Homeఎంటర్టైన్మెంట్Highest Grossing Re Release Films: రీ రిలీజ్ చిత్రాల్లో మొదటి రోజు అత్యధిక గ్రాస్...

Highest Grossing Re Release Films: రీ రిలీజ్ చిత్రాల్లో మొదటి రోజు అత్యధిక గ్రాస్ రాబట్టిన సినిమాలు ఇవే.. ‘డార్లింగ్’ ఏ స్థానం లో ఉందంటే..

Highest Grossing Re Release Films: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి ఇండస్ట్రీ కి ఒక ఊపు వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల లేవు , విడుదలైన చిన్న సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి, మొదటి రోజే హౌస్ ఫుల్స్ నమోదు అవ్వని పరిస్థితి , అలాంటి సమయం లో నిన్న విడుదలైన ‘డార్లింగ్’ చిత్రం మరోసారి థియేటర్స్ […]

Highest Grossing Re Release Films: టాలీవుడ్ లో రీ రిలీజ్ ట్రెండ్ మొదలైనప్పటి ఇండస్ట్రీ కి ఒక ఊపు వచ్చింది అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఈ సమ్మర్ సీజన్ లో పెద్ద హీరోల సినిమాలు విడుదల లేవు , విడుదలైన చిన్న సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్స్ అవుతున్నాయి, మొదటి రోజే హౌస్ ఫుల్స్ నమోదు అవ్వని పరిస్థితి , అలాంటి సమయం లో నిన్న విడుదలైన ‘డార్లింగ్’ చిత్రం మరోసారి థియేటర్స్ ని హౌస్ ఫుల్ బోర్డ్స్ తో కళకళలాడేలా చేసింది. ఏ సందర్భం లేకపోయినప్పటికీ, వర్కింగ్ డే అయినప్పటికీ కూడా ఈ చిత్రానికి నమోదైన గ్రాస్ వసూళ్లు ట్రేడ్ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి అయ్యేలా చేసింది. అయితే మొదటి రోజు ఆల్ టైం రికార్డు ని నెలకొల్పడం లో మాత్రం విఫలం అయ్యింది. అయితే ఇప్పటి వరకు రీ రిలీజ్ అయినా చిత్రాల్లో అత్యధిక గ్రాస్ వసూళ్లను మొదటి రోజు రాబట్టిన టాప్ 5 చిత్రాలేంటో ఒకసారి చూద్దాం.

మొదటి స్థానం లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గబ్బర్ సింగ్ చిత్రం చెక్కు చెదరకుండా అలాగే ఉండిపోయింది. పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి అయిన కొత్తల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజే దాదాపుగా 8 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించింది. ఈ రికార్డు ని ఇప్పటి వరకు ఏ రీ రిలీజ్ చిత్రం కూడా అందుకోకపోవడం గమనార్హం. గబ్బర్ సింగ్ తర్వాత రెండవ స్థానం లో నిల్చిన చిత్రం ‘ఖలేజా’. మహేష్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో డిజాస్టర్ ఫ్లాప్ గా నిల్చింది. కానీ రీ రిలీజ్ లో మాత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. దాదాపుగా 6 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను ఈ చిత్రం మొదటి రోజు రాబట్టి సంచలనం సృష్టించింది.

ఇక ఆ తర్వాత మూడవ స్థానం లో నిన్న విడుదలైన రెబల్ స్టార్ ప్రభాస్ ‘డార్లింగ్’ చిత్రం నిల్చింది. ఈ సినిమాకు ప్రీమియర్స్ + మొదటి రోజు కలిపి దాదాపుగా 5 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఆ తర్వాత మురారి 5 కోట్ల 27 లక్షల రూపాయలతో నాల్గవ స్థానం లో, 5 కోట్ల 18 లక్షల రూపాయిల గ్రాస్ తో బిజినెస్ మెన్ చిత్రం 5 వ స్థానం లో నిలిచాయి. అదే విధంగా పవన్ కళ్యాణ్ ఇండస్ట్రీ హిట్ ఖుషి చిత్రానికి 4 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లతో 6 వ స్థానం లో నిలబడగా, 4 కోట్ల 20 లక్షల రూపాయిల గ్రాస్ తో అతడు చిత్రం 7 వ స్థానం లో నిల్చింది.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper