spot_img
Homeఎంటర్టైన్మెంట్Result of Varasudu Trailer: వారసుడు ట్రైలర్ రిజల్ట్ చూసి దిల్ రాజు భయపడ్డాడా? అందుకే...

Result of Varasudu Trailer: వారసుడు ట్రైలర్ రిజల్ట్ చూసి దిల్ రాజు భయపడ్డాడా? అందుకే రిలీజ్ డేట్ మార్చాడా?

Result of Varasudu Trailer: సినిమా పరిశ్రమలో టైమింగ్ ముఖ్యం. అది చాలా మంది ఫేట్ మార్చేస్తుంది. ఆ విషయం బాగా తెలిసిన దిల్ రాజు చివరి నిమిషంలో వారసుడు డేట్ మార్చేశారు. జనవరి 12న విడుదల కావాల్సిన వారసుడు చిత్రాన్ని ఒక రోజు ముందుకు తీసుకెళ్లాడు. అనగా జనవరి 11న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు. తాను నిర్మాతగా ఉన్న వారసుడు చిత్రాన్ని ఏ తేదీన విడుదల చేయాలనే విషయంలో సమయానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని దిల్ రాజు ముందే అనుకున్నాడు. నిన్న విడుదలైన ట్రైలర్ లో కూడా పొంగల్ రీలీజ్ అని వేశారు కానీ స్పష్టమైన డేట్ చెప్పలేదు.

Result of Varasudu Trailer
Vijay Thalapathi

కాబట్టి పరిస్థితులను బట్టి ఓపెనింగ్స్ దక్కేలా దిల్ రాజు ప్లాన్ చేస్తున్నాడు.తన ప్లాన్ లో భాగంగా జనవరి 11న వారసుడు విడుదల చేస్తున్నాడు. అదే రోజు అజిత్ తెగింపు విడుదల చేస్తున్నారు. అంటే కోలీవుడ్ టాప్ స్టార్స్ ఇద్దరూ ఒకే రోజు బాక్సాఫీస్ వద్ద పోటీకి దిగుతున్నారు. అయితే తెలుగులో విజయ్ కే అడ్వాంటేజ్ ఉంది. దిల్ రాజు సినిమా కావడంతో పెద్ద ఎత్తున విడుదల చేస్తున్నారు. తెగింపు చిత్రానికి పెద్దగా హైప్ లేదు. అందులోనూ విజయ్ మార్కెట్ తో పోల్చుకుంటే అజిత్ మార్కెట్ తెలుగులో తక్కువే.

Result of Varasudu Trailer
Vijay Thalapathi

అలాగే దిల్ రాజు జనవరి 12న కాకుండా 11న విడుదల చేయడానికి మరొక కారణం ఉందంటున్నారు. వారసుడు ట్రైలర్ చూశాక తెలుగు జనాలు పెదవి విరిచారు. పలు చిత్రాలతో పోల్చుతూ వారసుడు పాత చింతకాయ పచ్చడి అంటూ ఏకిపారేశారు. వారసుడు ట్రైలర్ సినిమాపై హైప్ పెంచకపోగా డామేజ్ చేసింది. ఈ క్రమంలో బాలయ్యతో పోటీపడటం మంచి ఆలోచన కాదని దిల్ రాజు భయపడ్డారంటున్నారు. జనవరి 12న వీరసింహారెడ్డి విడుదల అవుతుంది. వీరసింహారెడ్డి మూవీపై పరిశ్రమలో పాజిటివ్ బజ్ ఉంది.

Result of Varasudu Trailer
Vijay Thalapathi

వారసుడు చిత్రానికి పెద్ద మొత్తంలో థియేటర్స్ కేటాయించినప్పటికీ మెజారిటీ ఆడియన్స్ ఛాయిస్ వీరసింహారెడ్డి అవుతుంది. అలాగే మరుసటి రోజు వాల్తేరు వీరయ్య విడుదలవుతుంది. నెగిటివ్ టాక్ వస్తే వారసుడు చిత్రానికి ఓపెనింగ్ డే కూడా వసూళ్లు రావు. నెక్స్ట్ డే చిరంజీవి విడుదలవుతుంది కాబట్టి జనాలు మొత్తం వీరసింహారెడ్డి, వాల్తేరు థియేటర్స్ కి క్యూ కడతారు. ఒకరోజు ముందు రావడం ద్వారా అన్ని విధాలా మంచిదని దిల్ రాజు జనవరి 11 ఫిక్స్ చేశాడంటున్నారు.

Also Read: Deepika Padukone in Project K: లేడీ వారియర్ గా దీపికా పదుకొనె… గూస్ బంప్స్ తెప్పించేలా ప్రాజెక్ట్ కే అప్డేట్!

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Related News

Most Popular

Andhra Pradesh Local Elections

Andhra Pradesh Local Elections: స్థానిక ఎన్నికల్లో వైసీపీకి చావుదెబ్బ.. కూటమి ప్లాన్ అదుర్స్!

Andhra Pradesh Local Elections: కూటమి ప్రభుత్వం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధపడుతోంది. సాధారణంగా పంచాయతీ ఎన్నికలు అనేవి ముందుగా జరపడం సహజం. కానీ కూటమి ప్రభుత్వం మాత్రం మున్సిపల్...
Donald Trump

Donald Trump: యుద్ధాల్లో సైనిక మరణం వివరాలు ప్రకటించిన ట్రంప్.. అధ్యక్షుడి పోస్ట్ పై చర్చ!

Donald Trump: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ యుద్ధాల్లో సైనికుల మరణం పై తాజాగా ఒక పోస్ట్ చేశారు. తన సొంత సోషల్ మీడియా ట్రూత్ చేసిన ఈ పోస్టులో ఆఫ్గాన్...
David Warner

David Warner: మద్యం తాగి దొరికిన ప్రముఖ క్రికెటర్.. 9 నెలల జైలు శిక్ష

David Warner: క్రికెట్ అనేది జెంటిల్మెన్ గేమ్. ఆ క్రీడ ఆడేవాళ్లు జెంటిల్మెన్ల మాదిరిగానే వ్యవహరించాలి. అలా కాకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే పరువు పోతుంది. పైగా క్రికెటర్లను డెమి గాడ్స్ లాగా...
Jagan Mohan Reddy

Jagan Mohan Reddy: జగన్ ఇది తగునా?!.. రగిలిపోతున్న సీనియర్!

Jagan Mohan Reddy: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో విచిత్ర పరిస్థితి కొనసాగుతోంది. ఆ పార్టీలో నేతలకు ప్రాధాన్యం ఇవ్వడంలో హైకమాండ్ వ్యవహరిస్తున్న తీరు చర్చకు దారితీస్తోంది. ప్రధానంగా వివిధ కేసుల్లో చిక్కుకున్న వారికి...
Chandrababu And Lokesh

Chandrababu And Lokesh: లోకేష్ విషయంలో చంద్రబాబు సంచలన నిర్ణయం

Chandrababu And Lokesh: తెలంగాణలో తెలుగుదేశం పార్టీపై చంద్రబాబు ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. అక్కడ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు సిద్ధపడుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల నాటికి అక్కడ...
Oktelugu Epaper