గు అంటే అంధకారం, చీకటి అని అర్థం. రు అంటే తొలగించడం అని అర్థం. మనిషిలోని అంధకారాన్ని తొలగించే వాడే గురువు అని చెబుతున్నారు. పూర్వం భారతదేశంలో గురుకులం వ్యవస్థ అమలులో ఉండేది. విద్యార్థి జీవితం గురుకులంలోనే ప్రారంభమయ్యేది. గురు శిష్యుల బంధం ఎంతో పవిత్రమైనది. నేటి కాలంలో అర్థమే మారిపోయింది. శిష్యులను బిడ్డలుగా చూసుకునే గురువులుండడం గొప్ప విషయమే. గురు పూర్ణిమ రోజు త్రిమూర్తులను పూజించడం వల్ల పుణ్యం వస్తుందని పురాణాలు చెబుతున్నాయి. గురు పూర్ణిమను ఆషాఢ పౌర్ణమి రోజు గురుపూర్ణిమ, వ్యాసపూర్ణిమగా జరుపుకుంటారు.
ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురించి ప్రాచీన గాథలు ఉన్నాయి. పూర్వకాలంలో వారణాసిలోని ఒక పేద బ్రాహ్మణ దంపతులు ఉండేవారు. ఆ బ్రాహ్మణుడికి వేదవతి అనే సతీమణి ఉండేది. వారికి సంతానం లేకపోవడంతో ఎన్నో నోములు చేశారు. అయినా ఫలితం లేకుండా పోయింది. దీంతో వ్యాస భగవానుడిని కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ఒకరోజు ఒక భిక్షువు రూపం ధరించి దండధరుడైన వ్యక్తిని వేదనిధి గమనిస్తాడు.
వెంటనే వేదనిధి వారి పాదాలను పట్టుకుంటాడు. అయినా ఆయన చీదరించుకుంటాడు. చివరికి ఏం కావాలని అడుగుతారు. దీనికి అతడు తమ ఇంటికి బోజనానికి రావాలని ఆహ్వానిస్తాడు. దీనికి అతడు అనుగ్రహించి వారి ఇంటికి వస్తాడు. ఈ నేపథ్యంలో మీకు ఏం వరం కావాలని అడుగుతాడు. తమకు సంతాన భాగ్యం కావాలని కోరుతారు. దీనికి ఆయన మీకు పది మంది మగ సంతానం కలుగుతారని చెప్పి వెళ్లిపోతాడు.
పూర్ణిమ రోజు సత్యనారాయణ వ్రతం నిర్వహిస్తుంటారు. షిర్డీ సాయిబాబా ఆలయంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. గురుపూజోత్సవం జరిపి గురువులను సత్కరించి ఆశీర్వాదం తీసుకుంటే మంచిదని భావిస్తారు. దేవాలయాల్లో పాలాభిషేకం, పంచామృతాభిషేకం చేయించే వారికి పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. అరటిపండ్లు, ఉడకబెట్టిన శనగలను నివేదన కోసం ఉపయోగిస్తారు.
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Guru purnima 2021 what to do what not to do
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com