spot_img
Homeజనరల్Value Of That Skeleton Is Rs.48.5 Crores: ఆ అస్థిపంజర విలువ రూ.48.5 కోట్లు.....

Value Of That Skeleton Is Rs.48.5 Crores: ఆ అస్థిపంజర విలువ రూ.48.5 కోట్లు.. అమెరికాలో వేలం!

Value Of That Skeleton Is Rs.48.5 Crores: డబ్బులు ఉండాలి.. కొనుక్కోవాలన్న ఆసక్తి ఉండాలే కానీ ప్రపంచంలో బహుషా కొనలేనిది ఏదీ ఉండకపోవచ్చు. అది విలువైన వస్తువైనా.. అరుదైన అస్థి పంజరమైనా. ఇలాగే ఓ సంపన్నుడు ఓ అస్థి పంజరాన్ని ఏకంగా రూ.48.5 కోట్లు పెట్టి కొన్నాడు. ఇదేంటిరా బాబు వాడికి ఇదేం పిచ్చి అనుకుంటాం. కాన్నీ ఆయన కొన్నది సాధారణ బొమికల గూడు కాదు.. ప్రపంచంలోనే అరుదైన తొలినాటి డైనోసార్లలో ఒకటైన గొర్గోసారస్‌ అస్థి పంజరం. దీనికి పేరుపెట్టే హక్కును కూడా ఆయనే దక్కించుకున్నాడు.

Value Of That Skeleton Is Rs.48.5 Crores
Dinosaur Skelton

పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవున్న డైనోసార్‌

గొర్గోసారస్‌ అస్థి పంజరం కోట్ల ఏళ్ల కిందటిది. పైగా అది సాదా సీదా అస్థి పంజరం కాదు.. డైనోసార్లలో భయంకరమైన టైరనోసారస్‌ రెక్స్‌ (టీ రెక్స్‌) కంటే ముందునాటి గోర్గోసారస్‌ డైనోసార్‌ది. తొలితరం డైనోసార్లు తిరుగాడిన క్రేటాషియస్‌ కాలానికి చెందిన భయానక మాంసాహార డైనోసార్లలో గొర్గోసారస్‌ ఒకటని.. అమెరికా, కెనడా ప్రాంతాల్లో ఇది జీవించిందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ గొర్గోసారస్‌ అస్థి పంజరాన్ని 2018లో అమెరికాలోని మోంటానాలో జుడిత్‌ నది సమీపంలో గుర్తించారు. పది అడుగుల ఎత్తు, 22 అడుగుల పొడవు ఉన్న ఈ అస్థి పంజరం 7.7 కోట్ల ఏళ్ల కింద తిరుగాడిన డైనోసార్‌దిగా నిర్ధారించారు.

అమెరికాలో వేలం..

ప్రఖ్యాత సోత్‌ బీ వేలం శాల జూలై 21న న్యూయార్క్‌ లో దీనిని ప్రదర్శనకు ఉంచింది. తాజాగా వేలం వేయగా.. 6.1 మిలియన్‌ డాలర్లు (మన కరెన్సీలో సుమారు రూ.48.5 కోట్లు) పలికింది. గొర్గోసారస్‌ డైనోసార్లు రెండు టన్నుల వరకు బరువు తూగేవని.. టీ రెక్స్‌ కన్నా వేగంగా, బలంగా దాడి చేసేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. గార్గోసారస్‌లు ఏకంగా 42 వేల న్యూటన్ల బలంతో కొరికేసేవని అంచనా వేశారు. మనకు తెలిసిన అత్యంత బలమైన సింహాలు, పులులు కొరికే బలం నాలుగైదు వేల న్యూటన్లు మాత్రమే. అంటే సింహం కంటే పదింతలు బలంతో దాడి చేసేవన్న మాట.

రికార్డు ధర పలికినవి ఇవే..

ఇంతకుముందు 1997లో టీ–రెక్స్‌ డైనోసార్‌ అస్థి పంజరాన్ని వేలం వేశారు. దాని విలువ అప్పుడు 8.36 మిలియన్‌ డాలర్లు పలికింది. ఇండియన్‌ కరెన్సీ ప్రకారం రూ.66.36 కోట్లు. 2020లో మరో టీ–రెక్స్‌ అస్థి పంజరాన్ని వేలం వేశారు. దీనిని ఏకంగా 31.8 మిలియన్‌ డాలర్లు, భారత కరెన్సీ ప్రకారం రూ.252.5 కోట్లు పలకడం విశేషం.

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Related News

Most Popular

Azim Premji : జీవితానికి సంబధించి అజీమ్ ప్రేమ్ జీ చెప్పిన 5 సూత్రాలివే..

Azim Premji : భారతదేశ ప్రముఖ పారిశ్రామికవేత్త అజీమ్ ప్రేమ్‌జీ వ్యాపార రంగంలో ఎన్నో విజయాలు సాధించారు. ఆయన ధనవంతుడైనప్పటికీ సాదాసీదా జీవనశైలి, క్రమశిక్షణకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారు. యువతకు, వ్యాపారవేత్తలకు స్ఫూర్తినిచ్చేలా...

Yasho Sagar : రాత్రికి రాత్రే స్టార్‌డమ్.. ‘ఉల్లాసంగా ఉత్సాహంగా’ హీరో విషాదాంతం.. ఇప్పటికీ మిస్టరీయేనా?

Yasho Sagar : ఒక హీరో కి అయినా , హీరోయిన్ కి అయినా కేవలం ఒకటి రెండు సినిమాలతో కలలో కూడా ఊహించని గుర్తింపు దక్కడం అనేది ఒక అదృష్టం. పదుల...
Jana Nayagan OTT release

Jana Nayagan collections : 2వ రోజు దారుణంగా పడిపోయిన ‘జన నాయగన్ ‘ వసూళ్లు.. ఎంత గ్రాస్...

Jana Nayagan collections : తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన లేటెస్ట్ చిత్రం 'జన నాయగన్ ' నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదలైంది. 'భగవంత్' కేసరి కి రీమేక్ గా...
Infosys : ఇన్ఫోసిస్‌లో కొత్త 20 వేల ఉద్యోగాలు... వారికి మాత్రమే ఛాన్స్‌..

Infosys : ఏఐ విజృంభిస్తున్న వేళ.. ఇన్ఫోసిస్ కీలక నిర్ణయం.. ఇకపై జరిగేది అదే

Infosys : టెక్నాలజీలో రోజురోజుకు కొత్త కొత్త మార్పులు వస్తున్నాయి. నిన్న ఉన్న టెక్నాలజీ నేటికీ పాతగా మారిపోతుంది. నేడు ఉన్న టెక్నాలజీ రేపటికి మరుగున పడిపోతోంది. అందువల్లే టెక్నాలజీ యుగంలో ఎప్పుడు...

Jantar Mantar : జంతర్ మంతర్ వద్ద రామనామం.. ఇది అసలు ఊహించలేదుగా..

Jantar Mantar : సాధారణంగా రాముడి నామం మీద పేటెంట్ రైట్స్ మొత్తం బిజెపికి ఉంటాయి. ఎందుకంటే ఆ పార్టీ రాముడి నామం జపించడంలో ఏమాత్రం వెనుకాడదు. పైగా ఆ పార్టీకి సెక్యులర్...
Oktelugu Epaper