Hari Hara Veeramallu : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న పీరియడ్ చిత్రం ‘హరి హర వీరమల్లు'(Hari Hara Veeramallu). క్రిష్ జాగర్లమూడి(Krish Jagarlamudi) దర్శకత్వం లో మొదలైన ఈ సినిమాకి ఇప్పుడు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. దాదాపుగా 70 శాతం కి పైగా షూటింగ్ పూర్తి అయ్యాక, క్రిష్ కొని అనుకోని కారణాల వల్ల ఈ సినిమా నుండి తప్పుకోవాల్సి వచ్చింది. అప్పటి నుండి జ్యోతి కృష్ణ మిగిలిన భాగానికి దర్శకత్వం వహిస్తున్నాడు. అన్ని అనుకున్న విధంగా జరిగి ఉండుంటే ఈ సినిమా కచ్చితంగా మార్చి 28వ తారీఖున విడుదల అయ్యుండేది. కానీ VFX వర్క్ చాలా వరకు బ్యాలన్స్ ఉండడంతో మే9 న వాయిదా వేయాల్సి వచ్చింది. కానీ ఇప్పుడు మే9న కూడా విడుదల అవ్వడం అనుమానమే అంటూ ఇండస్ట్రీ వర్గాల్లో మరియు మీడియా లో వార్తలు వినిపిస్తున్న నేపథ్యం అమెజాన్ ప్రైమ్(Amazon Prime Video) చాలా సీరియస్ అయ్యిందంటూ మరో వార్త ప్రచారం లోకి వచ్చింది.
Also Read : హరి హర వీరమల్లు’ టీం కి ఫైనల్ వార్నింగ్ ఇచ్చిన అమెజాన్ ప్రైమ్ సంస్థ!
మే9 న విడుదల కాకుంటే, మీతో కుదిరించుకున్న డీల్ క్యాన్సిల్ చేసుకుంటామని, లేకపోతే ముందు అనుకున్న రేట్ కి 50 శాతం తగ్గిస్తామని వార్నింగ్ ఇచ్చారంటూ ఒక వార్త సోషల్ మీడియా లో తెగ వైరల్ గా మారింది. ఈ వార్తలకు చెక్ పెడుతూ కాసేపటి క్రితమే మేకర్స్ ఈ చిత్రం నుండి ట్విట్టర్ ద్వారా ఒక పోస్టర్ ని విడుదల చేశారు. ప్రస్తుతం రీ రికార్డింగ్ వర్క్స్, VFX వర్క్స్, డబ్బింగ్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయని, ఎట్టి పరిస్థితిలోనూ మే9న ఈ సినిమాని విడుదల చేస్తామని చెప్పుకొచ్చారు. ఇప్పటి వరకు ఆడియన్స్ థియేటర్స్ లో ఎప్పుడూ చూడని సినిమాటిక్ విజువల్స్ ని ఈ చిత్రంలో చూపిస్తామని, అభిమానులు చిరకాలం తమ జ్ఞాపకాల్లో పదిలంగా దాచుకునే విధంగా ‘హరి హర వీరమల్లు’ చిత్రం ఉంటుందని అంటున్నారు మేకర్స్.
అయితే అభిమానులు మాత్రం మీరెన్ని చెప్పినా పవన్ కళ్యాణ్ షూటింగ్ పూర్తి చేసేవరకు మే9 న విడుదల అవుతుందంటే ఇక్కడ నమ్మేవాళ్ళు ఎవ్వరూ లేరంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఆయనకు సంబంధించి ఇంకా నాలుగు రోజుల షూటింగ్ బ్యాలన్స్ ఉన్నది. వాస్తవానికి ఈ వారం లోనే ఆ షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకోవాలి, కానీ అకస్మాత్తుగా పవన్ కళ్యాణ్ కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో అగ్నిప్రమాదానికి గురి అవ్వడం వల్ల హుటాహుటిన పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్లాల్సి వచ్చింది. వచ్చే వారం ఆయన హైదరాబాద్ కి వస్తాడని, వచ్చిన వెంటనే ఆ నాలుగు రోజుల షూటింగ్ ని పూర్తి చేసి, డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ముగించి, అమరావతికి తిరిగి వస్తాడని తెలుస్తుంది. త్వరలోనే ఈ చిత్రం నుండి మూడవ మరియు నాల్గవ లిరికల్ వీడియో సాంగ్ ని విడుదల చేయబోతున్నారు మేకర్స్. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రేపు లేదా ఎల్లుండి వచ్చే అవకాశాలు ఉన్నాయి
Also Read : ఫ్యాన్స్ కూడా నమ్మడం లేదు..’హరి హర వీరమల్లు’ పరిస్థితి ఇలా అయ్యిందేంటి!