spot_img
Homeఎంటర్టైన్మెంట్Vanitha Vijaykumar: మా నాన్నే నా జీవితం నాశనం చేశాడు... నటి వనిత విజయ్ కుమార్...

Vanitha Vijaykumar: మా నాన్నే నా జీవితం నాశనం చేశాడు… నటి వనిత విజయ్ కుమార్ షాకింగ్ ఆరోపణలు

Vanitha Vijaykumar: తమిళ నటుడు విజయ్ కుమార్, నటి మంజుల దంపతుల పెద్ద కుమార్తె వనిత విజయ్ కుమార్. తెలుగులో ఆమె సూపర్ హిట్ మూవీ దేవి చేశారు. ఆ తర్వాత తమిళంలో కొన్ని సినిమాలు చేసినా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది. కానీ నిత్యం వివాదాలతో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్ అయ్యారు. చివరికి తండ్రి విజయ్ కుమార్ తో కూడా ఆమెకు గొడవలు ఉన్నాయి. తాజాగా… తన జీవితం నాశనం కావడానికి తండ్రి విజయ్ కుమార్ ప్రధాన కారణం అంటూ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

వనిత విజయ్ కుమార్ కెరీర్ పరిశీలిస్తే… చంద్రలేఖ సినిమాతో తమిళ్ ఇండస్ట్రీలో తెరంగేట్రం చేసింది. 2000లో నటుడు ఆకాష్ ని పెళ్లి చేసుకుంది. వివాహం అనంతరం సినిమాలకు దూరం అయింది. 2007లో ఆకాష్ కి విడాకులు ఇచ్చి .. ఆనంద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకుంది. అతనితో కూడా కాపురం సవ్యంగా సాగలేదు. విడాకులు తీసుకుంది. మూడో వివాహంగా నిర్మాత పీటర్ పాల్ ని చేసుకుని మూడు నెలలకే అతన్ని వదిలేసింది.

తన చర్యల కారణంగా మరోవైపు కుటుంబానికి సైతం దూరం అయింది. తండ్రి విజయ్ కుమార్ ఆమెతో సంబంధాలు తెంచుకున్నాడు. ప్రస్తుతం వనిత పిల్లలతో కలిసి ఉంటుంది. వనిత విజయ్ తన తండ్రి గురించి మాట్లాడిన మాటలు వైరల్ అవుతున్నాయి. విజయ్ కుమార్ ఓ ఇంటర్వ్యూలో తన పిల్లల వీరే అంటూ… కవిత, అనిత, అరుణ్ విజయ్, ప్రీత, శ్రీ దేవి పేర్లు చెప్పారట. రెండో భార్య పెద్ద కుమార్తె అయిన తన పేరు మరిచాడట.

”పెద్ద కూతురిగా నా పేరు చెప్పలేదు. ఆయన నా పేరు చెప్పుకోవడానికి ఇష్టపడకపోవచ్చు .. కానీ ప్రపంచానికి తెలుసు నేను ఎప్పుడూ అతని బిడ్డనే .. నేను నా పేరు చివరన భర్త పేరు కూడా పెట్టుకోవడానికి ఇష్టపడలేదు. నాన్న పేరే పెట్టుకున్నాను. కానీ అతని వల్లే నా జీవితం దిగజారింది. వదిలేస్తే నా జీవితం ఎలాగైనా ఉండేది. అతని మాటలు వినడం వల్ల నా జీవితం చాలా మారిపోయింది” అంటూ వనిత సంచలన కామెంట్స్ చేసింది. కాగా వనిత విజయ్ కుమార్ గత ఏడాది’ మళ్ళీ పెళ్లి ‘ సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు.

Related News

Most Popular

Kajal Aggarwal

Kajal Aggarwal: అతను ఎవ్వరూ లేని సమయం చూసి నా రూమ్ లోకి ప్రవేశించాడు అంటూ కాజల్ అగర్వాల్...

Kajal Aggarwal: సినీ ఇండస్ట్రీ లోకి రావాలని, సక్సెస్ అవ్వాలని ఎంతో మందికి ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఇండస్ట్రీ లోకి రావడానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే అమ్మాయిల తల్లిదండ్రులు...
Nara Rohith

Nara Rohith: ‘ఆదర్శ కుటుంబం’ నుండి నారా రోహిత్ లుక్ విడుదల.. ఈ రేంజ్ లో ఉన్నాడేంటి..

Nara Rohith: 'సంక్రాంతికి వస్తున్నాం' వంటి భారీ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత , విక్టరీ వెంకటేష్ చేస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం'. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఈ సినిమా...
Dhruv Vikram:

Dhruv Vikram: కోటి రూపాయిలు తీసుకొని మోసం చేసిన ధృవ్ విక్రమ్.. ఫిర్యాదు నమోదు.. పూర్తి వివరాలు మీకోసం..

Dhruv Vikram: గత కొద్దిరోజుల నుండి తమిళ స్టార్ హీరో విక్రమ్ తనయుడు ధృవ్ విక్రమ్ పేరు సోషల్ మీడియా లో ఒక రేంజ్ లో మారుమోగిపోతుంది. గత కొంతకాలం నుండి...
Telangana ACB

Telangana ACB: తెలంగాణ ఏసీబీ: పాముల వేట ముగిసింది.. అనకొండల హంట్ మొదలవుతోంది..

Telangana ACB: పుట్టల నుంచి పాములు బయటికి వస్తున్నాయి. ఆ పాముల వేట కూడా కొద్ది రోజులుగా ఆటంకం అనేది లేకుండా సాగుతోంది. అయితే ఇప్పుడు పాముల గుట్టు తెలిసిపోయింది. పాములు...
Ravi Prakash

Ravi Prakash: టీవీ9ను కొట్టేసిన రవి ప్రకాష్..

Ravi Prakash: మెరుగైన సమాజం అనే ట్యాగ్ లైన్ తో సరిగా దశాబ్దాల క్రితం రవి ప్రకాష్ శ్రీ ని రాజుతో కలిసి టీవీ9 అనే మహా సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేశాడు....
Oktelugu Epaper