Homeఎంటర్టైన్మెంట్Peddi Movie Box Office Collections: 'వర్కింగ్ డే' లో కూడా దుమ్ములేపుతున్న 'పెద్ది' చిత్రం.....

Peddi Movie Box Office Collections: ‘వర్కింగ్ డే’ లో కూడా దుమ్ములేపుతున్న ‘పెద్ది’ చిత్రం.. ఈరోజు ఎంత గ్రాస్ వస్తుందంటే..

Peddi Movie Box Office Collections: సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ట్రేడ్ మొత్తం నిరాశలో ఉంది , హైదరాబాద్ వంటి టాప్ సిటీలలో కూడా థియేటర్స్ ని మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయం లో ఒక్క సరైన హిట్ పడకపోతే సినీ ఇండస్ట్రీ సంక్షోభం లోకి వెళ్తుందని అందరూ భయపడ్డారు. అలాంటి సమయం లో ఎన్నో అంచనాలు , ఆశల మధ్య […]

Peddi Movie Box Office Collections: సంక్రాంతి తర్వాత టాలీవుడ్ లో విడుదలైన ఏ సినిమాకు కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు. ట్రేడ్ మొత్తం నిరాశలో ఉంది , హైదరాబాద్ వంటి టాప్ సిటీలలో కూడా థియేటర్స్ ని మూసి వేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇలాంటి సమయం లో ఒక్క సరైన హిట్ పడకపోతే సినీ ఇండస్ట్రీ సంక్షోభం లోకి వెళ్తుందని అందరూ భయపడ్డారు. అలాంటి సమయం లో ఎన్నో అంచనాలు , ఆశల మధ్య విడుదలైన ‘పెద్ది’ చిత్రానికి ఆడియన్స్ నుండి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ వచ్చింది. ప్రీమియర్ షోస్ నుండే ఈ చిత్రానికి వచ్చిన పాజిటివ్ టాక్ ని చూసి ట్రేడ్ పండితులు ఈ చిత్రం రామ్ చరణ్ కెరీర్ లో మరో మగధీర, రంగస్థలం రేంజ్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అనుకున్నారు. వాళ్ళ అంచనాలకు తగ్గట్టుగానే ఈ చిత్రం ఆ రేంజ్ బ్లాక్ బస్టర్ దిశగా అడుగులు వేస్తోంది.

నేడు ఈ చిత్రానికి బాక్స్ ఆఫీస్ వద్ద అసలైన పరీక్ష. ఎందుకంటే వర్కింగ్ డే కాబట్టి. ఈ వర్కింగ్ డే టెస్ట్ లో ఈ చిత్రం పాస్ అవుతుందా లేదా ? అనే అనుమానం అభిమానుల్లో ఉండేది. అయితే ఈ టెస్ట్ ని డిస్టింక్షన్ లో పాస్ అయ్యింది ఈ చిత్రం అనడం లో ఎలాంటి సందేహం లేదు. నూన్ షోస్ నుండే ఈ చిత్రానికి డీసెంట్ స్థాయి వసూళ్లు నమోదు అయ్యాయి. నైజాం ప్రాంతం లో మ్యాట్నీ షోస్ నుండి అద్భుతమైన ఆక్యుపెన్సీలు నమోదు అవ్వడం మొదలయ్యాయి. ఆ కారణం చేత ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు 15 వేల టిక్కెట్లు అమ్ముడుపోవడం జరిగింది. ఈమధ్య కాలం లో మన టాలీవుడ్ స్టార్ హీరో సినిమాకు ఈ రేంజ్ అడ్వాన్స్ బుకింగ్స్ వర్కింగ్ డే లో జరగడం ఎప్పుడూ చూడలేదు.

దీనిని బట్టీ చూస్తుంటే ఈ చిత్రానికి ఏ రేంజ్ లాంగ్ రన్ ఉండబోతుందో అర్థం అవుతుంది. ‘రంగస్థలం’ రేంజ్ లాంగ్ రన్ ఎప్పుడు వస్తుందో మళ్లీ రామ్ చరణ్ కి అని అంతా అనుకునేవారు , ‘పెద్ది’ చిత్రం ఆ స్థాయి బ్లాక్ బస్టర్ అని బలంగా నమ్మారు , వాళ్ళ నమ్మకాలను నిజం చేసింది ఈ చిత్రం. మొదటి వీకెండ్ లో ప్రపంచవ్యాప్తంగా 240 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టి సంచలనం సృష్టించిన ఈ చిత్రం , ఈ వీకెండ్ తో 300 కోట్ల గ్రాస్ క్లబ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వబోతుంది. #RRR తో వెయ్యి కోట్ల గ్రాస్ ని అందుకున్న రామ్ చరణ్ , ఇప్పుడు ‘పెద్ది’ తో 300 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వడం పై చరణ్ ఫ్యాన్స్ ఫుల్ జోష్ లో ఉన్నారు. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం 400 కోట్ల గ్రాస్ ని రాబడుతుందా లేదా అనేది చూడాలి. నేడు ఈ చిత్రానికి నమోదు అవుతున్న హౌస్ ఫుల్స్ ని చూస్తుంటే, కచ్చితంగా నేడు 15 కోట్ల గ్రాస్ ని కొల్లగొడుతుందని అంటున్నారు ట్రేడ్ విశ్లేషకులు.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper