Homeఎంటర్టైన్మెంట్Vijay CM Oath Ceremony: విజయ్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహేష్...

Vijay CM Oath Ceremony: విజయ్ సిఎం గా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే మహేష్ బాబు కలిసి థ్యాంక్స్ చెబుతాడా… కారణం ఏంటంటే…

Vijay CM Oath Ceremony: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు విజయ్…ప్రస్తుతం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళనాడులో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పెట్టిన టివికే పార్టీ 108 సీట్లను గెలవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఆయన మీద జనాలకు విపరీతమైన నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఇదిలా […]

Vijay CM Oath Ceremony: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో పెను సంచలనాన్ని క్రియేట్ చేసిన నటుడు విజయ్…ప్రస్తుతం సీఎం గా ప్రమాణ స్వీకారం చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. తమిళనాడులో రీసెంట్ గా జరిగిన అసెంబ్లీ ఎలక్షన్స్ లో విజయ్ పెట్టిన టివికే పార్టీ 108 సీట్లను గెలవడం అనేది ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరుస్తుంది. నిజంగా ఆయన మీద జనాలకు విపరీతమైన నమ్మకం ఉంది. మరి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఇక ఇదిలా ఉంటే ఆయన వేరే పార్టీ తో కలిసి గవర్నమెంట్ ని ఫామ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ప్రమాణ స్వీకారం అయిన వెంటనే విజయ్ మహేష్ బాబును కలువబోతున్నాడు అంటూ ఒక న్యూస్ అయితే తమిళ్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

కారణం ఏంటంటే విజయ్, మహేష్ బాబు ఇద్దరు చాలా మంచి ఫ్రెండ్స్…వీళ్లిద్దరు ఎక్కడ పెద్దగా పబ్లిక్ ఫంక్షన్స్ లో కనిపించకపోయిన కూడా ఫోన్ చేసుకొని మరి సినిమాలతో పాటు వాళ్ళ పర్సనల్ విషయాల గురించి కూడా మాట్లాడుకుంటూ ఉంటారట. విజయ్ టీవీకే పార్టీ పెట్టినప్పుడు మహేష్ బాబు తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావని విజయ్ తో చెప్పారట.

ఆ విషయాన్ని గుర్తు పెట్టుకున్నాడట.ఇక విజయ్ కొంచెం డల్ అయినపుడు కూడా మహేష్ బాబు తనకి ఫోన్ చేసి మాట్లాడినట్టుగా విజయ్ తన సన్నిహితుల దగ్గర చెప్పారట. ఇక అదే విషయాన్ని ఇప్పుడు తన సన్నిహితులు గుర్తు చేస్తు విజయ్ ప్రమాణ స్వీకారం అయిన వెంటనే హైదరాబాద్ కు వెళ్లి మహేష్ బాబుని స్వయంగా కలువబోతున్నాడు అంటూ కొన్ని కామెంట్లు వస్తున్నాయి.

ఇక ఏది ఏమైనా కూడా విజయ్ లాంటి స్టార్ హీరో ఇప్పుడు తమిళనాడు స్టేట్ కి సీఎం అవ్వడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయమనే చెప్పాలి…ఇక ప్రస్తుతం మహేష్ బాబు వారణాసి సినిమా షూటింగ్లో ఉన్నాడు కాబట్టి విజయ్ గెలిచిన విషయం తెలిసి అతనికి కంగ్రాట్స్ చెప్పారట. ఇక ఇదంతా చూసిన మరికొంతమంది మాత్రం విజయ్ స్వయంగా మహేష్ బాబు ను కలవడానికి ఎప్పుడు వస్తాడు. విజయ్ – మహేష్ బాబు మధ్య అంత మంచి ఫ్రెండ్షిప్ ఉందా అంటూ కొన్ని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper