్ కోసం ఇలా కాకుండా మరో విధంగా ప్రయత్నించాలి. అందుకోసం ఏం చేయాలి?
Also Read: టీ లో చపాతీ వేసుకొని తింటున్నారా? తస్మాత్ జాగ్రత్త
కొన్ని పరిశోధనలు ప్రకారం.. సాయంత్రం ఇంటికి రాగానే టీవీ చూసే వారిలో మెదడు పనితీరు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. ఇలా విధుల్లో మునిగిన వారు.. ఇంటికి వచ్చి టీవీ చూడడం కాకుండా.. వారంలో ఒకసారి లేదా సమయం దొరికినప్పుడల్లా బయట ప్రదేశాలకు వెళ్లడం మంచిది అని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఇంట్లో ఉండి రిలాక్స్ కావడం కంటే బయటకు వెళ్లి ప్రశాంతంగా గడపడం వల్ల ఆరోగ్యంతో పాటు మెదడు పనితీరు కూడా మెరుగ్గా ఉంటుందని చెబుతున్నారు. వీలైతే స్నేహితులతో కలిసి సరదాగా మాట్లాడడం.. నవ్వుకోవడం వంటివి చేయడం వల్ల మరింత ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
అయితే అందరికీ స్నేహితులు ఉండకపోవచ్చు.. ఇలాంటి సమయంలో బోర్ కొట్టి కొందరు మద్యం లేదా ఇతర వ్యసనాలకు అడిక్ట్ అవుతారు. ఈ అలవాటు పోవాలంటే కుటుంబ సభ్యులతో నైన కలిసి బయటి ప్రదేశాలకు వెళ్లాలి. వీకెండ్ డేస్ బయటి వాతావరణం లో ఉండడంవల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. వీలైతే సమీప గ్రామాల్లోకి.. లేదా పచ్చని ప్రదేశంలోకి వెళ్లడం వల్ల స్వచ్ఛమైన వాతావరణంలో గడిపినట్లు అవుతుంది.
Also Read: భారతీయులు మొలతాడును ఎందుకు కట్టుకుంటారో తెలుసా?
మనిషి చేసే ప్రతి కార్యక్రమానికి మెదడు పనితీరే ప్రధానం అని చెప్పుకోవచ్చు. ఈ మెదడు ఎంత మెరుగ్గా ఉంటే.. అంత బాగా పనిచేసే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు శారీరక ఆరోగ్యంతో పాటు మెదడు ఆరోగ్యాన్ని కూడా చూసుకోవాలి. అయితే మెదడు ఆరోగ్యంగా ఉండాలంటే బయట ప్రదేశాలకు వెళ్లి రిలాక్స్ కావడమే కాకుండా అవసరమైన ఆహారాన్ని కూడా తీసుకోవాలి. అయితే కొందరు తమకు రుచి కలిగిన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు. ఇదే సమయంలో ప్రాసెస్ ఫుడ్ వంటివి తీసుకోవడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉండే అవకాశం లేదు. తేలికపాటి ఆహారం తీసుకోవడం వల్ల రక్తప్రసరణ మెరుగ్గా ఉండి మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
వారానికి ఒకసారైనా స్నేహితులతో లేదా దూరపు బంధువులతో కలుస్తూ ఉండాలి. ఇలా కలవడం వల్ల కొత్త విషయాలను మాట్లాడుతూ ఉంటారు. రెగ్యులర్ గా కాకుండా కొత్త విషయాలపై చర్చించడం వల్ల మెదడు పనితీరుకు పెరిగే అవకాశం ఉంది. ముఖ్యంగా పిల్లలు ఎప్పటికీ ఇంట్లో ఉంటారు కాబట్టి.. వీరిని సాధ్యమైనంతవరకు బంధువులతో కలుపుతూ ఉండాలి. స్నేహితులతో కలిసి ఆడుకునే ప్రయత్నం చేయించాలి. ఇలా చేయడం వల్ల మెదడు పనితీరు మెరుగ్గా ఉంటుంది.