Pawan Kalyan Son: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్( AP deputy CM Pawan Kalyan ) కుమారుడు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. సింగపూర్ లో చదువుకుంటున్న పాఠశాలలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో మార్క్ శంకర్ గాయపడ్డాడు. ఆసుపత్రిలో చికిత్స పొందిన అనంతరం డిశ్చార్జ్ అయ్యాడు. ప్రస్తుతం ఆ చిన్నారి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. దీనిపై మెగాస్టార్ చిరంజీవి ట్విట్ చేశారు. ప్రమాదం నుంచి కాపాడినందుకు ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. అయితే కొందరు సోషల్ మీడియా వేదికగా మార్క్ శంకర్ పై అసభ్యకర ట్వీట్లు చేశారు. దీనిపై ఫిర్యాదులు రావడంతో పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. నిందితులను అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే కష్టకాలంలో కూడా సోషల్ మీడియాలో ఇటువంటి కామెంట్స్ పెట్టడం ఏమిటన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది.
Also Read: జగన్ పై దారుణ కామెంట్స్ : కిరణ్ పాపం పండిందిలా..
* పవన్ పర్యటన సమయంలో..
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం పర్యటనలో ఉండే సమయంలో ఈ ఘటన జరిగింది. అడవి తల్లి బాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి విశాఖ( combined Visakha district ) జిల్లాలోని మన్య ప్రాంతంలో పవన్ పర్యటించారు. రెండో రోజు ఉదయం ఆయన పర్యటన కొనసాగుతుండగా కుమారుడికి సింగపూర్ లో ప్రమాదం ఎదురయింది. అయితే రెండో రోజు పర్యటన ముగించుకున్న తరువాతనే పవన్ కళ్యాణ్ సింగపూర్ బయలుదేరి వెళ్లారు. పవన్ తో పాటు చిరంజీవి దంపతులు కూడా సింగపూర్ వెళ్లారు. అగ్ని ప్రమాదంలో భాగంగా పొగ ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో ఇబ్బందికర పరిస్థితులు ఎదురయ్యాయని వైద్యులు తెలిపారు. అయితే ఆసుపత్రిలో వైద్య చికిత్సలు అందించిన తర్వాత మార్క్ శంకర్ కోలుకున్నాడు. డిశ్చార్జ్ కావడంతో ఇంటికి తీసుకెళ్లిపోయారు.
* అసభ్యకరంగా పోస్టులు..
అయితే చిన్న కుమారుడు మార్క్ శంకర్ పై ( mark Shankar )సోషల్ మీడియా వేదికగా చాలామంది ట్వీట్స్ పెట్టారు. మాటల్లో చెప్పలేని విధంగా దారుణంగా రాశారు. అయితే దీనిపై ప్రత్తిపాడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు వచ్చింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా మాట్లాడిన వారిపై చర్యలు తీసుకుంటామని గుంటూరు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. విజయవాడలో సైతం కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఈ ట్వీట్లపై జనసేన నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్న దుర్మార్గులను, ఇలాంటి చర్యలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. కొందరు జనసేన నేతలు నేరుగా హోం శాఖ మంత్రి వంగలపూడి అనితకు ఫిర్యాదు చేశారు.
* సింగపూర్ లోనే చిరంజీవి దంపతులు..
ఇంకోవైపు మార్క్ శంకర్ ఆరోగ్యం పై మెగాస్టార్ చిరంజీవి( megastar Chiranjeevi) ట్వీట్ చేశారు. మా బిడ్డ మార్క్ శంకర్ ఇంటికి వచ్చేసాడు. అయితే ఇంకా కోలుకోవాలి. మా కులదైవమైన ఆంజనేయ స్వామి దయతో, కృపతో త్వరలో పూర్తి ఆరోగ్యంతో మళ్ళీ మామూలుగా ఎప్పటిలానే ఉంటాడు. అంటూ చిరంజీవి విషయాన్ని వెల్లడించారు. మెగాస్టార్ చిరంజీవి దంపతులు కూడా ప్రస్తుతం సింగపూర్ లో ఉన్నారు. పవన్ సైతం అక్కడే ఉన్న సంగతి తెలిసిందే.
Also Read: నేషనల్ మీడియాను షేక్ చేస్తున్న పవన్.. ఆకట్టుకుంటున్న జనసేన వీడియో!