Gudumba Shankar Re-release : టాలీవుడ్ లో ప్రస్తుతం రీ రిలీజ్ ట్రెండ్ ఎంతో ప్రతిష్టాత్మకంగా మారిపోయింది.అభిమానులు వాళ్ళ అభిమాన హీరో కొత్త సినిమాల కంటే కూడా రీ రిలీజ్ చిత్రాలకు ఎక్కువగా సంబరాలు చేసుకుంటున్నారు. నేటి తరం అభిమానులు తమ హీరోల పాత సినిమాలు థియేటర్స్ లో చూసి ఉండకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఈ రీ రిలీజ్ ట్రెండ్ ని ఒక రేంజ్ లో ప్రోత్సహిస్తున్నారు.
ఇప్పటికే మన స్టార్ హీరోలందరి సూపర్ హిట్ సినిమాలు రీ రిలీజ్ అయ్యాయి. అందరిలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా నటించిన ‘ఖుషి’ చిత్రం టాప్ 1 స్థానం లో కొనసాగుతుంది. ఈ సినిమా రికార్డ్స్ ని బద్దలు కొట్టడానికి ఇతర హీరోల అభిమానులు కూడా చాలా ప్రయత్నాలు చేసారు కానీ, అది సాధ్యపడలేదు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ రికార్డ్స్ ని పవన్ కళ్యాణ్ బద్దలు కొట్టడానికి రంగం లోకి దిగబోతున్నాడు.
ఈ ఏడాది సెప్టెంబర్ 2 వ తారీఖున పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘గుడుంబా శంకర్’ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా రీ రిలీజ్ చెయ్యబోతున్నారు. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన రీ మాస్టరింగ్ కార్యక్రమాలు నేడు ప్రారంభం అయ్యాయి. డాల్బీ అట్మాస్ సౌండ్ సిస్టం తో, 4K HD క్వాలిటీ తో ఈ చిత్రం మన ముందుకు రాబోతుంది.
కనీవినీ ఎరుగని రీతిలో ఈ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నాడు నాగబాబు, ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కూడా ఏర్పాటు చేయబోతున్నారట. పవన్ కళ్యాణ్ కొత్త సినిమా విడుదలైతే ఎలాంటి సందడి వాతావరణం ఉంటుందో, ఈ రీ రిలీజ్ కూడా అలా ఉండబోతుందట. మరి ఈ చిత్రం ‘ఖుషి ‘ రికార్డుని బద్దలు కొట్టబోతుందో లేదో చూడాలి, ఈ సినిమా పవన్ కళ్యాణ్ కెరీర్ లో యావరేజి గ్రాసర్ గా నిల్చింది.
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News. He has more than 17 years experience in Journalism.
Read MoreWeb Title: Gudumba shankar 4k print movie is ready for release
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com