Pawan Kalyan: జనసేన పార్టీ(Janasena Party) అధినేత, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) చిన్న కొడుకు మార్క్ శంకర్ పవనోవిచ్(Mark Shankar) ఇటీవలే సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో గాయాలపాలైన ఘటన ఎంతటి దుమారం రేపిందో మనమంతా చూస్తూనే ఉన్నాం. అభిమానులు అయితే హడలిపోయారు. పవన్ కళ్యాణ్ కు సంబంధించిన చిన్న ఆటకం కలిగినా తల్లడిల్లిపోయే అభిమానులు ఇంత పెద్ద ప్రమాదం జరిగింది అనే విషయం తెలియగానే రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు చేయించారు. కొన్ని చోట్ల మృత్యుంజయ హోమాలు కూడా చేశారు. అందరి ఆశీస్సులు, ప్రార్థనలు కారణంగా ఎట్టకేలకు మార్క్ శంకర్ సురక్షితంగా బయటపడ్డాడు. నిన్న మెగాస్టార్ చిరంజీవి స్వయంగా ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసిన సంగతి మన అందరికీ తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన షేర్ చేసిన ఫోటోలు కూడా బాగా వైరల్ అయ్యాయి.
Also Read : ఛీ మారరు.. పవన్ కుమారుడుపై చీప్ కామెంట్స్.. పోలీసులు సీరియస్!
మా బిడ్డ ఇంటికి వచ్చేశాడు అంటే ఎంతో ఆనందంతో ఆయన పెట్టిన ట్వీట్ ని చూసి అభిమానులు ఎంతగానో మురిసిపోతున్నారు. కుటుంబానికి ఈ కాలంలో ఎంత విలువను ఇవ్వాలో మెగాస్టార్ చిరంజీవి ని చూసే నేర్చుకోవాలంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే చిరంజీవి(Megastar Chiranjeevi) నిన్న మా బిడ్డ ఇంటికి వచ్చేశాడు అంటూ ఆ ఇల్లు హైదరాబాద్ లో ఉన్న ఇంటిని ఉద్దేశించి అన్నాడా?, లేకపోతే సింగపూర్ లో ఉన్న ఇంటిని ఉద్దేశించి అన్నాడా అని అభిమానులు కాస్త కన్ఫ్యూజ్ అయ్యారు. అయితే అందుతున్న లేటెస్ట్ సమాచారం ఏమిటంటే చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఇంకా సింగపూర్ లోనే ఉన్నట్టు తెలుస్తుంది. మార్క్ శంకర్ ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదు కాబట్టి, అతన్ని హైదరాబాద్ కి తీసుకొని రావడానికి ఒక రెండు మూడు రోజులు ఆగి వెళ్లాలని డాక్టర్లు సూచించారట. దీంతో అన్నదమ్ములిద్దరూ సింగపూర్ లోనే ఉండిపోయారు.
చిరంజీవి ఈరోజు రాత్రి లేదా రేపు ఉదయం ఇండియా కి వచ్చే అవకాశం ఉంది కానీ, పవన్ కళ్యాణ్ మాత్రం సోమవారం వరకు వచ్చే అవకాశాలు లేవట. ప్రస్తుతం మార్క్ శంకర్ లేచి నడవగలుగుతున్నాడు, మాట్లాడుతున్నాడు, కానీ ఊపిరి తిత్తుల్లోకి నల్ల పొగ బాగా చేరడంతో దాని ఎఫెక్ట్ కొద్ది రోజుల వరకు ఉంటుంది. ఆ కారణంగా చేత పూర్తి స్థాయిలో కోలుకునేవరకు ఆక్సిజన్ సిలిండర్ సహాయంతోనే ఉండాలని అన్నారట డాక్టర్లు. కాబట్టి మరో రెండు మూడు రోజుల పాటు మార్క్ శంకర్ ఆక్సిజెన్ మాస్క్ వేసుకోవాల్సిందే. ఇదంతా పక్కన పెడితే పవన్ కళ్యాణ్ హైదరాబాద్ కి వచ్చిన వెంటనే ‘హరి హర వీరమల్లు’ మూవీ షూటింగ్ లో పాల్గొనబోతున్నట్టు తెలుస్తుంది. అమెజాన్ ప్రైమ్ సంస్థ నుండి ఒత్తిడి తీవ్ర స్థాయిలో ఉండడంతో మేకర్స్ జెట్ స్పీడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ని పూర్తి చేస్తున్నారు. మే9న ఈ చిత్రానికి ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు అహర్నిశలు కష్టపడుతున్నారు.
Also Read : నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!