జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మళ్లీ బయటకొచ్చాడు. ఈసారి కాస్త కోపంగా ప్రవర్తించాడు. ట్విట్టర్ లో కాస్త గట్టిగానే ఏపీ సీఎం జగన్ పై విరుచుకుపడ్డాడు. గునపాల్లాంటి ప్రశ్నలతో జగన్ కు బాగానే దించాడు.
Also Read: చంద్రబాబుకు ‘కరోనా’ భయం
ఇటీవల బీజేపీ-జనసేన కలిసి చలో రామతీర్థం పెట్టినప్పుడు పాపం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అక్కడి వెళ్లి ఫైట్ చేశాడు. పోలీసులు ఆయనను కిందపడేసి లాక్కేళ్లినా పోరాటం మాత్రం ఆపలేదు. ఈ కార్యక్రమానికి రావాల్సిన పవన్ మాత్రం కదలలేదు. హైదరాబాద్ వీడలేదు.బహుషా షూటింగ్ లో బిజీగా ఉండడం వల్ల పవన్ రాలేకపోయి ఉండొచ్చు.అయితే నేరుగా రాని పవన్ తాజాగా ట్విట్టర్ మాత్రం జగన్ పై ఘాటుగా స్పందించాడు.
ఏపీలో దేవాలయాలపై దాడులు, దేవతా విగ్రహాల ధ్వంసమే ఇప్పుడు ప్రధాన ఇష్యూగా మారిపోయింది. దీనిపై ప్రతిపక్షాలు రచ్చ చేయడం.. అధికార వైసీపీ ఖండించడం జరిగిపోయాయి. ఇటీవల సీఎం జగన్ స్వయంగా మాట్లాడి మరీ.. ప్రతిపక్షాలు ఈ ఇష్యూను రాద్ధాంతం చేస్తున్నాయని.. దేవుళ్లతో రాజకీయం చేస్తున్నాయని విమర్శించాడు.ప్రతిపక్షాలు రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయంటూ మండిపడ్డారు.
Also Read: ఎన్టీఆర్ జిల్లాలో వైఎస్‌ఆర్ మున్సిపాల్టీ ఏంటి..? : పెదవి విరుస్తున్న ప్రజలు
దేశంలోనే ఒక సీఎంగా అత్యంత శక్తివంతులు సీఎం జగన్.. ఆయన తలుచుకుంటే హైకోర్టు సీజేలు, న్యాయమూర్తులు క్షణాల్లో బదిలీ అయిపోతారు. అలాంటి బలమైన వ్యక్తిపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారని పవన్ తన ట్విట్టర్ లో ప్రశ్నించాడు. జగన్ వెంట ఏకంగా 151 మంది ఎమ్మెల్యేలు,22 మంది ఎంపీలు, 115 మంది ఐపీఎస్ లు.. మరో 115 మంది అదనపు ఎస్పీలు, వేలాది మంది పోలీసులు ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం సిగ్గుచేటు అని పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ 2.60 లక్షల మంది వలంటీర్లు ఏం చేస్తున్నారంటూ కౌంటర్ అటాక్ చేశారు.
దీన్ని సీఎం జగన్ లోపం ఎక్కడుందో తెలుసుకోవాలని.. మీలోనా.. మీ నీడలో ఉన్న వ్యవస్థలోనా అని పవన్ చెడుగుడు ఆడేశాడు. చూస్తుంటే జగన్ ది ‘ఆడలేక మద్దెల ఓడు’ అన్నట్టుగా ఉందని ఎద్దేవా చేశారు.
ఇలా పవన్ కళ్యాణ్ రామతీర్థం ఎపిసోడ్ పై నేరుగా కార్యక్షేత్రంలోకి దిగకుండా ఈసారి ట్విట్టర్ ద్వారా తన ఆవేశ భావజాలాన్ని అంతా కురిపించేశాడు. రామతీర్థంపై తను నిరసనను ట్విట్టర్ గూట్లో తెలుపుతున్నట్టు నిరూపించాడు.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
స్థాయికి తగని మాటలు తగవు – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/2wKXCvtpIk
— JanaSena Party (@JanaSenaParty) January 6, 2021