Homeఎంటర్టైన్మెంట్Vijay emotional comments: 'జన నాయగన్' విషయంలో నా నిర్మాతలను చూస్తుంటే ఏడుపొస్తుంది అంటూ విజయ్...

Vijay emotional comments: ‘జన నాయగన్’ విషయంలో నా నిర్మాతలను చూస్తుంటే ఏడుపొస్తుంది అంటూ విజయ్ ఎమోషనల్ కామెంట్స్!

Vijay emotional comments: సినిమాలు ,రాజకీయాలు రెండు వేర్వేరు ప్రపంచాలు. ముఖ్యంగా సినీ నటులు రాజకీయాల్లోకి వచ్చేటప్పుడు కచ్చితంగా సినిమాలను వదిలేయాల్సి ఉంటుంది. ఎందుకంటే రెండిటిని బ్యాలన్స్ చేయడం అసాధ్యం. గతంలో సీనియర్ ఎన్టీఆర్, మెగాస్టార్ చిరంజీవి సినిమాలకు పూర్తిగా బ్రేక్ ఇచ్చి మాత్రమే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం, రాజకీయాలు చేస్తూ మరోపక్క సినిమాలు కూడా చేస్తూ వస్తున్నాడు. ఇప్పుడైతే ఆయన ప్రభుత్వమే నడుస్తుంది కాబట్టి, ఆయన సినిమాలకు ఎలాంటి సమస్యలు రావు. కానీ 2019 నుండి 2024 మధ్యలో వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ సినిమాలు ఎన్ని ఇబ్బందులను ఎదురుకోవాల్సి వచ్చిందో మనమంతా చూసాము. ఇప్పుడు తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) పరిస్థితి కూడా అలాగే తయారైంది. ఈమధ్య కాలం లోనే ఆయన TVK అనే పార్టీ ని స్థాపించి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

DMK పార్టీ పై, అదే విధంగా కేంద్రం లో ఉన్నటువంటి బీజేపీ పార్టీ పై ఆయన ఘాటు విమర్శలు చేస్తూ ముందుకు పోతూ ఉన్నాడు. ఈ క్రమం లోనే జనవరి 9న ఆయన హీరోగా నటించిన ‘జన నాయగన్ ‘ చిత్రం విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి సర్టిఫికేట్ ఇవ్వలేదు. విడుదల అవ్వాల్సిన సినిమా ఆగిపోయింది. నిర్మాతకు వ్యాపారం లో కోట్ల రూపాయిల నష్టాలు. ఎప్పుడు విడుదల అవుతుందో కూడా తెలియని దయనీయమైన పరిస్థితి ఈ చిత్రానికి ఏర్పడింది. చివరిసారిగా తమ అభిమాన హీరో ని వెండితెర పై చూసుకుందామని ఆశగా ఎదురు చూసిన ఆయన అభిమానుల బాధ వర్ణనాతీతం. అయితే రీసెంట్ గానే విజయ్ ఒక నేషనల్ మీడియా ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూ లో ఆయన ‘జన నాయగన్'(Jana Nayagan Movie) గురించి మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

ఆయన మాట్లాడుతూ ‘నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు సినిమాలకు పూర్తిగా దూరం అవ్వాలి అనే కఠినమైన నిర్ణయం తీసుకున్నాను. ఎందుకంటే రాజకీయాల్లో ఉంటూ సినిమాలు చేస్తే, నా సినిమా నిర్మాతలను ఇబ్బంది పెడుతారు. అందుకే సినిమాలకు దూరమైతే, అలాంటివి ఏమి చెయ్యలేరు కాబట్టి, ధైర్యం గా రాజకీయాల్లో ఎంత దూరమైనా వెళ్లొచ్చు అనే ఉద్దేశ్యంతోనే సినిమాలకు దూరం అవ్వాలని అనుకున్నాను. ఇప్పుడు నా ‘జన నాయగన్’ చిత్రానికి ఎదురు అవుతున్న సమస్యలు మీరంతా చూస్తూనే ఉన్నారు. ఇలాంటి సమస్యలు వస్తాయని ముందే ఊహించాను. ఇప్పుడు నా నిర్మాతలను చూస్తుంటే చాలా బాధ వేస్తోంది’ అంటూ విజయ్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

AI Impact On Education

AI Impact On Education: ఏఐతో మూలాలే మటాష్.. పరిస్థితి ఎంతకు దిగజారిందంటే..

AI Impact On Education: ఏఐ తో ఇప్పటివరకు కేవలం ఐటీ ఉద్యోగాలు మాత్రమే పోయాయని అనుకున్నాం. ఎంట్రీ లెవెల్.. మిడ్ లెవెల్ ఉద్యోగాలు మాత్రమే మటాష్ అయిపోయాయని మీడియా వార్తల్లో...
Rahul Gandhi Injury

Rahul Gandhi Injury: రాహుల్ రక్తం కళ్ళ చూశారు.. మోడీకి ఇది మైనస్సే

Rahul Gandhi Injury: మల్లికార్జున కార్గే నిన్న తన పుట్టినరోజు జరుపుకున్నారు.. ఆయనకు శుభాకాంక్షలు తెలియజేయడానికి కాంగ్రెస్ పార్టీ నాయకులు వెళ్లారు.. పోలీసులు కూడా వారి కేవలం శుభాకాంక్షలు తెలియజేయడానికి మాత్రమే వెళ్తున్నారని...
Ishan Kishan

Ishan Kishan: ఐపీఎల్ లో పరుగుల వరద పారించాడు.. జాతీయ జట్టులో తేలిపోతున్నాడు.. ఇలా అయితే కష్టమే..

Ishan Kishan: అప్పట్లో దూకుడుగా బ్యాటింగ్ చేసేవాడు. వన్డేలో అతడికి డబుల్ సెంచరీ కూడా ఉంది. ఈ స్థాయిలో ఆడిన అతడు స్థిరత్వాన్ని కొనసాగించలేకపోయాడు. దీనికి తోడు క్రమశిక్షణలోపించడంతో జట్టులో స్థానం...
Vijayendra Prasad

Vijayendra Prasad: రాజమౌళి కి నచ్చినట్టుగా కథ రాయడం చాలా కష్టం అంటున్న విజయేంద్రప్రసాద్… ఆయన అడిగేవి ఇవే…

Vijayendra Prasad: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకుడిగా తన కెరియర్ ను మొదలుపెట్టిన రాజమౌళి ఆ తర్వాత పాన్ ఇండియా పరిధిని టచ్ చేస్తూ ప్రేక్షకులోకాన్ని అలరిస్తున్నాడు. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులందరిని...
Mahesh Babu

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...
Oktelugu Epaper