Oil Massage: కొబ్బరినూనె జుట్టుకు రాసుకోవడం చాలా మందికి ఇష్టముండదు. ఇది తలకు రాసుకుంటే మోహం ఆయిల్ గా మారుతుందని అనుకుంటారు. దీంతో చాలా మంది తమ హెయిర్స్ ను అలాగే ఉంచుతారు. కానీ ఇలా చేయడం వల్ల తల వెంట్రుకలు జిగటగా మారుతాయో లేదో తెలియదు గానీ కొబ్బరి నూనెను వాడకపోతే మాత్రం అనర్థాలే ఎదురవుతాయి. అంతేకాకుండా కొబ్బరి నూనె నెత్తికి అప్లై చేయడం వల్ల ఎంతో అంతంగా కూడా కనిపిస్తారు. ఎలాటంటే?
కొబ్బరి నూనెలో ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి సహకరిస్తాయి. అంతేకాకుండా చర్మం కాంతివంతంగా మెరిసేలా చేస్తాయి. మోహంపై ఏర్పడిన మొటిమలను మటుమాయం చేస్తాయి. పొడిబారిన చర్మాన్ని మృదువుగా చేస్తాయి. ఎన్నో రోజులుగా కొబ్బరి నూనెను తలకు రాయకపోవడం వల్ల క్రిములు చేరి అలాగే ఉండిపోతాయి. దీంతో చుండ్రు సమస్య ఏర్పడుతుంది. ఫలితంగా అనేక రోగాలకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది.
కొబ్బరి నూనెతో అందంగా తయారవుతారు. స్నానం చేసేముందు కొబ్బరి నూనెతో తలపై మసాస్ చేయించుకోవడం వల్ల అక్కడ ఉండే క్రిములు చనిపోతాయి. అలాగే శరీరానికి ఈ నూనెతో అప్లై చేస్తే నిగారింపు వస్తుంది. తలకు కొబ్బరి నూనె రాసిన తరువాత స్నానం చేస్తే జుట్టు నల్లగా మారుతుంది. చర్మం నిగారింపుతో పాటు జుట్టు నల్లగా ఉండడం వల్ల అందంగా కనిపిస్తారు. అలాగే ముడుతలు తగ్గి నీట్ గా కనిపిస్తాయి. కొల్లజెన్ ఉత్పత్తి పెరిగి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
కొంత మంది మోహం జిగటగా మారుతుందని కొబ్బరి నూనెను రాసుకోవడానికి ఇష్టపడరు. అయితే చాలా మంది స్నానం చేసిన తరువాత తనకు నూనెను రాసుకుంటారు. కానీ స్నానం చేయకముందు కొబ్బరి నూనెను పట్టించి ఆ తరువాత వాష్ చేసుకుంటే జిగట సమస్య ఉండదు. వారానికి కనీసం మూడు సార్లు అయినా తలకు కొబ్బరి నూనెను అప్లై చేసే ప్రయత్నం చేయాలి. అప్పుడు జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది.