పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లకు శుభవార్త.. ఫ్రీగా 6 లక్షల ఇన్సూరెన్స్..?

ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రతి నెల ఉద్యోగి, కంపెనీ కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు పీఎఫ్ సర్వీసులను అందిస్తోంది. అయితే పీఎఫ్ ఖాతా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు. Also Read..ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..? ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పీఎఫ్ […]

Written By: Navya, Updated On : November 12, 2020 5:47 pm
Follow us on


ప్రభుత్వ, ప్రైవేట్ రంగ సంస్థలలో పని చేసే ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలను కలిగి ఉంటారనే సంగతి తెలిసిందే. ప్రతి నెల ఉద్యోగి, కంపెనీ కొంత మొత్తాన్ని పీఎఫ్ ఖాతాలలో జమ చేయాల్సి ఉంటుంది. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఉద్యోగులకు పీఎఫ్ సర్వీసులను అందిస్తోంది. అయితే పీఎఫ్ ఖాతా వల్ల కలిగే ప్రయోజనాల గురించి తెలియకపోవడం వల్ల చాలామంది నష్టపోతూ ఉంటారు.

Also Read..ఎస్వీబీసీ ఛానెల్ లో అసలేం జరుగుతోంది..?

ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ పీఎఫ్ ఖాతాలను కలిగి ఉన్నవాళ్లకు ఫ్రీగా ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తోంది. ఏకంగా 6 లక్షల రూపాయల వరకు పీఎఫ్ ఖాతాదారులు ఫ్రీ ఇన్సూరెన్స్ ను పొందవచ్చు. ఈ బెనిఫిట్ తో పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లు మరిన్ని ప్రయోజనాలను కూడా పొందవచ్చు. పాత ట్యాక్స్ విధానంలో ఉన్నవాళ్లకు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ ప్రకారం 12 శాతం వరకు ట్యాక్స్ రిబేట్ లభిస్తుంది.

పీఎఫ్ ఖాతాలో నగదు జమ చేయడం ద్వారా ఉద్యోగులు రిటైర్మెంట్ తరువాత పీఎఫ్ ప్రయోజనాలను పొందే అవకాశం ఉంటుంది. పీఎఫ్ ఖాతా ఉన్నవాళ్లు అత్యవసరమైతే డిపాజిట్ చేసిన డబ్బును విత్ డ్రా చేసుకునే అవకాశం కూడా ఉంది. అవసరాన్ని బట్టి పీఎఫ్ ఖాతా నుంచి విత్ డ్రా చేసే నగదులో మార్పులు ఉంటాయి. ఉద్యోగంలో చేరిన 5 సంవత్సరాల కంటే ముందుగా పీఎఫ్ ను విత్ డ్రా చేసుకోకూడదు.

Also Read..థియేటర్లలో ఫ్రీ షో.. ఇలాగైనా ప్రేక్షకులు వస్తారా?

5 సంవత్సరాల కంటే ముందే పీఎఫ్ విత్ డ్రా చేస్తే ఉద్యోగులు ట్యాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. పీఎఫ్ ఇతర స్కీమ్ లతో పోలిస్తే అదిరిపోయే రాబడిని అందిస్తుంది. ప్రస్తుతం పీఎఫ్ ఖాతాలపై 8.5 శాతం వడ్డీ లభిస్తుండగా ఉద్యోగం నుంచి రిటైర్ అయిన తరువాత భారీ మొత్తంలో నగదును పొందవచ్చు.