Rajamouli: ఇప్పటివరకు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మీద చాలామంది హీరోలు చెరగని ముద్ర వేశారు. అలాంటి హీరోలు చేస్తున్న సినిమాలతో గొప్ప విజయాలను సాధించడానికి మరి కొంతమంది నటులు సైతం సినిమాలను చేస్తు వాటిని నెక్స్ట్ లెవల్ కి తీసుకెళ్తున్నారు. ఇక ఇదిలా ఉంటే స్టార్ డైరెక్టర్లు సినిమాలను తెరకెక్కించడం లో చాలా కీలకపాత్ర వహిస్తున్నారు. పాన్ ఇండియా నేపథ్యంలో సినిమాలను చేసి తెలుగు సినిమా స్థాయిని పెంచాడు. ఇకమీదట రాబోతున్న సినిమాలతో మరి కొంత మంది దర్శకులు సైతం వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు… ఇక రాజమౌళి తో పాటు భారీ గుర్తింపును సంపాదించుకున్న దర్శకులు చాలా తక్కువ మంది ఉన్నారు. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా నిలవగలుగుతున్నారు.
కానీ భారీ సక్సెస్ ను సాధించే దర్శకుల సంఖ్య తగ్గిపోయింది. తమిళ్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళు సైతం డీలాపడిపోయారు. కాబట్టి ఇప్పుడు రాజమౌళిని మించిన దర్శకుడు ఇండియాలో మరెవరు లేరనేది వాస్తవం…ఇక ‘వారణాసి’ సినిమా రిలీజ్ అయితే రాజమౌళి దూకుడుని తట్టుకోవడం ఎవరి వల్ల కాదు.
ఇక ఆయన క్రియేట్ చేసిన రికార్డులను తిరగ రాయడం అనేది కూడా ఎవరికి సాధ్యపడదనే చెప్పాలి. దాదాపు 1300 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కుతున్న వారణాసి సినిమా 3000 కోట్లకు పైన కలెక్షన్స్ ను రాబడుతుందనే అంచనాలో ప్రతి ఒక్కరు ఉన్నారు. అప్పుడు ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో 2000 కోట్ల కలెక్షన్స్ ను సంపాదించడమే కష్టమవుతుంది.
ఇక ఇలాంటి నేపధ్యంలో ఇప్పుడు వారణాసి సినిమాతో 3000 కోట్ల మార్కును టచ్ చేస్తే మాత్రం రాజమౌళి ని మించిన దర్శకుడు ఇండియాలో ఇంకెవరు ఉండరు అనేది ప్రూవ్ అవుతుంది… ఇక అలాంటి రాజమౌళిని తట్టుకొని నిలబడే దర్శకులైతే ఈ మధ్యకాలంలో ఇండస్ట్రీలో ఎవ్వరు కనిపించరనేది వాస్తవం… రాజమౌళి సినిమాల కోసమే పుట్టాడు. సినిమాలను ఎలా తీయాలి అనేది ఆయనకు తెలిసినంత గొప్పగా ఇంకెవరికి తెలీదు…