War 2 Hero Villain: ఎన్టీఆర్(Junior NTR), హృతిక్ రోషన్(Hrithik Roshan) కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వార్ 2′(War2 Movie) మూవీ వచ్చే నెల 14 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన థియేట్రికల్ ట్రైలర్ ని నేడు విడుదల చేసింది మూవీ టీం. ఈ ట్రైలర్ ని కూడా ఫ్యాన్స్ కోసం కొన్ని సెలెక్టెడ్ థియేటర్స్ లో వేశారు. రెస్పాన్స్ వాళ్ళ వైపు నుండి అదిరిపోయింది. అయితే ఈ ట్రైలర్ కి ముందు వరకు కూడా ఈ చిత్రం లో హీరో హృతిక్ రోషన్, విలన్ ఎన్టీఆర్ అని అనుకున్నారు. టీజర్ కూడా అదే అర్థం వచ్చేలా కట్ చేశారు. కానీ నేడు ట్రైలర్ ని చూసిన తర్వాత అసలు ఈ సినిమాలో హీరో ఎవరు?, విలన్ ఎవరు? అనే అయ్యోమయ్యం పరిస్థితి కి వెళ్లిపోయారు ప్రేక్షకులు.
వృత్తి మీద జీవితం మీద వైరాగ్యం చెందిన వాడిలాగా ఇందులో హృతిక్ రోషన్ ని చూపించారు. అతని గురువే ఊసే రేంజ్ లో ఎదో పని చేసినట్టు ట్రైలర్ లో హృతిక్ ని చూపించారు. ఇక మంచి, చెడు అనే తేడా లేకుండా, కేవలం ఒక ఆయుధం లాగా ఎన్టీఆర్ ని చూపించారు. ఒక విధంగా చూస్తే ఇద్దరినీ విలన్స్ లెక్కనే చూపించాడు డైరెక్టర్. కానీ వాళ్ళు అలా మారడానికి కారణాలు ఏంటి?, ఏజెంట్ కబీర్ ఎందుకు తన ఉద్యోగం వదిలేసాడు?, ఏజెంట్ విక్రమ్ ఎందుకు అంత మానవ మృగం లాగా మారిపోయాడు అనేది స్టోరీ అని ఈ ట్రైలర్ ని చూస్తే అనిపించింది. చివరికి ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే ఎవరు గెలుస్తారు అనేది కూడా ఆసక్తికరంగా చూపించారు. ఇక కియారా అద్వానీ గురించి మాట్లాడుకోవాలి. ఈరోజు విడుదలైన ట్రైలర్ లో ఆమెని హృతిక్ రోషన్ కి జోడీగా చూపించారు.
Also Read: వార్ 2 ట్రైలర్ రివ్యూ: ఇద్దరు రూత్ లెస్ ఏజెంట్స్ తలపడితే? బ్లాస్టింగ్ విజువల్స్!
అదే సమయం లో ఆమె హృతిక్ రోషన్ తో ఫైట్ చేస్తున్నట్టు కూడా చూపించారు. అంటే ఈమె ఎన్టీఆర్ గ్యాంగ్ కి సంబంధించిన ఆమేనా?, హృతిక్ రోషన్ తో ప్రేమగా ఉంటున్నట్టు నటించి అతన్ని దొంగ దెబ్బ తీసే క్యారక్టర్ లో ఆమె కనిపించబోతుందా? అనే సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. ఇలా ఒక ట్రైలర్ తో ఎన్నో సందేహాలకు దారి తీసి చూపించాడు డైరెక్టర్. కానీ ఒక్కటైతే అర్థం అయ్యింది, ఇందులో ఎన్టీఆర్ హృతిక్ రోషన్ వల్ల మోసపోతాడు, అదే విధంగా హృతిక్ రోషన్ ఇండియన్ ఆర్మీ చీఫ్ వల్ల మోసపోతాడు. ఇలా వీళ్లిద్దరి మధ్య జరిగే పోరు ఎలా ఉండబోతుందో చూడాలి. ట్రైలర్ కి ముందు పెద్దగా ఈ సినిమా పై అంచనాలు లేవు కానీ, ట్రైలర్ తర్వాత మాత్రం ప్రతీ ఒక్కరికి చూడాలి అనే ఆశ కలిగింది.