Homeఎంటర్టైన్మెంట్Harish Shankar reaction: 'ఉస్తాద్ భగత్ సింగ్' ఫెయిల్యూర్ పై మొదటిసారి స్పందించిన హరీష్ శంకర్.....

Harish Shankar reaction: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఫెయిల్యూర్ పై మొదటిసారి స్పందించిన హరీష్ శంకర్.. ఊహించని రియాక్షన్ ఇది..

Harish Shankar reaction: ‘మిరపకాయ్’, ‘గబ్బర్ సింగ్’, ‘సుబ్రహ్మణ్యం ఫర్ సేల్’, ‘గడ్డలకొండ గణేష్’ వంటి చిత్రాలు చూసి , హరీష్ శంకర్(Harish shankar) భవిష్యత్తులో గొప్ప మాస్ కమర్షియల్ డైరెక్టర్ అవుతాడని అంతా అనుకున్నారు. కానీ మిస్టర్ బచ్చన్ తర్వాత ఇతని కెరీర్ మొత్తం తలక్రిందులు అయ్యింది. ఆ సినిమా ప్రొమోషన్స్ సమయం ఇతని నోటి దూల చేసిన నష్టం అంతా ఇంతా కాదని సినీ పరిశ్రమ లో విశ్లేషకులు సైతం అంటుంటారు. ఇక ‘మిస్టర్ బచ్చన్’ ని ఆయన డీల్ చేసిన విధానం చూసి , ఇతని బుర్ర 2010 దగ్గరే ఆగిపోయింది , అలాంటిది పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్ తో సినిమా అంటున్నారు , దాని పరిస్థితి ఏంటో అని అభిమానులు కూడా బెంగ పెట్టుకున్నారు. వాళ్ళు ఊహించినట్టుగానే పవర్ స్టార్ కెరీర్ లోనే అత్యంత దారుణమైన ఫ్లాప్ గా నిల్చింది ఈ చిత్రం.

ఈ సినిమా ఫెయిల్యూర్ కి ముమ్మాటికీ హరీష్ శంకర్ బాధ్యుడు. నాని , విజయ్ దేవరకొండ వంటి మీడియం రేంజ్ హీరోలు కూడా, హై క్వాలిటీ సినిమాలు చేస్తూ, పాన్ ఇండియా వైపు టార్గెట్ చేస్తున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తోటి స్టార్ హీరోలైతే, ఒక్కొక్కరు వెయ్యి కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టేంత విలువైన ప్రాజెక్ట్స్ చేతుల్లో పెట్టుకున్నారు. ఇలాంటి పీక్ పోటీ వాతావరణం ఉన్నప్పుడు ఎలాంటి సినిమాలు తియ్యాలి?, పాన్ ఇండియా లెవెల్ లో , ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తోనే సినిమాలను తియ్యాలి. కానీ ఇతను అది చెయ్యలేదు. హీరో కి భజన చెయ్యడమే కంటెంట్ గా భావించి, ఆరంభం నుండి ఎండింగ్ వరకు థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి చుక్కలు చూపించాడు. 2026 లో ఉన్నాం మనమంతా. ఈ కాలం లో కమర్షియల్ సినిమాలను ఆదరించడమే బాగా తగ్గించేశారు జనాలు , అలాంటిది హీరోకు భజన చేస్తూ సినిమా చేస్తే ఎవరు చూస్తారు చెప్పండి.

దానికి తోడు ఇతని నోటి దూల కూడా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం పై బోలెడంత నెగెటివిటీ ఏర్పడేలా చేసింది . పైగా గత మూడేళ్ళ నుండి ఈ చిత్రం తమిళం లో సూపర్ హిట్ గా నిల్చిన తేరి కి రీమేక్ అంటూ ప్రచారం జరిగింది. దీనిపై అప్పట్లో స్పష్టత ఇవ్వడానికి కూడా ఇష్టపడలేదు హరీష్ శంకర్. అతను చేసిన ఈ పొరపాటు కూడా ఈ సినిమా ఫెయిల్యూర్ కి ప్రధాన కారణం. ఇన్ని తప్పులు , పొరపాట్లు తనవైపు పెట్టుకొని, వాటిని మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడా అంటే అది కూడా లేదు. నేడు ఆయన ‘పాపం ప్రతాప్’ అనే మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చాడు. ఈ ఈవెంట్ లో ఆయన మాట్లాడుతూ ‘ఇందాక యాంకర్ స్రవంతి నన్ను పాపం హరీష్ అంటూ సంబోధించింది . నేను అది విని నా సినిమా రీసెంట్ గా సరిగా ఆడలేదు కదా , అందుకే అలా పిలిచిందేమో అని అనుకోని ఫీల్ అయ్యాను. కానీ ఈ ఈవెంట్ కి వచ్చిన ప్రతీ ఒక్కరిని ఆమె అలాగే పిలిచింది. అప్పుడు మనల్ని టార్గెట్ చెయ్యలేదులే అని సంతోషించాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అసలే బాధలో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గాయాలపై కారం చల్లినట్టు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం అవసరమా అంటూ సోషల్ మీడియా లో డైరెక్టర్ హరీష్ శంకర్ పై ఒక రేంజ్ లో ట్రోల్స్ పడుతున్నాయి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Public Movement : ప్రధానుల తల వంచిన ప్రజా ఉద్యమాలు..

Public Movement : ప్రజా ఉద్యమాలు భారత దేశానికి కొత్తకాదు. మన స్వాతంత్య్రమే ప్రజా ఉద్యమాలతో సాధించుకున్నాం. స్వతంత్ర భారతదేశంలో ప్రజా ఉద్యమాలు ప్రభుత్వాలపై గణనీయమైన ప్రభావం చూపాయి. కొన్ని సందర్భాల్లో ప్రధానులు...
Narendra Modi

Narendra Modi : నాడు రైతులు.. నేడు విద్యార్థులు.. మోదీతో వెనకడుగు వేయించిన ఉద్యమాలు!

Narendra Modi : ప్రధాని నరేంద్రమోదీ.. వరుసగా మూడోసారి ప్రధాని అయ్యారు. ఇటీవలే పండిత్‌ జవహర్‌లాల్‌ నెహ్రూ పేరిట ఉన్న రికార్డును కూడా అధిగమించారు. అత్యధిక కాలం పాలించిన ప్రధానిగా చరిత్ర సృష్టించారు....
Cockroach Janata Party youth politics

Cockroach Janata Party రాజకీయ పార్టీగా సిజెపి.. తర్వాతి అడుగు అదే..

Cockroach Janata Party ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. కొత్త విద్యా శాఖ మంత్రిగా ప్రహ్లాద్ జోషి నియమితులయ్యారు. ఇక్కడితోనే సీజేపీ ఆగిపోతుందా.. తదుపరి ఏం చేస్తుంది.. అసలు బొద్దింకల తదుపరి లక్ష్యం...

Chiranjeevi : బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన గబ్బర్ సింగ్ నటుడికి మెగాస్టార్ చిరంజీవి భారీ విరాళం..

Chiranjeevi : ఆపదలో ఉన్నవారికి సహాయం చేయడం మెగాస్టార్ చిరంజీవి కి కొత్తేమి కాదు. ప్రతీ నెల ఎవరికో ఒకరికి ఆయన నుండి సహాయం అందుతూనే ఉంటుంది. చిరంజీవి చేసినన్ని సహాయ కార్యక్రమాలు...
CJP Protests

Student Movements in India బొద్దింకలే మొదలు కాదు.. మన దేశంలో ఎన్ని విద్యార్థి ఉద్యమాలు జరిగాయి అంటే..

Student Movements in India ఏ దేశానికైనా సరే అక్కడి యువత ప్రధాన బలం. యువత సానుకూలంగా ఉంటేనే ఆదేశం అభివృద్ధి పథంలో సాగుతూ ఉంటుంది. యువతలో అసంతృప్తి పెరిగిపోతే ఆది కాస్త...
Oktelugu Epaper