వందేళ్లకు పైగా చరిత్ర.. ఎంతో మంచి రాజకీయ ఉద్ధండులు ఉన్న పార్టీ.. ఒకప్పుడు దేశాన్ని ఏలిన పార్టీ.. ఎంతో చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొట్లాటలు నడుస్తున్నాయి. అధికార సంక్షోభం ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలను వెలుగులోకి తెచ్చింది. సోనియా గాంధీకి విధేయులుగా ఉన్న సీనియర్ నేతలకు, యువ నేత రాహుల్ గాంధీ నాయకత్వం ఉన్న నేతలకు ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరింది. ఇటీవల పార్టీని మరోమారు పటిష్టం చేయడానికి యువ నాయకత్వం తీసుకురావాలని యువనేతలు పట్టుబడుతుండగా.. అనారోగ్యంతో బాధపడుతున్న సోనియానే మరోసారి పగ్గాలు చేపట్టేలా సీనియర్లన్ల పక్కనపెట్టాలని డిసైడ్ అయినట్టు సమాచారం.
Also Read: ఒళ్లు దగ్గరపెట్టుకొని పనిచేయకపోతే దుబ్బాక గతే.. నేతలకు జగన్ హెచ్చరిక?
చేతులు కాలాక ఆకులు పట్టుకున్న చందంగా మారింది కాంగ్రెస్ అధిష్టానం పరిస్థితి. 2014కు ముందు వరుసగా రెండు సార్లు దేశంలో అధికారంలో ఉండి కళ్లు నెత్తికెక్కి వృద్ధ జంబూకాల మాటలు విని యువ నేతలను దూరం చేసుకున్న పాపానికి ఇప్పుడు కాంగ్రెస్ అనుభవిస్తోంది. వరుసగా కాంగ్రెస్ లోని యువరక్తం బయటకు వెళ్లిపోయింది.
గొప్ప కాంగ్రెస్ నేత, మాజీ సీఎం వైఎస్ఆర్ కొడుకు వైఎస్ జగన్ పై కేసులు పెట్టి నాడి కాంగ్రెస్ జైలుకు పంపింది. ఆ తర్వాత మధ్యప్రదేశ్ లో జ్యోతిరాధిత్య సింధియా, రాజస్థాన్ లో సచిన్ పైలట్ లాంటి యువ కాంగ్రెస్ నేతలు పార్టీని వదిలేసి వెళ్లిపోయారు. రాహుల్ గనుక అధ్యక్ష బాధ్యతల్లో ఉండి వుంటే వీరే ఆ రాష్ట్రాల సీఎంలు అయ్యిండేవారు.ఇప్పటికైనా సోనియా, రాహుల్ లు కలిసి కూర్చొని పాత సీనియర్లకు మంగళం పాడి పార్టీలో యువనేతలకు అవకాశాలు కల్పించాలని కాంగ్రెస్ వర్గాలు కోరుతున్నాయి.
ఏపీలో పరిస్థితి పరిశీలిస్తే.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణం తరువాత జగన్మోహన్ రెడ్డి కొన్ని రోజులు కాంగ్రెస్ పార్టీతోనే కొనసాగారు. అయితే కాంగ్రెస్ నాయకులు కుట్రపన్ని జగన్ పై కేసులు పెట్టి జైలుకు పంపారు. దీంతో ఇక కాంగ్రెస్ తో జగన్ తెగతెంపులు చేసుకున్నారు. సొంతంగా పార్టీ పెట్టారు. దానికి వైఎస్ఆర్ సీపీ అని నామకరణం చేశారు. అయితే మొదట్లో వైఎస్ఆర్సీపీ నామమాత్రంగానే సాగినా… ఆ తరువాత ఏపీలోనే పెద్ద పార్టీగా ఎదిగింది. అయితే అప్పట్లో పార్టీ పేరులో కాంగ్రెస్ ఉండడంతో జగన్ కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ అనుమతితోనే పార్టీని స్థాపించారా..? అని చర్చించారు. అయితే ఆ తరువాత కాంగ్రెస్ తో విభేదించిన జగన్ ఒంటరిగానే పార్టీని అభివృద్ధిలోకి తెచ్చారు.
Also Read: ఏపీలో 49 ఇంజనీరింగ్ కాలేజీలు మూసివేత.. కారణమేమిటంటే..?
తాజాగా వైఎస్ ఆర్సీపీ అధికారంలో వచ్చి ప్రజల్లో మంచిపేరు తెచ్చుకుంటోంది. అంతేకాకుండా జగన్ సుప్రీం కోర్టులో న్యాయవాదులపై ఫిర్యాదు చేయడంతో దేశవ్యాప్తంగా పేరు సంపాదించాడు. దీంతో ఒకప్పడు జగన్ ను పట్టించుకోని కాంగ్రెస్ ఇప్పడు జగన్ దూకుడు స్వభావాన్ని చూసి వైఎస్ఆర్సీపీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సోనియా గాంధీ వర్గాలు జగన్ కు మా సపోర్టు నీకే అని కామెంట్ చేయడం సంచలనంగా మారింది.
ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో జగన్ మద్దతు ఇస్తున్నా పోలవరం ప్రాజెక్టు విషయంలో మెలికలు పెట్టే సరికి జగన్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. అయినా వైఎస్ రాజశేఖర్ రెడ్డి కలల ప్రాజెక్ట అయిన పోలవరం ను పూర్తి చేయాలని జగన్ సర్దుకోవాల్సి వస్తోంది. పోలవరం విషయంలో మరేదైనా కొర్రీలు పెడితే మాత్రం పోరాటానికి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఓ సుప్రీం జడ్జి, ఏపీ న్యాయవాదులపై సుప్రీం కోర్టులో ఫిర్యాదు దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తిస్తోంది. ఇప్పటికే దేశంలోని కొందరు న్యాయవాదులు జగన్ చేస్తున్నది కరెక్టేనని వాదిస్తున్నారు. మరోవైపు జగన్ పై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని అశ్విని ఉపాధ్యాయ లాంటి న్యాయవాదులు పిటిషన్లు వేసినా సుప్రీం కోర్టు ప్రతినిధులు పట్టించుకోవడం లేదు.
మరిన్ని జాతీయ రాజకీయ వార్తల కోసం జాతీయ పాలిటిక్స్
ఈ పరిమాణాలన్నింటిని గమనిస్తున్న కాంగ్రెస్ అధిష్టానం.. ఎలాగైనా సరే మళ్లీ మా పాత జగన్ ను అక్కున చేర్చుకుంటే కలిసివస్తుందని భావిస్తోంది. గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ నుంచి 30 మందికి పైగా ఎంపీలను కేంద్రానికి పంపించారు. ఒక దశలో ఏపీ ఎంపీలతోనే కేంద్ర ప్రభుత్వం నిలదొక్కుకోగలిగింది. ఇప్పడు జగన్ తో కలిసి వెళ్తే రాను రాను కలిసి వచ్చే అవకాశం ఉందని కాంగ్రెస్ అధిష్టానం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. కానీ కేంద్రంలో కాంగ్రెస్ హయాంలో ఉన్న సమయంలో జగన్ పై అక్రమ కేసులంటూ ముప్పు తిప్పలు పెట్టింది. ఒకవేళ్ కాంగ్రెస్ కలిసి వస్తానంటే జగన్ ఒప్పుకుంటాడా..? లేదా..? అనేది చూడాలి..