Homeఎంటర్టైన్మెంట్Vishwak Sen: ఆరోజు రవితేజ నన్ను నిజంగానే కొట్టాడు అంటూ కమెడియన్ ప్రభాస్ శ్రీను షాకింగ్...

Vishwak Sen: ఆరోజు రవితేజ నన్ను నిజంగానే కొట్టాడు అంటూ కమెడియన్ ప్రభాస్ శ్రీను షాకింగ్ కామెంట్స్!

Vishwak Sen: రెబల్ స్టార్ ప్రభాస్ కి అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించి, ఇప్పటికీ ఆ జాబ్ లో కొనసాగుతూ, మరోపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ శ్రీను. దశాబ్ద కాలం పైగా ఇతను సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూనే ఉన్నాడు. ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ తో, తనదైన హావభావాలతో కామెడీ ని పండించడంలో ఈయన దిట్ట. రీసెంట్ గానే ఈయన ప్రభాస్ తో […]

Vishwak Sen: రెబల్ స్టార్ ప్రభాస్ కి అసిస్టెంట్ గా కెరీర్ ని ప్రారంభించి, ఇప్పటికీ ఆ జాబ్ లో కొనసాగుతూ, మరోపక్క కమెడియన్ గా సినిమాలు చేస్తూ, తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు ప్రభాస్ శ్రీను. దశాబ్ద కాలం పైగా ఇతను సినిమాల్లో కమెడియన్ గా కొనసాగుతూనే ఉన్నాడు. ఒక డిఫరెంట్ డైలాగ్ డెలివరీ తో, తనదైన హావభావాలతో కామెడీ ని పండించడంలో ఈయన దిట్ట. రీసెంట్ గానే ఈయన ప్రభాస్ తో కలిసి ‘రాజా సాబ్’ చిత్రం లో నటించాడు. త్వరలోనే విడుదల కాబోతున్న పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం లోనూ ఈయన కీలక పాత్ర పోషించాడు. నేటి తరం సూపర్ స్టార్స్ అందరితో కలిసి నటించిన ఈయన, విక్రమార్కుడు షూటింగ్ సమయం లో జరిగిన ఒక సంఘటన గురించి రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకోగా, అది సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

‘విక్రమార్కుడు’ ముందు ప్రభాస్ శ్రీను పలు సినిమాల్లో నటించినప్పటికీ, ఆయనకు మంచి గురింపు ని తెచ్చిపెట్టింది మాత్రం ఈ సినిమానే, ఇందులో ఆయన రవితేజ ఊర్లోకి అడుగుపెట్టినప్పుడు, ఆయన్ని టీజ్ చేసే పాత్రలో కనిపిస్తాడు. ఆ తర్వాత రవితేజ ప్రభాస్ శ్రీను తో పాటు, అతని గ్యాంగ్ మొత్తాన్ని చొక్కాలు విప్పించి, మోకాళ్ళ మీద కూర్చోబెట్టి కర్ర తీసుకొని వీపు మీద కొడుతాడు. ఈ సన్నివేశం గురించి ప్రభాస్ శ్రీను మాట్లాడుతూ ‘రవితేజ గారు చాలా భోళా మనిషి. ఏ సహాయం కావాలన్నా చేస్తాడు. మనసులో ఏది దాచుకోడు, నచ్చకపోతే వెంటనే ముఖం మీద చెప్పేస్తాడు . అది ఆయనలో ఉన్న గొప్ప స్వభావం. సమయం వృధా చేయడం ఆయనకు అసలు ఇష్టం ఉండదు. ఎవరైనా టైం వేస్ట్ చేస్తే రవితేజ కి పిచ్చి కోపం వచ్చేస్తుంది’ అంటూ చెప్పుకొచ్చాడు.

ఇంకా ఆయన మాట్లాడుతూ ‘ విక్రమార్కుడు షూటింగ్ సమయం లో రవితేజ నన్ను కొట్టే సన్నివేశాల్లో, నిజంగానే మాకు దెబ్బలు తగిలేవి. వెనుక ప్యాడ్స్ పెట్టేవారు కాదు. నిజంగానే దెబ్బలు తగిలాయి. అందులో కన్నన్ అనే రైటర్ కూడా ఉన్నాడు. అతనికి ఆ దెబ్బల కారణం గా జ్వరం కూడా వచ్చేసింది’ అంటూ చెప్పుకొచ్చాడు ప్రభాస్ శ్రీను. ఇది విన్న నెటిజెన్స్ హీరోలకు చిన్న గాయం కూడా అవ్వనివ్వకుండా డైరెక్టర్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు, కానీ ఇలాంటి చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఎన్ని దెబ్బలు తగిలిన ఫర్వాలేదా?, వాళ్ళు కూడా మనుషులే కదా, ఇది చాలా అన్యాయం అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ చేస్తున్నారు.

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper