Homeఎంటర్టైన్మెంట్Dhurandhar 2 Box Office Collections: 'దురంధర్ 2' కి అంత ప్రాఫిట్ వస్తే వారణాసి...

Dhurandhar 2 Box Office Collections: ‘దురంధర్ 2’ కి అంత ప్రాఫిట్ వస్తే వారణాసి కి ఎంత వస్తుంది…

Dhurandhar 2 Box Office Collections: గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస డిజాస్టర్ లను చవి చూస్తుంది. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుంటే ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు గాని బాలీవుడ్ ఇండస్ట్రీ గాని తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. కానీ గత సంవత్సరం వచ్చిన ‘దురంధర్’ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడమే కాకుండా ఇండియాలో ఆ సినిమాకి భారీ గుర్తింపైతే తీసుకొచ్చింది. […]

Dhurandhar 2 Box Office Collections: గత కొద్ది రోజుల నుంచి బాలీవుడ్ ఇండస్ట్రీ వరుస డిజాస్టర్ లను చవి చూస్తుంది. వచ్చిన సినిమాలు వచ్చినట్టుగా ఫ్లాప్ అవుతుంటే ఇప్పుడు రాబోతున్న సినిమాల విషయంలో అక్కడి ప్రేక్షకులు గాని బాలీవుడ్ ఇండస్ట్రీ గాని తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారు. కానీ గత సంవత్సరం వచ్చిన ‘దురంధర్’ సినిమా ఎప్పుడైతే వచ్చిందో ఆ సినిమాను సూపర్ సక్సెస్ గా నిలపడమే కాకుండా ఇండియాలో ఆ సినిమాకి భారీ గుర్తింపైతే తీసుకొచ్చింది. అలాగే బాలీవుడ్ ఇండస్ట్రీ మరోసారి లైమ్ లైట్ లోకి వచ్చిందనే చెప్పాలి. ఇక రీసెంట్ గా ‘దురంధర్ 2’ సినిమాతో మరోసారి ఇండియన్ సినిమా ఇండస్ట్రీ బాక్సాఫీస్ ను షేక్ చేస్తూ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

Also Read: ఐపీఎల్ పూర్తి షెడ్యూల్ ఇదే.. ఏ మ్యాచ్ ఎప్పుడు ఎక్కడంటే?

ఇక ఇప్పటికే 100 కోట్ల కలెక్షన్స్ ను దాటిన ఈ సినిమా తొందర్లోనే 2000 కోట్ల మార్కును కూడా టచ్ చేయబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇక ఏది ఏమైనా కూడా ‘దురంధర్ 2’ సినిమాకే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తే మహేష్ బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వస్తాయో మన ఊహకే వదిలేస్తున్నారు.

మరి ఇంతటి భారీ సక్సెస్ ఫుల్ సినిమాలు చెయ్యాలి అంటే అంత ఆశా మాశీ వ్యవహారమైతే కాదు. దానిమీద ఒక దర్శకుడు ఎంతలా కష్టపడాల్సి ఉంటుందో అది అతనికి మాత్రమే తెలుసు…ఏదో కథ రాసేసుకొని సినిమా చేస్తే ఈ రేంజ్ అవుట్ ఫుట్ రాదు. దానికోసం అహర్నిశలు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. రాజమౌళి మొదటి సినిమా నుంచి భారీ బ్లాక్ బస్టర్ సక్సెస్ లను సాధిస్తున్నాడు.

ఇక దురంధర్ 2 సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ ని ఎలా కాపాడిందో ఇప్పుడు వారణాసి సినిమా సైతం తెలుగు సినిమా ఇండస్ట్రీ స్థాయిని పెంచుతూ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కాకుండ్ పాన్ వరల్డ్ ఇండస్ట్రీ ని సైతం శాసించే స్థాయిలో సక్సెస్ ని సాధిస్తుందంటూ పలువురు సినిమా మేధావులు సైతం వాళ్ళ అభిప్రాయాల్ని తెలియజేస్తున్నారు…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper