Homeఎంటర్టైన్మెంట్Varanasi Movie Budget: 'వారణాసి' మూవీ బడ్జెట్ మరింత పెరిగిందా..?ఫైనల్ గా ఎంత అవుతుంది...

Varanasi Movie Budget: ‘వారణాసి’ మూవీ బడ్జెట్ మరింత పెరిగిందా..?ఫైనల్ గా ఎంత అవుతుంది…

Varanasi Movie Budget: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదిన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అని రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఎక్కువగా గ్యాప్ లేకుండా ప్రతిదీ పకడ్బందీ […]

Varanasi Movie Budget: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు హీరో గా తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. వచ్చే సంవత్సరం ఏప్రిల్ 7వ తేదిన ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాను అని రాజమౌళి రిలీజ్ డేట్ అనౌన్స్ చేశాడు. ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి విషయాన్ని రాజమౌళి క్షుణ్ణంగా పరిశీలిస్తూ వీలైనంత తొందరగా సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేయాలని చూస్తున్నాడు. ఎక్కువగా గ్యాప్ లేకుండా ప్రతిదీ పకడ్బందీ ప్రణాళికతో ప్లాన్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు. దీనివల్ల రాజమౌళి అనుకున్నట్టుగా సినిమాని తీస్తూనే సమయాన్ని కూడా ఎక్కువగా వృధా చేయకుండా చూసుకుంటున్నాడు…

Also Read: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడంటే?

ఈ సినిమా బడ్జెట్ మొదట ఎనిమిది వందల కోట్లు అవుతుందంటూ స్టార్ట్ చేశారు. ఇక ఆ తర్వాత 1300 కోట్లు అవుతుంది అంటూ ఒక ఫిగర్ అయితే ఫిక్స్ చేశారు. కానీ ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాకి 1500 కోట్ల బడ్జెట్ అవుతుందట. మరి ఈ సినిమాను అంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్నారు కాబట్టి ఈ మూవీ ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబడుతుంది అనే డౌట్ అందరి మదిలో మెదులుతుంది.

3000 కోట్లకు పైన కలెక్షన్స్ వస్తేనే ఈ సినిమా ఘన విజయం సాధించినట్లు లేకపోతే మాత్రం పూర్తిగా డీలా పడిపోయే అవకాశామైతే ఉంది. ఇక రాజమౌళి విజన్ ను నమ్మి ప్రొడ్యూసర్ అంత భారీ అమౌంట్ పెడుతున్నాడు అంటే సినిమా ఏ రేంజ్ లో తెరకెక్కించాలో రాజమౌళికి క్లియర్ కట్ గా అర్థమయ్యే ఉంటుంది. ఒకవేళ ఏమాత్రం తేడా కొట్టిన భారీ విమర్శలను మూటగట్టుకోవడమే కాకుండా ప్రొడ్యూసర్స్ కి విపరీతమైన నష్టాలు కూడా వచ్చే అవకాశాలైతే ఉన్నాయి.

ఇక రాజమౌళి ఇప్పటివరకు తన ప్రొడ్యూసర్స్ ఎవరిని నష్టపరచలేదు. కాబట్టి ఇది కూడా గురి తప్పకుండా భారీ సక్సెస్ గా నిలుస్తుందని చాలామంది సినిమా ప్రేక్షకులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఇక ఎవరు ఏమనుకున్నా కూడా రాజమౌళి తను అనుకున్నది వచ్చేంత వరకు సినిమా ను చెక్కుతూనే ఉంటాడు. కాబట్టి ఈ సినిమా టాప్ రేంజ్ లో ముందుకు సాగడమే కాకుండా ప్రపంచ స్థాయి ప్రేక్షకులను సైతం అలరిస్తుందనే ఒక కాన్ఫిడెంట్ తో రాజమౌళి ఉన్నాడు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper