Rana Daggubati on abusing Venkatesh: ఇప్పటివరకు తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎవరికీ సాధ్యం కానీ రీతిలో మంచి సినిమాలను చేస్తూ ముందుకు దూసుకెళ్తున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. ఇక హీరో గానే కాకుండా భిన్నమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పించగలిగే కెపాసిటి ఉన్న నటులు మాత్రం కొంతమందే ఉన్నారు అందులో రానా ఒకరు. ఆయన చేసిన సినిమాలు చాలా తక్కువే అయినప్పటికి నటుడిగా తను చాలా మంచి గుర్తింపైతే సంపాదించుకున్నాడు. ఇప్పటికే ఆయన హీరోగా, విలన్ గా పలు రకాలుగా కనిపిస్తూ ప్రేక్షకులను రంజింప చేస్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా రానా చేసిన రానా నాయుడు సిరీస్ సీజన్ 2 ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలను చెబుతూనే రానా(Rana) కొన్ని ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నాడు… ‘రానా నాయుడు’ (Rana Naidu) మొదటి సీజన్ చేస్తున్న సమయంలో తన బాబాయ్ అయిన వెంకటేష్ (Venkatesh) కి తనకి మధ్య చాలా మంచి బాండింగ్ కుదరడమే కాకుండా నటించే సమయంలో చాలా ఈజీగా సన్నివేశాలను చేసుకుంటూ ముందుకు సాగామని చెప్పాడు.
అలాగే హిందీలో డబ్బింగ్ చెబుతున్నప్పుడు తనకు ఏమీ ఇబ్బంది లేకుండా అయిపోయిందని కానీ తెలుగులో డబ్బింగ్ చెప్పాల్సి వచ్చినప్పుడు తన బాబాయిని బూతులు తిట్టాల్సి రావడం వల్ల ఆయన కొంతవరకు అన్ కంఫర్ట్ ఫీలయ్యారట. కానీ నటుడు అనే వాడు అన్ని రకాల పాత్రలు చేయాలి, అన్ని రకాలుగా మాట్లాడాలి.
కాబట్టి పర్సనల్ వ్యక్తులను పక్కనపెట్టి క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి డబ్బింగ్ అయితే చెప్పారట. ఇక ఈ సినిమా ద్వారా అటు వెంకటేష్ కి, ఇటు తనకి చాలా మంచి గుర్తింపు వచ్చిందని ఇప్పటివరకు వాళ్ళిద్దరు ఎప్పుడు అలాంటి పాత్రలు చేయలేదని అందుకే చాలెంజింగ్ గా తీసుకొని ఈ సీరియస్ గా ఈ పాత్రలను చేసామని ఆయన చెబుతూ ఉండడం విశేషం… మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ కంటెంట్ తో సినిమాలు వస్తున్నాయి.
అలాగే సిరీస్ లు కూడా వస్తున్నాయి. కానీ బూతు డైలాగులతో రానా నాయుడు సిరీస్ వచ్చి సక్సెస్ ను సాధించింది. ఈ సిరీస్ కి అప్పట్లో మంచి ఆదరణ దక్కింది… అలాగే వెంకటేష్ ఇలాంటి పాత్ర చేయడం పట్ల కొంతవరకు కొన్ని విమర్శలు కూడా వచ్చాయి. ఏది ఏమైనప్పటికీ అల్టిమేట్ గా సిరీస్ అయితే మంచి క్రేజ్ ను సంపాదించుకుంది దాంతో ఇప్పుడు ఈ సిరీస్ కి సీజన్ 2 కూడా వస్తుంది…