https://oktelugu.com/

‘రాధేశ్యామ్’ టీజర్ వచ్చేస్తోందట.. శాంతించిన ఫ్యాన్స్ !

‘రాధేశ్యామ్’ అప్‌ డేట్లను చిత్ర బృందం ఎప్పటికప్పుడు అందించకపోవడంతో.. ఎలాంటి అప్ డేట్స్ ను ఇవ్వకుండా తమను ఏడిపిస్తున్నారంటూ అభిమానులు యువి క్రియేషన్స్‌ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అసలు ‘రాధేశ్యామ్’ పట్టాలెక్కి ఏడాది దాటిపోయింది. అయితే, ఇప్పటివరకూ రిలీజ్ చేసింది కేవలం కొన్ని పోస్టర్లు మాత్రమే. సినిమాకి సంబంధించి ఏ విశేషాలూ బయట పెట్టకపోగా.. ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ అంచనాలను తారుమారు చేస్తున్నారంటూ మొత్తానికి నెటిజన్లు ‘రాధేశ్యామ్’ టీమ్ పై ఘాటు కామెంట్స్ చేసుకుంటూ తమ […]

Written By:
  • admin
  • , Updated On : January 6, 2021 / 03:45 PM IST
    Follow us on


    ‘రాధేశ్యామ్’ అప్‌ డేట్లను చిత్ర బృందం ఎప్పటికప్పుడు అందించకపోవడంతో.. ఎలాంటి అప్ డేట్స్ ను ఇవ్వకుండా తమను ఏడిపిస్తున్నారంటూ అభిమానులు యువి క్రియేషన్స్‌ పై ఓ రేంజ్ లో మండిపడుతున్నారు. అసలు ‘రాధేశ్యామ్’ పట్టాలెక్కి ఏడాది దాటిపోయింది. అయితే, ఇప్పటివరకూ రిలీజ్ చేసింది కేవలం కొన్ని పోస్టర్లు మాత్రమే. సినిమాకి సంబంధించి ఏ విశేషాలూ బయట పెట్టకపోగా.. ఎప్పటికప్పుడూ ఫ్యాన్స్ అంచనాలను తారుమారు చేస్తున్నారంటూ మొత్తానికి నెటిజన్లు ‘రాధేశ్యామ్’ టీమ్ పై ఘాటు కామెంట్స్ చేసుకుంటూ తమ కసి తీర్చుకుంటూ అలా కాలాన్ని నెట్టుకొస్తున్నారు.

    Also Read: చిత్ర పరిశ్రమకి గత వైభోగం రానున్నదా ?

    అయితే తాజాగా ‘రాధేశ్యామ్’ నుండి వచ్చే అప్ డేట్ అభిమానుల ఆకలిని తీర్చేలా ఉంది. అసలు, గత వారం నూతన సంవత్సరాదికి ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తారని అనుకున్నారు అంతా. కానీ, రిలీజ్ చేయలేదు. కాకపోతే ఈ సారి టీజర్ కు ముహూర్తం ఫిక్స్ చేసుకుంది ‘రాధేశ్యామ్’ టీమ్. దర్శకుడు రాధాకృష్ణ కుమార్ ‌ అభిమానులకు విజ్ఞప్తి చేస్తూ.. ‘మీరు అంతా కాస్త ఓపిక పట్టాలని.. టీజర్ అప్‌డేట్ సిద్ధమవుతోందని.. అభిమానుల ఆకాంక్షలకు ఏమాత్రం తగ్గని విధంగా టీజర్ రాబోతుందంటూ ఓ ట్వీట్ ట్విట్టాడు. దీంతో ప్రభాస్ అభిమానులు కాస్త చల్లబడ్డారు అనుకోవాలి.

    Also Read: దేవత పాత్రలో దెయ్యం.. ఫుల్ ఎక్స్ పోజింగ్ !

    కనీసం డైరెక్టర్ కైనా తమ బాధ అర్ధం అయిందని వారు శాంతించారు. ఇంతకీ టీజర్ ఎప్పుడూ రాబోతుందో డైరెక్టర్ గారు క్లారిటీ ఇవ్వలేదు. ఐతే, డైరెక్టర్ రాధాకృష్ణ కుమార్ మాటల్ని బట్టి చూస్తే.. సంక్రాంతికి టీజర్ వచ్చే అవకాశం ఉన్నట్లు అర్ధం అవుతుంది. ఇక ప్రస్తుతం ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ చివరి దశలో ఉంది. హైదరాబాద్‌లోని ప్రఖ్యాత ఫలక్ నుమా ప్యాలెస్‌‌లో ఈ సినిమా కీలక సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. అన్నట్టు ఈ చిత్రం ఈ వేసవిలో భారీ స్థాయిలో విడుదల కానుంది. ఈ సినిమా కోసం భారతీయ అన్ని పరిశ్రమల్లో కాస్త ఆసక్తి ఉంది. ఎంతైనా ప్రభాస్ హీరో కదా.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్