Vijay Deverakonda Kingdom Vs Nithiin Thammudu: నితిన్ (Nithin) హీరోగా వేణు శ్రీరామ్ (Venu Sriram) దర్శకత్వంలో వస్తున్న తమ్ముడు(Thammudu) సినిమా మీద ప్రేక్షకుల్లో మంచి అంచనాలైతే ఉన్నాయి. ఇక ఆ అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా నుంచి నిన్న ఒక ట్రైలర్ అయితే రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కూడా ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడంతో ఈ సినిమా జులై 4 వ తేదీన ప్రేక్షకుల ముందు రాబోతున్న నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలైతే ఏర్పడ్డాయి. ఇప్పటికే జులై 4న హీరోగా గౌతమ్ తిన్ననూరి (Goutham Thinnanuri) దర్శకత్వంలో వస్తున్న కింగ్ డమ్ (Kingdom)సినిమా వస్తుంది అంటూ మేకర్స్ అనౌన్స్ చేసినప్పటికి ఈ సినిమాకు సంబంధించిన అప్డేట్ అయితే ఇవ్వడం లేదు. మరి నితిన్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఒకేరోజు పోటీ పడుతున్నారు. కాబట్టి ఈ ఇద్దరిలో ఎవరు విజయం సాధిస్తారు. ఎవరిని ఎవరు బీట్ చేసి సక్సెస్ ఫుల్ గా నిలుస్తారు అనేది ఇప్పుడు కీలకంగా మారింది. నిజానికి కింగ్ డమ్ సినిమా ఎప్పుడో రావాల్సింది. కానీ అనుకోని కారణాలవల్ల ఈ సినిమాని పోస్ట్ పోన్ చేశారు. జులై 4 వ తేదీన ఈ సినిమా అంగరంగ వైభవంగా రిలీజ్ అవ్వబోతుంది అంటూ సినిమా మేకర్స్ అయితే అనౌన్స్ చేశారు. మరి దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు సంబంధించిన పనులను శరవేగంగా పూర్తి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నట్టుగా తెలుస్తోంది.
ఇక నితిన్, విజయ్ దేవరకొండ ఇద్దరికీ యూత్ లో మంచి ఫాలోయింగ్ అయితే ఉంది. ప్రస్తుతం ఇద్దరు ఫ్లాపుల్లో ఉన్నారు మరి ఈ ఇద్దరు హీరోలు స్టార్ డమ్ ని సంపాదించుకోవడానికి మంచి సక్సెస్ లను సాధించి ముందుకు దూసుకెళ్లాలి అంటే ఈ సినిమాలతో వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
ఇక వాళ్ళ మార్కెట్ ని కూడా పెంచుకోవాలంటే మాత్రం ఈ సినిమాలు తప్పనిసరిగా సక్సెస్ లను సాధించాల్సిన అవసరమైతే ఉంది… మరి కింగ్ డమ్ జులై 4 న వస్తుందా? లేదా అనే విషయం మీద మరోసారి క్లారిటీ ఇవ్వాల్సిన అవసరమైతే ఉంది. ఎందుకంటే ఈ సినిమా నుంచి ఇప్పటికే ఒక టీజర్ ని రిలీజ్ చేశారు. అలాగే లిరికల్ సాంగ్స్ ని కూడా రిలీజ్ చేశారు.
ఇక ట్రైలర్ ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే దాని మీదనే సర్వత్ర ఆసక్తి అయితే నెలకొంది. రిలీజ్ కి మరొక 25 రోజులు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఈ సినిమాల విషయంలో ఆయా మేకర్స్ ఎలాంటి డిసిషన్స్ తీసుకుంటారు. ఒకవేళ ఏదైనా ఒక సినిమాను పోస్ట్ పోన్ చేసే అవకాశాలు ఉన్నాయా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…