spot_img
Homeఎంటర్టైన్మెంట్Tollywood Star Actress: ముద్దు ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.....

Tollywood Star Actress: ముద్దు ముద్దుగా ఉన్న ఈ పాప ఇప్పడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్.. ఎవరో తెలుసా?

Tollywood Star Actress:  సినీ ఇండస్ట్రీ(Film Industry) లో చిన్నతనంలో ఎంట్రీ ఇవ్వడం కామన్. ఊహ తెలియని వయసులో కెమెరా ముందు వచ్చి ఆ తరువాత స్టార్ హీరో, హీరోయిన్లు అయిన వారు ఎందరో ఉన్నారు. కానీ ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారని చెప్పలేం. అయతే ఇటీవల స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న ఓ భామకు సంబంధించిన చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలో అలరిస్తోంది. ఆమె నటించిన ఓ మూవీ కూడా త్వరలో రాబోతుంది. ఇంతకీ ఆ భామ ఎవరో తెలుసా?

డీజే టిల్లు (DJ Tillu) సినిమాను ఎవరూ మరిచిపోరు. యూత్ ను బాగా ఆకట్టుకున్న ఈ మూవీ ఇప్పటికీ ఓటీటీ ద్వారా కొందరు వీక్షిస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ మూవీలో హీరో జొన్నలగడ్డ సిద్ధు చేసిన హంగామా హంతా ఇంతా కాదు. అయితే హీరోకు తగ్గట్టుగా తగ్గేదేలే అన్నట్లుగా నటించింది నేహా శెట్టి (Neha Shetty). డీజే టిల్లు (DJ Tillu) మూవీ ద్వారా నేహా కు స్టార్ ఇమేజ్ వచ్చింది. ఆ తరువాత కొన్ని సినిమాల్లోఅవకాశాలు తెచ్చుకుంది.

నేహా శెట్టి (Neha Shetty) డీజే టిల్లు కంటే ముందే కొన్ని సినిమాల్లో నటించింది. వీటిలో గల్లీ రౌడీ, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ ఉన్నాయి. ఈ సినిమాల్లో సైడ్ పాత్రలో కనిపించిన నేహా శెట్టి (Neha Shetty) కి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ డీజే టిల్లు (DJ Tillu) తరువాత ఆమె రేంజ్ మారిపోయింది. ప్రస్తుతం ఈ భామ విశ్వక్ సేన్ తో కలిసి గ్యాంగ్ ఆఫ్ గోదావరి (Gang Of Godavari)లో నటిస్తోంది. ఈ మూవీ మే 31న రిలీజ్ కాబోతుంది.

ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ట్రెండీగా ఉంటుంది నేహా. లేటేస్టుగా ఆమె చైల్డ్ హుడ్ ఫొటో ఒకటి వైరల్ గా మారింది. ఇందులో ముద్దులొలికే పాపాయి అన్నట్లుగా కనిపిస్తుంది. భవిష్యత్ లో తప్పకుండా స్టార్ అవుతాననే ఉద్దేశంతో తన చూపులు ఉన్నాయని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే నేహా శెట్టి (Neha Shetty) నటించిన గ్యాంగ్ ఆఫ్ గోదావరి మూవీలో నటనతో మెప్పిస్తుందని కొందరు అంటున్నారు. చూద్దాం. ఆమె ఏ రేంజ్ లో పర్ఫామెన్స్ చూపిస్తుందో..

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

Related News

Most Popular

Allu Arjun

Allu Arjun: చిరంజీవి తో కలిసి రాజకీయాల్లోకి అల్లు అర్జున్ గ్రాండ్ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన అల్లు అర్జున్...

Allu Arjun: గత కొంతకాలంగా సోషల్ మీడియా లో అల్లు అర్జున్ రాజకీయాల్లోకి రాబోతున్నారా అనే ఊహాగానాలు ఏ రేంజ్ లో ప్రచారం అయ్యాయో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తన మామయ్య...
Jana Nayagan First Day Collection

Jana Nayagan First Day Collection: ‘జన నాయగన్ ‘ మొదటి రోజు వరల్డ్ వైడ్ వసూళ్లు.. ట్రేడ్...

Jana Nayagan First Day Collection: తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ హీరో గా నటించిన చివరి చిత్రం 'జన నాయగన్' ఎన్నో అడ్డంకులను ఎదురుకొని నిన్న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో...
India vs Zimbabwe

India vs Zimbabwe: శనిగాడు ‘గంభీర్’ లేడు.. అందుకే టీమిండియా గెలిచింది.. లక్ష్మణ్ వ్యూహం ఫలించింది

India vs Zimbabwe: కాలుకు వేస్తే మెడకు వేస్తాడు. మెడకు వేస్తే కాలుకు వేస్తాడు. బోడి గుండుకు కొండకు ముడి పెడతాడు. వెంట్రుకతో లాగాలి అంటాడు. వింత వింత నిర్ణయాలు తీసుకుంటాడు. అవి...
NEET Paper Leak

NEET Paper Leak: పేపర్ లీక్ చేసే ఊహే రాకుండా.. కేంద్రం తీసుకొచ్చిన చట్టం ఎంత కఠినంగా ఉందో...

NEET Paper Leak: దేశవ్యాప్తంగా కొద్దిరోజులుగా నీట్ పేపర్ లీకేజీ వ్యవహారం గురించి విపరీతంగా చర్చ నడుస్తోంది. కాక్రోచ్ జనతా పార్టీ ఆధ్వర్యంలో యువకులు ఏకంగా పార్లమెంటు మీదికి దూసుకుపోయారు. కేంద్ర...
Tech Mahindra Employee

Tech Mahindra Employee: ఐటీ ఉద్యోగం అంటేనే పేక మేడ.. ఎప్పుడు ఊడుతుందో ఎవరికి ఎరుక.. పాపం ఈ...

Tech Mahindra Employee: ఇన్ని రోజులపాటు చేసిన చోట ఉద్యోగం లేదంటే.. ఆ ఉద్యోగి కి ఎంత కష్టం ఉంటుంది.. హాయిగా పని చేసుకుంటూ.. బ్రహ్మాండంగా జీతం తీసుకుంటూ.. జీవితాన్ని సాగిస్తున్న ఆమెకు...
Oktelugu Epaper