Homeఎంటర్టైన్మెంట్Kooku With Jathi Ratnalu 2 Winner: 'కుకూ విత్ జాతి రత్నాలు 2' టైటిల్...

Kooku With Jathi Ratnalu 2 Winner: ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ టైటిల్ విన్నర్ ఎవరో తెలిసిపోయింది.. ఇది చాలా అన్యాయం..

Kooku With Jathi Ratnalu 2 Winner: స్టార్ మా ఛానల్ లో ప్రతీ శని, ఆదివారాల్లో ప్రసారమయ్యే ‘కుకూ విత్ జాతి రత్నాలు 2’ షో , ఎంతటి అద్భుతమైన టీఆర్ఫీ రేటింగ్స్ తో ముందుకు వెళ్తుందో అందరికీ తెలిసిందే. ఈ షో లో అన్నీ న్యాయబద్దంగా జరుగుతుండడం తో ఆడియన్స్ లో ఈ రేంజ్ రెస్పాన్స్ వచ్చిందని అందరూ అంటున్నారు. కానీ నిన్నటి ఎపిసోడ్ లో ఈ షోలో కూడా అన్యాయం జరిగింది. సాధారణంగా ప్రతీ రెండు వారాలకు ఒకసారి ‘కుక్ ఆఫ్’ ని నిర్వహించి , ఒక కంటెస్టెంట్ ని ఎలిమినేట్ చేస్తుంటారు. కానీ గత నాలుగు వారాలుగా ఎలాంటి ఎలిమినేషన్ ప్రక్రియ జరగలేదు. దీంతో నిన్న గత రెండు వారాలకు కలిపి , తక్కువ స్కోర్ ఉన్న చివరి ఇద్దరు కంటెస్టెంట్స్ ‘కుక్ ఆఫ్’ ప్రక్రియ లో పాల్గొనకుండానే ఎలిమినేట్ అవుతారని షాకింగ్ ట్విస్ట్ ఇచ్చారు నిర్వాహకులు.

దీంతో గత రెండు వారాలుగా తక్కువ తక్కువ స్కోర్ ని నమోదు చేసుకుంటూ వచ్చిన తేజస్విని గౌడ , పల్లవి రామస్వామి ఈ షో నుండి ఎలిమినేట్ అయ్యినట్టు నిన్నటి ఎపిసోడ్ లో యాంకర్ ప్రదీప్ చెప్పుకొచ్చాడు. నాలుగు వారాలుగా ఎలిమినేషన్ ప్రక్రియ లేనప్పుడు , నాలుగు వారాలకు సంబంధించిన స్కోర్స్ ని కలిపి , తక్కువ స్కోర్ వచ్చిన వాళ్ళని ఎలిమినేట్ చేయడం న్యాయం కదా, ఇలా గత రెండు వారాల్లో వచ్చిన స్కోర్స్ ఆధారంగా ఎలిమినేట్ చేయడం ఎంత వరకు న్యాయం అనేది ప్రేక్షకుల నుండి ఎదురు అవుతున్న ప్రశ్న. ఒకవేళ నాలుగు వారాలకు సంబంధించిన స్కోర్స్ ని కలిపి ఉండుంటే , ఈరోజు తేజస్విని గౌడ ఎలిమినేట్ అయ్యేది కాదని , కచ్చితంగా ఆమెకు అన్యాయం జరిగిందని అంటున్నారు నెటిజెన్స్. ఇకపోతే ఈ సీజన్ కి సంబంధించిన మరో లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ సీజన్ టైటిల్ విన్నర్ గా డిమోన్ పవన్ నిలిచాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మొదటి ఎపిసోడ్ నుండి , మొన్నటి వీకెండ్ ఎపిసోడ్ వరకు డిమోన్ పవన్ జడ్జీల నుండి మంచి మార్కులు అందుకుంటూ వస్తున్నాడు. ఇతను ఉంటే టాప్ 1 లో ఉంటాడు , లేదంటే టాప్ 3 లో ఉంటాడు. ఈ రెండు కాకుండా చివరి స్థానం లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క ఎపిసోడ్ లో కూడా లేడు . ఈ రేంజ్ డామినేషన్ చూపిస్తూ వచ్చిన డిమోన్ పవన్ టైటిల్ విన్ అయ్యాడు అనే వార్త సోషల్ మీడియా లో ప్రచారం అవ్వడంతో , ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper