https://oktelugu.com/

Actress: కెరీర్ బిగింగ్ లో స్నానం చేస్తున్న వీడియో లీక్, ఆపై ఇద్దరు హీరోలతో ఎఫైర్… ఇంకా పెళ్లి చేసుకోని 40 ఏళ్ల స్టార్ లేడీ!

Actress: టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ఇద్దరు హీరోలతో ఎఫైర్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అది పెళ్లి వరకు వెళ్ళలేదు. అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింది.

Written By:
  • S Reddy
  • , Updated On : July 12, 2024 / 05:40 PM IST

    Trisha Affair Rumours shakes Kollywood

    Follow us on

    Actress: కెరీర్ బిగినింగ్ లో ఆ హీరోయిన్ బాత్ రూమ్ వీడియో లీకైంది. అది పెద్ద రచ్చయ్యింది. పాపులారిటీ కోసం స్వయంగా ఈ చర్యకు పాల్పడిందనే విమర్శలు ఎదుర్కొంది. తెలుగు చిత్రాలతో స్టార్ గా ఎదిగింది. టాలీవుడ్, కోలీవుడ్ టాప్ స్టార్స్ అందరితో జతకట్టింది. ఇద్దరు హీరోలతో ఎఫైర్ నడిపినట్లు పుకార్లు ఉన్నాయి. ఓ వ్యాపారవేత్తతో నిశ్చితార్థం జరిగింది. అది పెళ్లి వరకు వెళ్ళలేదు. అనూహ్యంగా క్యాన్సిల్ అయ్యింది. ఈ నలబై ఏళ్ల స్టార్ లేడీకి ఇంకా పెళ్లి కాలేదు. అయినా… స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ పట్టేస్తూ సత్తా చాటుతుంది. ఆమె ఎవరో కాదు త్రిష కృష్ణన్.

    ప్రస్తుతం సౌత్ క్వీన్ గా త్రిష చక్రం తిప్పుతుంది. మొన్నటి వరకు ఆచి తూచి సినిమాలు చేసిన భామ ఇప్పుడు జోరు పెంచేసింది. వరుస సినిమాలకు సైన్ చేస్తూ… కెరీర్ పరంగా దూసుకుపోతోంది. తమిళం, మలయాళం, తెలుగు భాషతో సంబంధం లేకుండా బడా స్టార్స్ తో జత కడుతుంది. సెకండ్ ఇన్నింగ్స్ లో కూడా… హీరోయిన్ అవకాశాలు అందుకుంటూ తానేంటో ప్రూవ్ చేసుకుంటుంది. పొన్నియన్ సెల్వమ్ సక్సెస్ తర్వాత త్రిష ఇమేజ్ మారిపోయింది.

    గత ఏడాది విజయ్ దళపతి నటించిన లియోతో సూపర్ హిట్ అందుకుంది. దీంతో మరోసారి సౌత్ ఇండస్ట్రీలో త్రిష పేరు మారుమోగుతోంది. అదే రేంజ్ లో ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం కమల్ హాసన్ ‘ థగ్ లైఫ్ ‘ అజిత్ ‘విదాముయుర్చి’ సినిమాల్లో నటిస్తుంది. మలయాళంలో మోహన్ లాల్, టోవినో థామస్ లు నటిస్తున్న ఐడెంటిటీ సినిమాలో హీరోయిన్ గా చేస్తుంది. ఇక తెలుగులో మెగాస్టార్ సరసన ‘ విశ్వంభర ‘ సినిమాలో నటిస్తుంది. ఇప్పుడు ఆమె కెరీర్ పీక్స్ లో ఉంది. చేతిలో ఉన్నవన్నీ టాప్ హీరోల చిత్రాలే.

    దాదాపు 20 ఏళ్ల నుంచి ఈ చెన్నై బ్యూటీ సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తుంది. 40 ఏళ్ల వయసులో కూడా తరగని అందం మైంటైన్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే .. త్రిష కృష్ణన్ వ్యక్తిగత జీవితంలో ఎఫ్ఫైర్ రూమర్స్ చాలానే ఉన్నాయి. ఇప్పుడు కూడా త్రిష కి సంబంధించిన వివాదం తమిళ నాట హాట్ టాపిక్ అయ్యింది. గతంలో త్రిష ఇద్దరు స్టార్ హీరోలతో ప్రేమాయణం నడిపింది. తలపతి విజయ్, రానా దగ్గుబాటితో రిలేషన్ లో ఉన్నట్లు వార్తలు వినిపించాయి.

    2005 లో విజయ్, త్రిష కలిసి గిల్లి సినిమాలో నటించారు. ఆ సమయంలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అంటూ న్యూస్ వైరల్ అయింది. అది ఇప్పటికీ కంటిన్యూ చేస్తున్నారని అందుకే విజయ్ తన భార్యకు విడాకులు ఇవ్వబోతున్నాడు అంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. కానీ ఇవన్నీ అవాస్తవాలు అని, మేము మంచి స్నేహితులం అంటూ ఇటీవల విజయ్, త్రిష కొట్టిపారేశారు. త్రిష తో ఎఫైర్ రూమర్స్ ఎదుర్కున్న మరో హీరో రానా దగ్గుబాటి.

    అయితే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట. కానీ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో బ్రేకప్ చేసుకున్నారు అని అప్పట్లో టాక్ నడిచింది. కొంత కాలం తర్వాత త్రిష ఓ వ్యాపారవేత్తను పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. 2015 జనవరి 23న మణియన్ అనే వ్యక్తితో ఆమెకు నిశ్చితార్థం జరిగింది. ఏమైందో తెలియదు కానీ .. ఎంగేజ్మెంట్ జరిగిన నాలుగు రోజులకే వివాహం రద్దు చేసుకున్నారు. ప్రస్తుతం త్రిష పెళ్లి మేటర్ పక్కన పెట్టేసి కెరీర్ పైనే ఫోకస్ పెట్టింది. మరి జీవితంలో పెళ్లి చేసుకుంటుందో లేదో చూడాలి..