Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Budget: చిక్కుల్లో పడ్డ 'వారణాసి'.. హద్దులు దాటిన బడ్జెట్.. ధైర్యం చెయ్యని ఓటీటీ...

Varanasi Movie Budget: చిక్కుల్లో పడ్డ ‘వారణాసి’.. హద్దులు దాటిన బడ్జెట్.. ధైర్యం చెయ్యని ఓటీటీ సంస్థలు..

Varanasi Movie Budget: ప్రస్తుతం ఇండియా లో తెరకెక్కుతున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో , అభిమానులతో పాతాయ్ , ప్రేక్షకులు కూడా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్న చిత్రం ‘వారణాసి’. రాజమౌళి , మహేష్ బాబు కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో వచ్చే ఏడాది ఏప్రిల్ 7 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాడు రాజమౌళి. అయితే లేటెస్ట్ గా ఫిలిం నగర్ లో వినిపిస్తున్న మాట ఏమిటంటే , ఈ సినిమా బడ్జెట్ రాజమౌళి అంచనాలను సైతం దాటేసింది అని. అంతే కాదు పెట్టిన ఈ పెట్టుబడిని రాబట్టే క్రమంలో రాజమౌళి కి సవాలుగా మారిందని , ఇప్పుడు ఆయన ఈ విషయం లో తీవ్రమైన ఒత్తిడి కి గురి అవుతున్నాడని అంటున్నారు. ఈ సినిమా నిర్మాణ వ్యయం 1200 నుండి 1400 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని సినీ వర్గాలు చెప్తున్నాయి.

రాజమౌళి ఇంత మొత్తం లో బడ్జెట్ ని ఖర్చు చేయించడానికి కారణం , డిజిటల్ రైట్స్ తోనే పెట్టిన పెట్టుబడిని రీకవర్ చేయొచ్చనే ఉద్దేశ్యంతో. కేవలం ఓటీటీ రైట్స్ 500 నుండి 600 కోట్ల రూపాయలకు అమ్ముడుపోతుంది అంచనా వేసాడు రాజమౌళి. అయితే అప్పటి ఓటీటీ మార్కెట్ కి ప్రస్తుత ఓటీటీ మార్కెట్ కి చాలా తేడా ఉంది. ప్రస్తుతం ఓటీటీ మార్కెట్ బాగా డౌన్ అయ్యింది. ఎంత పెద్ద స్టార్ హీరో సినిమా అయినా సరే, కంటెంట్ కొనుగోలు చేసే ముందు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. యూత్ ఆడియన్స్ లో విపరీతమైన క్రేజ్ ఉన్న సినిమాలకు కూడా ఓటీటీ సంస్థలు కేవలం 150 నుండి 200 కోట్ల మధ్యలోనే ఇస్తున్నారు. రాజమౌళి ఈ సినిమా ఓటీటీ రైట్స్ కోసం 550 కోట్ల రూపాయలకు పైగానే ప్రముఖ నెట్ ఫ్లిక్స్ సంస్థ ని డిమాండ్ చేస్తున్నాడు, కానీ నెట్ ఫ్లిక్స్ సంస్థ అంత ఇచ్చేందుకు రెడీ గా లేదు.

దీంతో మిగిలిన షూటింగ్ కి ఖర్చులు తగ్గించే విషయం లో నిర్మాతలు చాలా గట్టి చర్యలు తీసుకుంటున్నారు అట. రాజమౌళి , మహేష్ బాబు వంటి వారు రెమ్యూనరేషన్స్ తీసుకోలేదు. సినిమా విడుదలయ్యాక వచ్చే లాభాల్లో వాటాలు పంచుకుంటారట. ఇప్పటికే 50 శాతం కి పైగా షూటింగ్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. ఈ ఏడాది సెప్టెంబర్ లోపు షూటింగ్ ని పూర్తి చేసి , ఎట్టి పరిస్థితిలోనూ ఈ చిత్రాన్ని చెప్పిన డేట్ లో విడుదల చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రం లో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా నటిస్తుండగా , విలన్ గా పృథ్వీ రాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper