Homeఎంటర్టైన్మెంట్స్టార్ డైరెక్టర్ ను దూరం పెట్టిన స్టార్ హీరో !

స్టార్ డైరెక్టర్ ను దూరం పెట్టిన స్టార్ హీరో !

తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అంటే రజినీకాంతే.. కానీ, రజిని తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న ఏకైక స్టార్ మాత్రం హీరో ‘విజయ్’నే. అందుకే, విజయ్ తో ఒక్క సినిమా అయినా లైఫ్ లో చేయాలని ప్రతి తమిళ్ దర్శకుడు కలలు కంటాడు. అయితే, విజయ్ మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తాడట. ఇంతకీ.. ఎవరు ఆ డైరెక్టర్ అంటే.. దర్శకుడు మురుగదాస్. ఒకప్పుడు విజయ్, దర్శకుడు మురుగదాస్ థిక్ […]

Vijay
తమిళ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ అంటే రజినీకాంతే.. కానీ, రజిని తరువాత ఆ స్థాయిలో స్టార్ డమ్ ఉన్న ఏకైక స్టార్ మాత్రం హీరో ‘విజయ్’నే. అందుకే, విజయ్ తో ఒక్క సినిమా అయినా లైఫ్ లో చేయాలని ప్రతి తమిళ్ దర్శకుడు కలలు కంటాడు. అయితే, విజయ్ మాత్రం ఓ దర్శకుడితో సినిమా చేయడానికి తెగ ఆసక్తి చూపిస్తాడట. ఇంతకీ.. ఎవరు ఆ డైరెక్టర్ అంటే.. దర్శకుడు మురుగదాస్. ఒకప్పుడు విజయ్, దర్శకుడు మురుగదాస్ థిక్ ఫ్రెండ్స్. ఇద్దరు సినిమాలతో సంబంధం లేకుండా తరుచూ కలుస్తూ ఉంటారు. పర్సనల్ గానూ ఎప్పుడూ టచ్ లో ఉంటారు.

Also Read: ఎలిమినేటైన అవినాష్ కి నాగార్జున అదిరిపోయే గిఫ్ట్

ఇక సినిమాల విషయానికి వస్తే.. “తుపాకీ”, “కత్తి”వంటి సూపర్ హిట్స్ వీరి కాంబినేషన్ లో వచ్చాయి. మురుగదాస్ ఆలోచనల్లోని ఫ్రెష్ నెస్ అంటే తనకు చాల ఇష్టమని చెప్పే విజయ్, ఉన్నట్టు ఉండి మురగదాస్ కి దూరం జరిగినట్టు తెలుస్తోంది. మురగదాస్ ఐడియాల పాతబడి పోవడం ఆయనకు స్టార్లకు గ్యాప్ పెరిగిపోయింది. లాస్ట్ సినిమాలు “స్పైడర్”, “సర్కార్” సినిమాలు మురగదాస్ టాలెంట్ పై అనుమానాలను రేకెత్తించాయి. “సర్కార్” సినిమా రిలీజ్ అయిన వెంటనే విజయ్ డిసైడ్ అయ్యాడని తెలుస్తోంది.

Also Read: డిసెంబర్ 31.. జబర్దస్త్ వర్సెస్ ఢీ..!

కొన్నాళ్ళు మురుగదాస్ కాంబినేషన్ కి దూరంగా ఉండాలనుకుంటున్నాడట. ఇప్పటికే వరుసగా అట్లీ డైరెక్షన్లో “విజిల్”, లోకేష్ కనగరాజ్ తో “మాస్టర్” సినిమాలు చేసిన విజయ్, తన 65వ సినిమాని మళ్ళీ మురుగదాస్ దర్శకత్వంలో చేయాలనుకున్నాడు. ఈ విషయాన్ని సన్ పిక్షర్న్ గతంలో అధికారికంగా ప్రకటించింది కూడా. ఐతే, విజయ్ మాత్రం తన 65వ చిత్రం దర్శకత్వాన్ని మాత్రం అప్ కమింగ్ డైరెక్టర్ కి అప్పచెప్పేశాడు. నెల్సన్ దిలీప్ కుమార్ అనే యువ దర్శకుడు.. విజయ్ నుండి ఈ ఛాన్స్ ను అందుకున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.

Related News

Most Popular

Oktelugu Epaper