Oil: నూనెను చాలా మంది ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కొందరు నార్మల్ గా ఉపయోగిస్తే కొందరు రోజు కచ్చితంగా ఉపయోగిస్తుంటారు. మరి మీలో ఎంత మంది రోజు నూనెను ఉపయోగిస్తారు? ఏ అవయవాలకు ఉపయోగిస్తుంటారు. కొందరు తలకు కూడా వారానికి ఒకసారి అయినా నూనె పెట్టరు. కానీ కొందరు ప్రతి రోజు పెడుతుంటారు. ఇదెలా ఉంటే శరీరంలోని నాలుగు భాగాలకు మాత్రం కచ్చితంగా నూనె రాయాలట. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావు అంటున్నారు నిపుణులు.
తలకు కచ్చితంగా నూనె రాయాలట. ఇలా రాయడం వల్ల మెదడు చల్లబడి మనసు ప్రశాంతంగా ఉంటుందట. ఇక మరొకరకంగా చూస్తే శరీరానికి కూడా నూనెను రాయాలి అంటున్నారు నిపుణులు. ఇలా చేయడం వల్ల సంతోషకరమైన హార్మోన్లు విడుదల అవుతాయట. పడుకునేటప్పుడు మోకాళ్ళకు నూనె రాయాలి అంటారు నిపుణులు. ఇలా చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం పొందవచ్చట.
చేతులకు కూడా క్రమం తప్పకుండా నూనె రాయాలట. ఇలా చేయడం వల్ల చేతులు పొడిబారకుండా ఉంటాయట. గోళ్ల మీద కూడా నూనె రాయాలట. ఇలా చేయడం వల్ల తేమగా ఉంటూ గోళ్లు ఆరోగ్యంగా ఉంటాయట. ఇక చాలా మంది తలకు నూనెను మాత్రం క్రమం తప్పకుండా రాసుకుంటారు. కొందరు తలస్నానం చేసేకంటే ముందు రోజు నూనె పెట్టుకుంటారు. కానీ మొత్తం మీద నూనె రాసుకోవడం మాత్రం అలవాటు. గోళ్లకు, తలకు, చేతులకు, మోకాళ్లకు నూనె మాత్రం రాస్తూనే ఉండాలి అంటున్నారు నిపుణులు.