Ruhani Sharma: హిమాచల్ ప్రదేశ్ కి చెందిన రుహాని శర్మ సౌత్ లో హీరోయిన్ గా కెరీర్ మొదలు పెట్టింది. ఆమె డెబ్యూ మూవీ కడైసి బెంచి కార్తీ. ఈ తమిళ చిత్రం 2017లో విడుదలైంది. రెండో చిత్రంగా చిలసౌ చేసింది. అక్కినేని హీరో సుశాంత్ కి జంటగా నటించింది. చిలసౌ చిత్రానికి నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించాడు. చిలసౌ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఈ మూవీ నేషనల్ అవార్డు గెలుపొందడం విశేషం. ఒరిజినల్ స్క్రీన్ ప్లే విభాగంలో చిలసౌ జాతీయ అవార్డుకు ఎంపికైంది.
చిలసౌ మూవీలో రుహాని శర్మ అద్భుత నటన కనబరిచింది. రుహాని శర్మకు చిలసౌ బూస్ట్ ఇస్తుంది అంటుకుంటే అలా జరగలేదు. ఆమెకు చెప్పుకోదగ్గ ఆఫర్స్ రాలేదు. యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను తెరకెక్కించిన ‘హిట్’ లో విశ్వక్ సేన్ కి జంటగా రుహాని శర్మ నటించింది. ఈ క్రైమ్ థ్రిల్లర్ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే రుహాని శర్మకు క్రెడిట్ దక్కలేదు. కారణం… ఆమె పాత్రకు పెద్దగా నిడివి లేదు.
రుహాని శర్మ కెరీర్ గ్రాఫ్ పడిపోతూ వస్తుంది. హీరోయిన్ నుండి సపోర్టింగ్ రోల్స్ కి దిగజారింది. 2024 సంక్రాంతి రిలీజ్ సైంధవ్ లో రుహాని శర్మ ఓ కీలక రోల్ చేసిన సంగతి తెలిసిందే. హిట్ ఫేమ్ శైలేష్ కొలను సైంధవ్ తెరకెక్కించారు. సైంధవ్ నిరాశపరిచింది. వెంకటేష్ 75వ చిత్రంగా సైంధవ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఆపరేషన్ వాలెంటైన్ మూవీలో ఓ పాత్ర చేసింది.
ఆపరేషన్ వాలెంటైన్ మార్చి 1న విడుదల కానుంది. వరుణ్ తేజ్ హీరో కాగా మానుషీ చిల్లర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఆపరేషన్ వాలెంటైన్ చిత్రంపై అంచనాలు ఏర్పడ్డాయి. నెక్స్ట్ ఆమె శ్రీరంగ నీతులు టైటిల్ కామెడీ డ్రామా చేస్తుంది. సుహాస్ హీరోగా నటిస్తున్నాడు. మరోవైపు అమ్మడు ఇంస్టాగ్రామ్ వేదికగా సెగలు పుట్టిస్తోంది. తాజాగా స్లీవ్ లెస్ టాప్ ధరించి మిర్రర్ సెల్ఫీ దిగింది. బ్రాని తలపిస్తున్న ఆమె టాప్ కుర్రాళ్ళ గుండెల్లో గుబులు రేపుతోంది. రుహాని శర్మ హాట్ లుక్ వైరల్ అవుతుంది.
Web Title: Ruhani sharma latest selfie photo goes viral on social media
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com