Homeఎంటర్టైన్మెంట్Dil Raju: దిల్ రాజు హవా తగ్గిపోయిందా..?దానికి వాళ్ళే కారణమా..?

Dil Raju: దిల్ రాజు హవా తగ్గిపోయిందా..?దానికి వాళ్ళే కారణమా..?

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు…ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ లో అత్యధిక సక్సెస్ రేట్ కలిగి ఉన్న ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన నుంచి చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి. పెద్ద హీరోలు అతనికి డేట్స్ ఇవ్వడం లేదా? లేదంటే […]

Dil Raju: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనివిని ఎరుగని రీతిలో గొప్ప సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న ప్రొడ్యూసర్లలో దిల్ రాజు ఒకరు…ఆయన నుంచి వచ్చే ప్రతి సినిమా ప్రేక్షకుడిని మెప్పిస్తుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇండస్ట్రీ లో అత్యధిక సక్సెస్ రేట్ కలిగి ఉన్న ప్రొడ్యూసర్ కూడా తనే కావడం విశేషం… ప్రస్తుతం ఆయన నుంచి చిన్న సినిమాలు మాత్రమే వస్తున్నాయి. పెద్ద హీరోలు అతనికి డేట్స్ ఇవ్వడం లేదా? లేదంటే అతను వాళ్లతో సినిమాలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదా అనే ధోరణిలో కొన్ని అభిప్రాయాలైతే వ్యక్తమవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా దిల్ రాజుకి గేమ్ చేంజర్ సినిమాతో భారీ దెబ్బ పడింది.

ఆ సినిమా వల్లే అతను చాలా వరకు నష్టపోయాడు అంటు చాలామంది చెబుతూ ఉంటారు. కానీ ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే సినిమాతో ఆ నష్టాలను చాలా వరకు కవర్ చేశాడు. దాంతో ఇప్పుడు ఎలాగైనా సరే మంచి సినిమాలు చేసి సూపర్ సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో దిల్ రాజు ముందుకు సాగుతున్నాడు.

ఇక ప్రస్తుతం మైత్రి మూవీ మేకర్స్ అలాగే సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ మీద పెద్ద సినిమాలైతే వస్తున్నాయి. వాళ్లతో దిల్ రాజు పోటీ పడలేకపోతున్నాడు అంటూ మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం దిల్ రాజు భారీ సక్సెస్ ను సాధించాల్సిన అవసరమైతే ఉంది… ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్న దిల్ రాజు ఆ సినిమాతో ఎలాగైనా సరే బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సాధించాలని చూస్తున్నాడు.

ఆ మూవీతో సక్సెస్ వస్తే మరోసారి టాప్ ప్రొడ్యూసర్ గా తనను తాను ఎలివేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నాడు. తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుంది. ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే… చూడాలి మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ ను సాధిస్తుంది అనేది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper