spot_img
Homeఎంటర్టైన్మెంట్Deepika Padukone in Project K: లేడీ వారియర్ గా దీపికా పదుకొనె... గూస్ బంప్స్...

Deepika Padukone in Project K: లేడీ వారియర్ గా దీపికా పదుకొనె… గూస్ బంప్స్ తెప్పించేలా ప్రాజెక్ట్ కే అప్డేట్!

Deepika Padukone in Project K: ఒక్కో అప్డేట్ ప్రాజెక్ట్ కే మూవీపై అంచనాలు పెంచేస్తుంది. న్యూ ఇయర్ సందర్భంగా ఓ మేకింగ్ వీడియో విడుదల చేశారు. సదరు వీడియోలో ఒక టైర్ ని రూపొందించడం కోసం రోజుల తరబడి పని చేశారు. ఆ టైర్ డిజైన్ చేయడానికి ప్రత్యేక బృందం పని చేసింది. ప్రాజెక్ట్ కే మూవీలో వాడే వాహనాలు, వస్తువులు, ఆయుధాలు స్కార్ఫ్ లో తయారు చేయాలని దర్శకుడు నాగ్ అశ్విన్ తెలిపారు. స్కార్ఫ్ విజువల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ సాంకేతికతను ప్రాజెక్ట్ కే షూటింగ్ కోసం వాడుతున్నారు.

Deepika Padukone in Project K
Deepika

కాగా ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. నేడు దీపికా పదుకొనె బర్త్ డే. ఈ సందర్భంగా ఆమె ప్రీ లుక్ విడుదల చేశారు. హాలీవుడ్ మూవీస్ లో కనిపించే లేడీ వారియర్ ని దీపికా తలపిస్తున్నారు. ప్రీ లుక్ చూశాక ఆమె పూర్తి గెటప్ చూడాలన్న ఆసక్తి పెరిగిపోయింది. సదరు పోస్టర్ లో ‘హోప్ ఇన్ ది డార్క్’ అని కోట్ రాశారు. ఆశలు వదులుకున్న వేళ చివరి ఆశ అని దానర్థం. ఈ ఒక్క కోట్ చాలు ప్రాజెక్ట్ కే మూవీలో దీపికా రోల్ ఎంత కీలకమో చెప్పడానికి.

Deepika Padukone in Project K
Deepika

ప్రాజెక్ట్ కే కథను మలుపు తిప్పే బలమైన పాత్ర ఆమె చేస్తూ ఉండవచ్చు. గ్లాడియేటర్, ట్రాయ్ వంటి ఆల్ టైం హాలీవుడ్ బ్లాక్ బస్టర్ చిత్రాలను దీపికా ప్రీ లుక్ తలపించింది. హీరోయిన్ దీపికా లుక్ నే ఇలా ఉంటే… ఇక ప్రభాస్ లుక్ అంచనాకు కూడా అందడం లేదు. ప్రభాస్ ఫ్యాన్స్ కోరుకుంటున్న దానికి పది రెట్ల హై దర్శకుడు నాగ్ అశ్విన్ ఇస్తాడనిపిస్తుంది.

Also Read: RRR’s biggest success: ఆర్ ఆర్ ఆర్ ఖాతాలో అతిపెద్ద విజయం… ప్రతిష్టాత్మక న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ సర్కిల్ అవార్డు అందుకున్న రాజమౌళి

దాదాపు రూ. 500 కోట్ల బడ్జెట్ తో ప్రాజెక్ట్ కే తెరకెక్కుతుంది. ఇది పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ మూవీ అని నాగ్ అశ్విన్ ఇప్పటికే చెప్పారు. తన మాటల్లోని విశ్వాసం పోస్టర్స్ లో కనిపిస్తుంది. సైన్స్ ఫిక్షన్ జోనర్లో ప్రాజెక్ట్ కే తెరకెక్కిస్తున్నారు. మూవీ టైం ట్రావెల్ స్టోరీ అనే ప్రచారం కూడా జరుగుతోంది. దిశా పటాని మరో హీరోయిన్ గా నటిస్తున్నారు. బిగ్ బి అమితాబ్ కీలక రోల్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే 2024లో విడుదలయ్యే అవకాశం కలదు.

Also Read: Shruti Haasan – Chiranjeevi: చిరంజీవి వల్ల నేను చాలా ఇబ్బందికి గురైయ్యాను అంటూ శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Nara Lokesh

Nara Lokesh: ఎంట్రోయ్.. లోకేష్ లో ఈ యాంగిల్ కూడా ఉందా? వైరల్ వీడియో

Nara Lokesh: సొంత నియోజకవర్గ మంగళగిరిలో పర్యటిస్తున్నారు మంత్రి నారా లోకేష్. గత రెండు రోజులుగా ఆయన పర్యటన కొనసాగుతోంది. నియోజకవర్గంలో దాదాపు 3,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాల పంపిణీ చేశారు...
Ganta Srinivasa Rao

Ganta Srinivasa Rao: ఎమ్మెల్యే వద్దు.. ఎంపీ ని అవుతానంటున్న ఆ సీనియర్!

Ganta Srinivasa Rao: ఏపీలో రాజకీయాలు మారుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజన అంశం మరోసారి తెరపైకి వచ్చింది. కచ్చితంగా ఈ బిల్లు ఆమోదం పొంది 2029 సార్వత్రిక ఎన్నికలు.. పెరిగిన నియోజకవర్గాలతోనే జరుగుతాయన్న టాక్...
Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Oktelugu Epaper