TV5 Sambasiva Rao: ఒక న్యూస్ ఛానెల్ లో డిబేట్ నిర్వహిస్తున్నప్పుడు వర్తమాన అంశాలను ప్రామాణికంగా తీసుకుంటారు. రాజకీయాలలో ఏమైనా మార్పులు చేర్పులు చోటు చేసుకుంటే వాటి ఆధారంగా డిబేట్ నిర్వహిస్తూ ఉంటారు. డిబేట్లో కూడా సాధ్యమైనంతవరకు రాజకీయ పార్టీల ప్రతినిధులను పిలుస్తుంటారు. వారి అభిప్రాయాలకు విలువనిస్తూ చర్చ వేదికను నడిపిస్తుంటారు..
ఒకప్పుడు డిబేట్ లు విషయాను సారంగా సాగేవి. అందులో పాల్గొనే వారు కూడా తమ దగ్గర ఉన్న సమాచారాన్ని క్రోడీకరించుకొని చెప్పేవారు. తద్వారా ప్రజలకు ఎంతో కొంత విషయాలు తెలిసేవి. పైగా నాటి చర్చా వేదికల్లో గట్టిగా అరవడం ఉండేవి కాదు. దాడులకు.. ప్రతిదారులకు పాల్పడే ఆస్కారం ఉండేది కాదు. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. న్యూస్ ఛానల్స్ వార్తలను కాకుండా సంచలనాలను ప్రసారం చేస్తున్నాయి. రాజకీయ పార్టీలకు డబ్బా కొట్టే యంత్రాలుగా మారిపోవడంతో న్యూస్ చానల్స్ ను అంత ఈజీగా నమ్మే పరిస్థితులు ఉండడం లేదు. తద్వారా అందులో ప్రసారమయ్యే వార్తలను.. చర్చ వేదికలను రాజకీయపరమైన కార్యక్రమాలు గానే ప్రజలు చూస్తున్నారు.
తెలుగులో ఎన్నో న్యూస్ చానల్స్ ఉన్నాయి. అందులో కొన్ని మాత్రమే ప్రముఖమైనవి. అలా ప్రముఖమైన న్యూస్ ఛానల్స్ జాబితాలో టీవీ5 కూడా ఉంటుంది. టీవీ 5లో ప్రైమ్ టైం డిబేట్ ను మూర్తి లేదా సాంబశివరావు నిర్వహిస్తారు. మూర్తి వ్యవహార శైలి పక్కన పెడితే.. సాంబశివరావు కాస్త భిన్నంగా షో నడిపిస్తారు. కొన్ని సందర్భాలలో ఆయన
బరస్ట్ అవుతుంటారు. మరికొన్ని సందర్భాలలో డిబేట్ కు సంబంధం లేని వ్యవహారాన్ని తెరపైకి తీసుకొస్తారు. ఎలాగూ సాంబశివరావు డిబేట్ ను వైసిపి అనుకూల నెటిజన్లు జాగ్రత్తగా పరిశీలిస్తుంటారు. కొన్ని సందర్భాలలో ఆయన టంగ్ స్లిప్ అయిన బైట్ లను సేకరించి.. వాటిని సోషల్ మీడియాలో పెడుతుంటారు.
అటువంటి వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో కనిపిస్తోంది. కనిపిస్తున్న ఆ వీడియోలో సాంబశివరావు టీవీ5 చైర్మన్ బి ఆర్ నాయుడు కు సంబంధించిన విషయాలను సాంబశివరావు ప్రస్తావించారు. ” బి ఆర్ నాయుడు ఆఫీసుకు రావడం మానేశారు. వచ్చినా కూడా వెంటనే వెళ్ళిపోతున్నారు. ఆయన మదిలో నిత్యం వెంకటేశ్వర స్వామి కనిపిస్తున్నారు. ఆ కొండలు దర్శనమిస్తున్నాయి. ఆయన తాగే మంచి నీళ్లు కూడా ఇంటి వద్ద నుంచి తీసుకెళ్తున్నారు. టీవీ5 డ్రైవర్లే ఆయన వాహనాలను తోలుతున్నారు. వాళ్లు రైళ్లల్లో ముందుగా వస్తారు. ఆ తర్వాత బిఆర్ నాయుడు వస్తారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన ఏ వస్తువును కూడా బిఆర్ నాయుడు సొంతానికి వాడుకోవడం లేదు. ఆయనకు వెంకటేశ్వర స్వామి అంటే విపరీతమైన భక్తి. చంద్రబాబు లాగానే ఆయన కూడా అవుతున్నారని” సాంబశివరావు పేర్కొన్నారు
బి ఆర్ నాయుడును ఉద్దేశించి సాంబశివరావు చేసిన ఈ వ్యాఖ్యలను వైసిపి అనుకూల సోషల్ మీడియా కార్యకర్తలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. అంతేకాదు, డిబేట్ కు సంబంధం లేని విషయాలను ఇక్కడ ప్రస్తావించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. “పదోన్నతి, వేతనాలలో పెంపుదల కావాలంటే సార్ ను డైరెక్ట్ గా అడగాలి. అంతేగాని ఇలా పబ్లిక్ లో రుద్దడం ఏంటి నాయన” అంటూ సాంబశివరావును ఉద్దేశించి విమర్శలు చేస్తున్నారు.
ఇంక్రిమెంట్ కావాలా నాయనా??
ఇంక్రిమెంట్, ప్రమోషన్ కావాలంటే, సార్ ను డైరెక్ట్ గా అడగాలి కానీ…ఇలా పబ్లిక్ లో రుద్దుడేంటి నాయనా?? pic.twitter.com/p6TfcrXfKK— The Samosa Times (@Samotimes2026) January 30, 2026