
దేశంలో కరోనా వైరస్ థర్డ్ వేవ్ తప్పదనే అంచనాల నేపథ్యంలో ఎయిమ్స్ చీఫ్ డాక్టర్ రణ్ దీప్ గులేరియా సానుకూల వ్యాఖ్యలు చేశారు. దేశ జనాభాలో అత్యధికులను మెరుగైన రీతిలో రోగనిరోధక శక్తి ఉందని సెరోసర్వేను ఉటంకిస్తూ పేర్కొన్నారు. వైరస్ స్వభావం ఎలా మారుతుందనేది మనం అంచనా వేయలేమని.. అయితే రాబోయే నెలల్లో అది అన్యూహ్యంగా పరివర్తన చెందేలా కనిపించడం లేదని అన్నారు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం థర్డ్ వేవ్ తలెత్తకుండా జాప్యం చేయడంతో పాటు థర్డ్ వేవ్ వస్తే దాన్ని తీవ్రతరం కాకుండా పరిమితం చేసేందుకు అవకాశం ఉంటుందని అన్నారు.