Homeఎంటర్టైన్మెంట్Actor Apology To Tamannaah Issue: తమన్నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ...

Actor Apology To Tamannaah Issue: తమన్నా కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడానికి సిద్ధం అంటూ ప్రముఖ నటుడు షాకింగ్ కామెంట్స్..

Actor Apology To Tamannaah Issue: బాలీవుడ్ దర్శకులకు , నటీనటులకు కాస్త నోటి దూల ఎక్కువే. సూపర్ స్టార్స్ నుండి నిన్న గాక మొన్న ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన వాళ్ళు కూడా ప్రభాస్, రజినీకాంత్ లాంటి బిగ్గెస్ట్ సూపర్ స్టార్స్ పై నోరు జారడం వంటివి మనం చాలానే చూశాము . అలాంటి అనుభవం సౌత్ నుండి నార్త్ కి వెళ్లిన మిల్కీ బ్యూటీ తమన్నా(Tamanna Bhatia) కి కూడా ఎదురు అయ్యింది. సౌత్ లో బిగ్గెస్ట్ స్టార్ హీరోయిన్ గా ఎదిగిన తమన్నా, కొత్త వాళ్ళ రాక కారణంగా అవకాశాలు బాగా తగ్గిపోవడం తో బాలీవుడ్ కి వెళ్ళింది. సౌత్ లో రొమాన్స్ సన్నివేశాలు చేయడానికి ఇష్టం చూపని తమన్నా , బాలీవుడ్ లో ఏకంగా అడల్ట్ కంటెంట్ సినిమాల్లో సైతం నటించడానికి సిద్ధమైపోయింది. అంతే కాదు , ఒకప్పుడు తనపై ఎవరైనా కామెంట్ చేస్తే సోషల్ మీడియా ద్వారా చాలా ఘాటుగా రెస్పాన్స్ ఇచ్చే తమన్నా, బాలీవుడ్ కి వెళ్లిన తర్వాత ఎలాంటి కామెంట్స్ ని అయినా పట్టించుకోవడం మానేసింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తే గతం లో తమన్నా బాలీవుడ్ లో దాదాపుగా వెయ్యి కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘స్త్రీ 2’ చిత్రం లో ఒక స్పెషల్ ఐటెం సాంగ్ చేసింది. ఈ సాంగ్ అప్పట్లో సెన్సేషనల్ హిట్ అయ్యింది. సోషల్ మీడియా లో కూడా ఒక రేంజ్ లో వైరల్ అయ్యింది. ఈ సాంగ్ లో తమన్నా అందాలను చూసిన ప్రముఖ సీనియర్ నటుడు అన్నూ కపూర్ తమన్నా షేప్స్ పై కొన్ని కామెంట్స్ చేసాడు. ఆమె రంగుని ఉద్దేశిస్తూ అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు పెద్ద దుమారమే రేపింది. ఈ అంశం పై రీసెంట్ గా ఆయన ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో మరోసారి ఘాటుగా స్పందించాడు.

ఆయన మాట్లాడుతూ ‘స్త్రీ 2 ఐటెం సాంగ్ లో నేను తమన్నా అందాన్ని పొగుడుతూ కామెంట్ చేసేలోపు అప్పట్లో చాలా పెద్ద రచ్చ చేశారు. అదే మాట నేను ఇంగ్లీష్ లో అనుంటే అంత పెద్ద గొడవ అయ్యేది కాదేమో , హిందీ లో మాట్లాడినందుకు సమస్యలు. నా మనసులో ఎలాంటి దురుద్దేశాలు లేవు. స్వచ్ఛంగా ఇచ్చిన కామెంట్ అది. నేను తప్పు గా మాట్లాడానని తమన్నా కి అనిపిస్తే వయస్సు లో పెద్ద వాడిని అయినప్పటికీ ఆమె కాళ్ళు పట్టుకొని క్షమాపణలు చెప్పడానికి నేను సిద్ధం. నాకు స్వచ్ఛమైన మనసు ఉంది కాబట్టే నేను ఆమె కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పాను. తమన్నా అది స్పోర్టివ్ గానే తీసుకొని ఇలా కామెంట్ చేశారేంటి అని నన్ను ఎప్పుడూ అడగలేదు . అది ఆమె గొప్పతనం , మధ్యలో మీకొచ్చిన సమస్య ఏంటి’ అంటూ ఆయన చెప్పుకొచ్చాడు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular