వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు విక్రమ్ కుమార్ దర్శకత్వంలో అక్కినేని నాగచైతన్య హీరోగా “థాంక్యూ” మూవీ స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. తెలుగు చిత్ర పరిశ్రమలో హిట్ చిత్రాల నిర్మాత దిల్ రాజు ఈ సినిమాని నిర్మిస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో నాగచైతన్య తీసుకున్న ఒక నిర్ణయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది.
Also Read: ‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేస్తోందట.. శాంతించిన ఫ్యాన్స్ !
విక్రమ్ కుమార్ ఎప్పుడూ రొటీన్ కి భిన్నమైన కధాంశాలతోనే ప్రేక్షకులని అలరిస్తాడు. ఈ సినిమాలో మధ్యతరగతి అబ్బాయి ఒక తెలుగు అగ్ర కథానాయకుడికి పెద్ద అభిమానిగా, ఆయన కోసం కటౌట్స్ కట్టే స్థాయి నుండి ఒక పెద్ద వ్యాపారవేత్తగా మారతాడు. ఈ విజయ పథంలో తనకి సహకరించిన వారందరికీ థాంక్స్ చెప్పాలని నిర్ణయించుకుని ఓ ప్రయాణం స్టార్ట్ చేస్తాడట. ఈ క్రమంలో అతను ఎలాంటి అనుభవాలు పొందాడు, ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కోణంలో ఈ సినిమాని విక్రమ్ తన స్టైల్ లో తీయబోతున్నాడట.
ఈ సినిమాలో హీరో పాత్ర చాలా ఇంటెన్సిటీతో కూడిన నటనతో కూడుకుని ఉంటుందట. అలాంటి హీరో పాత్రకి జోడిగా హీరోయిన్ పాత్రకి ఎవరిని తీసుకోవాలా ? అని దర్శక నిర్మాతలిద్దరికి అర్ధం కావడంలేదట. ఈ నేపథ్యంలో విక్రమ్ కుమార్ ఇప్పటికే సమంతతో రెండు సినిమాలు చేయగా, ఆ రెండు సినిమాలు విజయం సాధించాయి. ఆ సెంటిమెంట్ దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాలో కూడా ఆమె అయితేనే బావుంటుందని భావించి నాగచైతన్యకి చెప్పాడట.
Also Read: రెస్పాన్స్ నిల్.. ‘సామ్ జామ్’ క్లోజ్ యేనా?
ఇప్పటికే చైతు సమంతా కాంబినేషన్లో చాలా సినిమాలు రాగ, రీసెంట్ గా మజిలీ సినిమాలో కూడా నటించారు. దీంతో ప్రేక్షకులకి మోనాటిని వస్తుందేమో అనే ఆలోచనతో సమంతని వద్దన్నాడట చైతన్య. ఇప్పుడు విక్రమ్ కుమార్,దిల్ రాజు మరో హీరోయిన్ వేటలో పడ్డారు. హీరోయిన్ ఫిక్స్ అవ్వగానే త్వరగా షూటింగ్ స్టార్ట్ చేసి దసరా కానుకగా ఈ సినిమాని విడుదల చేయాలని దర్శకుడు భావిస్తున్నారట. మరి ఏ ముద్దుగుమ్మ ఈ అవకాశం అందుకుంటుందో తెలియాలంటే మరి కొన్ని రోజులు ఆగాల్సిందే.
మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్