Kalki 2898 AD: ప్రస్తుతం ఇప్పుడు ఎక్కడ చూసిన ప్రభాస్ కల్కి సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు.ఇక ఈ సినిమా మీద అంచనాలైతే భారీ స్థాయిలో ఉన్నాయి. ఇక జూన్ 27వ తేదీ కోసం ప్రతి ఒక్క ప్రేక్షకుడు కూడా విపరీతంగా ఎదురుచూస్తున్నారు అని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పటికే కల్కి సినిమాకు సంబంధించిన బుజ్జి బైరవల వీడియోని ప్రైమ్ వీడియోలో రిలీజ్ చేశారు.
ఇక దానికి విశేషమైన స్పందన రావడంతో సినిమా మీద అంచనాలు తార స్థాయిలో పెరిగిపోయాయి. ఇక ఇదిలా ఉంటే ఈ సినిమా నుంచి వచ్చిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ ఈ సినిమా కాన్సెప్ట్ ఎలా ఉంది దాన్ని దర్శకుడు తెరపైన ఎలా ప్రజెంట్ చేశాడు అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారబోతుంది. ఎందుకంటే బాహుబలి 2 సినిమా తర్వాత సాహో సినిమా భారీ అంచనాలతో వచ్చి ప్లాప్ ను మూటగట్టుకుంది. మరి ఇప్పుడు కల్కి సినిమా పరిస్థితి కూడా అలాగే మారబోతుందా కల్కి మరో సాహో కాబోతుందా అంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలైతే వస్తున్నాయి.
ఇక నిజానికి సాహో ట్రైలర్ కూడా అద్భుతంగా ఉంటుంది. కానీ సినిమా మాత్రం ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేకపోయింది. ఇక కల్కి సినిమా కూడా సాహో మాదిరిగానే ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయలేక పోతుందా? లేకపోతే ప్రేక్షకులందరిని మెప్పించి భారీ సక్సెస్ ను సాధిస్తుందా అనేది కూడా తెలియాల్సి ఉంది.
ఇక మొత్తానికైతే ఈ సినిమాతో ప్రభాస్ తన ఎంటైర్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్టు కొడతాడని ప్రేక్షకులందరూ మంచి అంచనాలతో ఉన్నారు. ఇక దానికి తగ్గట్టుగానే ప్రభాస్ ఏ మేరకు ఈ సినిమాతో మ్యాజిక్ చేస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది…చూడాలి మరి ఈ సినిమాతో ప్రభాస్ బాహుబలి 2 సినిమా రికార్డ్ ను బ్రేక్ చేస్తాడా లేదా అనేది…
Velpula Gopi is a Senior Reporter Contributes Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.
Read MoreWeb Title: Will kalki 2898 ad be a super hit in prabhas career or will it be another saaho
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com