Hair Oil: అందంగా కనిపించాలంటే మంచి హెయిర్ స్టైల్ మెయింటెన్ చేయాలి. ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ హెయిర్ పై శ్రద్ధ పెట్టాల్సిందే. మరీ ముఖ్యంగా జుట్టుకు నూనె రాసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అయితే స్కాల్ప్ రకాన్ని బట్టి నూనెలను ఎంచుకోవాలని చెబుతున్నారు నిపుణులు. మాడు జిడ్డుగా ఉన్నవారు జుట్టుకు తేలికపాటి నూనెలు రాసుకోవాలి. ఇక వీరికి గ్రేప్ సీడ్, జొజోబా ఆయిల్ వంటివి బెస్ట్. పొడి స్కాల్ప్ ఉన్నవారు కొబ్బరి, బాదం వంటి ఆయిల్స్ పట్టించుకోవచ్చు.
నార్మల్ స్కాల్ప్ ఉన్నవారు అర్గాన్ లేదా ఆలివ్ ఆయిల్ వంటి వివిధ రకాల నూనెలను ఉపయోగించవచ్చు. డ్రై స్కాల్ప్ ఉన్నవారు మాడను తేమగా ఉంచే గుణాలు ఉన్న కొబ్బరి నూనెలను వాడడం మంచిది అన్నారు డాక్టర్ కళ్యాణి దేశ్ ముఖ్. అంతేకాదు మాడును సున్నితంగా మర్దన చేయాలన్నారు. ఆయిలీ స్కాల్ప్ ఉన్నవారు సెబాషియస్ గ్రంధులు అధిక స్రవాలను విడుదల చేయని నూనెలను ఉపయోగించాలి. జుట్టు మొదల్ల నుంచి చివర్ల వరకు స్మూత్ గా నూనెను రాయాలి.
సెన్సిటివ్ స్కాల్ప్ ఉన్నవారు స్వీట్ ఆల్మండ్, అవకాడో వంటి సున్నితమైన నూనెలను రాసుకోవాలి. వారానికి ఒకటి లేదా రెండు సార్లు ఈ నూనెలతో మర్దన చేసుకోవచ్చు. ఇక సాధారణ స్కాల్ప్ ఉన్నవారు బాదం, ఆర్గాన్ వంటి ఆయిల్స్ ను వాడవచ్చు. కానీ మాడ, వెంట్రుకలను పూర్తిగా కవర్ చేసేలా నూనె రాసుకోవాలి. ఎలాంటి స్వభావం లేని స్కాల్ప్ వారు నూనెలను మిక్స్ చేసి వాడుకోవచ్చు.
తలకు ఎక్కువ సార్లు నూనె రాస్తే.. తలపై సహజంగా ఉత్పత్తి అయ్యే నూనెలకు ఆటంకం కలుగుతుంది అన్నారు కళ్యాణి. అయితే స్కాల్ప్ సహజ సెబల్ ఉత్పత్తిని నియంత్రించడానికి వారానికి ఒకటి లేదా రెండు సార్లు హెయిర్ కు నూనె ను అప్లై చేసుకోవాలి. కానీ మాడ రకాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాలి.