Allu Aravind Sensational comments on Niharika: అల్లు అరవింద్(Allu Aravind) ‘గీతా ఆర్ట్స్'(Geetha Arts) సంస్థ లో అతి ముఖ్యమైన వ్యక్తులలో ఒకరు బన్నీవాసు(Bunny Vasu). ఆ సంస్థ తో కలిసి ‘GA2 ఆర్ట్స్’ మీద ఎన్నో సూపర్ హిట్ సినిమాలను నిర్మించాడు. రీసెంట్ గా శ్రీవిష్ణు హీరో గా నటించిన ‘సింగిల్’ అనే సూపర్ హిట్ చిత్రం ఈ సంస్థ నుండి వచ్చినదే. అలా నిర్మాతగా ఒక స్థాయికి వచ్చిన తర్వాత బన్నీ వాసు ప్రత్యేకంగా BV ఆర్ట్స్ అనే సంస్థ ని స్థాపించాడు. ఇది కేవలం తన స్నేహితులతో కలిసి చేసే సినిమాల కోసం మాత్రమే స్థాపించినట్టు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొచ్చాడు. ఈ సంస్థ లో తెరకెక్కిన మొట్టమొదటి చిత్రం ‘మిత్ర మండలి'(Mitra Mandali). నేడు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ని కాసేపటి క్రితమే AAA సినిమాస్ లో ఒక ఈవెంట్ ని ఏర్పాటు చేసి విడుదల చేశారు.
ఈ ఈవెంట్ లో అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి. ఆయన మాట్లాడుతూ ‘నన్ను ఇక్కడ వీళ్లంతా పెద్ద వాడిని చేసి నిలబెట్టారు. కానీ నాకు నిత్యం యువకులతో సమయాన్ని వెచ్చించడం ఇష్టం. వాళ్ళతో నేను ఎక్కువ గడపడం వల్ల వాళ్ళు ఎంత లాభపడ్డారో నాకు తెలియదు కానీ, నేను మాత్రం చాలా లాభపడ్డాను. ఇప్పుడే ఆ అమ్మాయి (నిహారిక NM) తన హృదయం లో నాకు చోటు ఇచ్చింది కాబట్టి నన్ను కుర్రాడిగానే చూడండి. బన్నీ వాసు, SKN వీళ్ళందరూ నా పిల్లలు అని అంటున్నారు. వాళ్ళు నా పిల్లలు కాదు, గీతా ఆర్ట్స్ కి పిల్లలు. మళ్ళీ నా పిల్లలు అని చెప్తే ఆస్తి లో వాటాకి వస్తారు. అప్పుడు నేను మిగిలిన నా ఇద్దరి కొడుకులతో పడలేను. ఇందాకే బన్నీ వాసు, SKN AAA థియేటర్స్ లో మాకు వాటాలు ఇవ్వమని అడుగుతున్నారు(నవ్వుతూ)’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇక నిహారిక NM(Niharika NM) గురించి అల్లు అరవింద్ మాట్లాడిన మాటలు సోషల్ మీడియా లో బాగా వైరల్ ఆయాయ్యి. ఆయన మాట్లాడుతూ ‘బన్నీ వాసు నాకు 5 మంది అమ్మాయిల ఫోటోలను చూపించాడు. ముందుగా నీ ఫోటోనే చూసాను. మారు కూడా ఆలోచించకుండా ఈ అమ్మాయిని తీసుకోండి, మీ సినిమాకు సరిగ్గా సరిపోతుంది అని చెప్పాను. కాదు సార్,మిగిలిన అమ్మాయిలను కూడా ఒక్కసారి చూడండి అని అడిగాడు. ఏమి అవసరం లేదయ్యా,ఇన్ స్టాగ్రామ్ లో ఆ అమ్మాయిని నేను రెగ్యులర్ గా చూస్తూనే ఉంటాను, ఈ సినిమాకి ఆ అమ్మాయే పర్ఫెక్ట్ తీసుకోండి అని చెప్పాను’ అని అంటాడు. ఇన్ స్టాగ్రామ్ లో నన్ను మీరు ఫాలో అవుతున్నారా అని ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తూ నిహారిక అడగ్గా ‘ఫేక్ అకౌంట్ తో ఫాలో అవుతున్నాను. నా పేరు పెట్టుకొని ఇన్ స్టాగ్రామ్ లోకి వస్తే ఎవరెవరో పెట్టే కామెంట్స్ ని చూడలేక చావాలి, అందుకే ఎవరికీ తెలియకుండా ఫేక్ అకౌంట్ తో అనేక మందిని ఫాలో అవుతూ ఉంటాను, అందులో నిహారిక అకౌంట్ కూడా ఒకటి’ అంటూ చెప్పుకొచ్చాడు.