Jana Nayagan: కొన్ని సినిమాలు హిట్ / ఫ్లాప్ తో సంబంధం లేకుండా అభిమానుల హృదయాలను హత్తుకునే మధురమైన అనుభూతులు కలిగిస్తుంటాయి. వాటి నుండి మనం ఎప్పటికీ బయటకు రాలేము. ప్రతీ స్టార్ హీరో కెరీర్ కి ఎండింగ్ పాయింట్ అనేది ఒకటి ఉంటుంది. ఇదే ఇక మా హీరో నుండి చివరి సినిమా, భవిష్యత్తులో మా హీరో నుండి మరో సినిమా రాదు అనే మూమెంట్స్ వచ్చినప్పుడు , అభిమానుల్లో కలిగే మానసిక వేదన , ఎమోషనల్ ట్రామా గురించి ఎంత చెప్పినా తక్కువే. నిన్న ప్రపంచవ్యాప్తంగా తెలుగు , తమిళం మరియు హిందీ భాషల్లో విడుదలైన ‘జన నాయగన్ ‘ అభిమానులకు మిగిల్చిన జ్ఞాపకాలు కూడా అలాంటివే. తమిళనాడు ముఖ్యమంత్రి గా బాధ్యతలు చేపడుతున్న సమయం లో విజయ్ నుండి విడుదలైన మొదటి చిత్రం , చివరి చిత్రం ఇదే.
భవిష్యత్తులో ఆయన సినిమాలు చేసే అవకాశం లేదు , ఎందుకంటే ముఖ్యమంత్రి పదవి లో ఉన్నారు కాబట్టి. అయితే ఈ సినిమాకు ఆడియన్స్ నుండి ఫ్లాప్ టాక్ వచ్చింది, కానీ ఓపెనింగ్స్ మాత్రం అదిరిపోయాయి. విజయ్ రేంజ్ ఓపెనింగ్స్ కాకపోయినా , ఇలాంటి రీమేక్ సినిమాకు ఈ మాత్రం ఓపెనింగ్స్ రావడమంటే చిన్న విషయం కాదు. ఈ సినిమా అభిమానులకు కూడా నచ్చలేదు , కేవలం విజయ్ ని చివరిసారిగా వెండితెర పై చూసుకోవడం కోసం వెళ్లారు. అయితే సినిమా పూర్తి అయ్యాక, చివర్లో ఎండ్ టైటిల్స్ పడేటప్పుడు , విజయ్ ఫిల్మోగ్రఫీ లోని కొన్ని షాట్స్ ని తీసుకొని , ఒక ఎమోషనల్ సాంగ్ ని బ్యాక్ గ్రౌండ్ లో ప్లే చేస్తారు. ఈ విజువల్స్ చివర్లో ఇక సెలవు , ధన్యవాదాలు అని తమిళం లో పడుతుంది. అది చూసాక అభిమానులు బాగా ఎమోషనల్ అయిపోయారు.
తమిళ సినిమా ఇండస్ట్రీ ని కనుసైగతో శాసిస్తూ ముందుకు వెళ్లిన హీరో , ఇకపై సినిమాలు చెయ్యడు అనే విషయాన్నీ అభిమానులు జీర్ణించుకోవడం చాలా కష్టం. ఈ ఎమోషన్ ని కొంతమంది కంట్రోల్ చేసుకుంటారు , కొంత మంది చేసుకోలేరు. అలా ఒక విజయ్ మహిళా వీరాభిమాని ఈ వీడియో ని థియేటర్స్ లో చూస్తూ ‘అన్నా.. అన్నా’ అంటూ గుండెలు పగిలేలా ఏడ్చిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది. ఈ అమ్మాయి ఏడుపు ఎమోషన్ కోట్లాది మంది విజయ్ అభిమానుల ఎమోషన్ కి ప్రతీక. ఆ వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. కనీసం ఇలాంటి అభిమానుల కోసమైనా విజయ్ వీలు దొరికినప్పుడు సినిమాలు చేస్తే బాగుంటుందని విశ్లేషకులు ఆకాంక్షిస్తున్నారు. మరి అది జరుగుతుందో లేదో చూడాలి.



