Natasa Stankovic: “టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా తన భార్య నటాషాకు విడాకులు ఇచ్చాడా? ఐపీఎల్ లో విఫలమయ్యాడు కాబట్టి.. తనపై విమర్శలు రాకుండా ఉండేందుకు విడాకుల గేమ్ ఆడాడా?” కొద్దిరోజులుగా ప్రధాన మీడియాను, సోషల్ మీడియాను షేక్ చేస్తున్న ప్రశ్నలు ఇవి.. ఇటీవల టి20 వరల్డ్ కప్ టీమ్ ఇండియా గెలవడంలో కీలక పాత్ర పోషించిన హార్దిక్ పాండ్యా.. ఆ సంబరాలను తన కొడుకుతో మాత్రమే జరుపుకున్నాడు. టి20 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ లో దక్షిణాఫ్రికా పై భారత్ గెలవడంలో ముఖ్య భూమిక పోషించిన హార్దిక్ పాండ్యా ను అభినందిస్తూ నటాషా ఒక్క పోస్టు కూడా చేయలేదు. దీంతో హార్దిక్ పాండ్యా – నటాషా విడిపోయారని అందరూ ఒక అంచనాకొచ్చారు. అంతేకాకుండా టి20 వరల్డ్ కప్ ప్రారంభానికి ముందు నటాషా మరో వ్యక్తితో దిగిన ఫోటో సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేసింది. దీంతో హార్దిక్ – నటాషా మధ్య విభేదాలు నిజమేనని అందరూ ఒక అంచనాకు వచ్చారు.. అయితే విడాకులు తీసుకున్నారా? లేదా? అనే విషయం మాత్రం పై క్లారిటీ లేకపోవడంతో ఒకింత మీ మాంస మాత్రం ఉండేది. అయితే హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టా గ్రామ్ వేదికగా పెట్టిన ఓ పోస్ట్ మాత్రం సంచలనంగా మారింది.
హార్దిక్ పాండ్యా తన ఇన్ స్టా గ్రామ్ లో ఒక అమ్మాయితో సన్నిహితంగా దిగిన ఫోటోలను పోస్ట్ చేశాడు. ఆ అమ్మాయి భుజంపై చేతులు వేసి ఫోటో దిగాడు. ఆ ఫోటో చూస్తుంటే వారిద్దరి మధ్య సన్నిహిత బంధం ఉన్నట్టు అర్థమవుతోంది. ఈ ఫోటోను చూసిన హార్దిక్ పాండ్యా సతీమణి నటాషా ” ప్రేమకు ప్రతిదీ అర్థమైనదే.. దేవుడిపై నమ్మకం కలిగి ఉండాలి. దానిని ఎప్పుడూ కోల్పోకూడదు” అంటూ కామెంట్ చేసింది. “అయితే తనకు, హర్దిక్ కు విభేదాలు మాత్రమే ఉన్నాయని చెబుతోందా? లేక త్వరలో తాము విడాకులు తీసుకోబోతున్నామని అంటున్నదా? అనేది అర్థం కావడం లేదని” నెటిజన్లు పేర్కొంటున్నారు. వాస్తవానికి వీరిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని సన్నిహితులు అంటున్నారు. అందువల్లే నటాషా ముంబై లోనే ఉంటున్నప్పటికీ, వేరే ప్రాంతంలో నివాసము ఉంటున్నదని తెలుస్తోంది. పైగా ఆమె జిమ్ కోచ్ తో తరచూ మీడియాలో కనిపిస్తోంది. అంటే హార్దిక్ తో విడిపోయిన తర్వాత అతనితో నటాషా రిలేషన్ లో ఉందని స్పోర్ట్స్ వర్గాల టాక్.
ఇక 2024 ఐపిఎల్ లో ముంబై జట్టు కెప్టెన్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత హార్దిక్ పాండ్యా రోహిత్ అభిమానుల నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. సోషల్ మీడియాలో ట్రోల్ కు గురయ్యాడు. ముఖ్యంగా ముంబై ఆడుతున్నప్పుడు మైదానంలో కొంతమంది అభిమానులు హార్దిక్ పాండ్యాకు వ్యతిరేకంగా కామెంట్ చేశారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ జట్టు కూడా ఆశించినంత స్థాయిలో విజయాలు సాధించలేదు. 14 మ్యాచ్లు ఆడి, కేవలం నాలుగు మ్యాచ్లలో మాత్రమే విజయం సాధించింది. దీంతో సీనియర్ క్రికెటర్లు సైతం హార్దిక్ పాండ్యా పై విమర్శలు చేశారు. అతని నాయకత్వం పట్ల పెదవి విరిచారు. ఇలాంటి సమయంలోనే టి20 వరల్డ్ కప్ లో టీమిండియా కు అతడు వైస్ కెప్టెన్ అయ్యాడు. ఆల్ రౌండర్ కోటాలో బీసీసీఐకి ప్రత్యామ్నాయం లేకపోవడంతో హార్దిక్ పాండ్యాను ఎంపిక చేసింది. అయితే తన ఎంపిక సరైనదే అంటూ హార్దిక్ పాండ్యా నిరూపించాడు. టీమిండియాను టి20 వరల్డ్ కప్ సాధించడంలో ముఖ్య భూమిక పోషించాడు. తనను విమర్శించిన వారితో ప్రశంసలు పొందాడు.. కెరియర్ పరంగా పీక్స్ స్టేజిలో ఉన్నప్పటికీ.. వ్యక్తిగత జీవితంలో హార్దిక్ తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు. ప్రేమించి పెళ్లి చేసుకున్న నటాషా తో అతడికి విభేదాలు తారాస్థాయికి చేరాయని తెలుస్తోంది. అంతేకాదు వరల్డ్ కప్ విన్నింగ్ సెలబ్రేషన్స్ టైం లో కుమారుడు అగస్త్యను మాత్రమే నటాషా హార్దిక్ వద్దకు పంపడం వారిద్దరిపై వస్తున్న విమర్శలకు బలం చేకూర్చింది.
ఇక ఇలాంటి తరుణంలో ఓ అమ్మాయితో హార్దిక్ పాండ్యా, అతడి కుటుంబ సభ్యులతో అత్యంత సన్నిహితంగా కనిపించిన దృశ్యాలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆ యువతి మరెవరో కాదు డిజిటల్ కంటెంట్ క్రియేటర్, మేకప్ ఆర్టిస్టుగా ప్రాచుర్యం పొందిన ప్రాచీ సోలంకి. ఇటీవల ఆమె హార్దిక్ పాండ్యా ఇంటికి వచ్చింది. ఆ సమయంలో అతని కుటుంబ సభ్యులు ఆమెకు బొట్టుపెట్టి ఇంట్లోకి ఆహ్వానించారు. ఈ క్రమంలో ఆమె హార్దిక్ పాండ్యా, అతడి సోదరుడు కృనాల్ పాండ్యా, ఇతర కుటుంబ సభ్యులతో ఫోటోలు దిగింది. “ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. వరల్డ్ కప్ హీరోను ఇప్పుడే కలిశాను. అతనితో కలిసి ఫోటోలు దిగాను. చాలా ఆనందంగా ఉంది. ఈ ఆనందాన్ని మాటల్లో వర్ణించలేనంటూ” ప్రాచీ సోషల్ మీడియాలో కామెంట్స్ చేసింది. “వారిద్దరి మధ్య ఏమీ లేదు. ఒక ఫ్యాన్ గర్ల్ గా హార్దిక్ తో ఫోటో దిగింది. అతని కుటుంబంతో సరదాగా మాట్లాడింది. అంతే తప్ప వేరే వేరే ఊహించుకోవద్దంటూ” హార్దిక్ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. మరోవైపు ఈ ఫోటోపై నటాషా మరో విధంగా కామెంట్ చేయడం విశేషం.