Homeఎంటర్టైన్మెంట్Mrunal Thakur item song: 'పెద్ది' ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. 4 నిమిషాల...

Mrunal Thakur item song: ‘పెద్ది’ ఐటెం సాంగ్ లో మృణాల్ ఠాకూర్.. 4 నిమిషాల కోసం ఆమె డిమాండ్ చేసిన రెమ్యూనరేషన్ ఎంతంటే!

Mrunal Thakur item song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు అయినటువంటి మార్చి 27 న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కాబోతున్నాయి. అదే రోజున ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గ్రాండ్ గా మొదలు కానున్నాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పోస్ట్ […]

Mrunal Thakur item song: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘పెద్ది'(Peddi Movie) షూటింగ్ ఇప్పుడు చివరి దశలో ఉంది. రామ్ చరణ్ పుట్టినరోజు అయినటువంటి మార్చి 27 న ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు మొత్తం పూర్తి కాబోతున్నాయి. అదే రోజున ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ కూడా గ్రాండ్ గా మొదలు కానున్నాయి. అయితే ఈ సినిమా అనుకున్న సమయానికి పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకుంటుందా లేదా , అసలు ఏప్రిల్ 30 న విడుదల అవుతుందా లేదా అనే సందేహం ప్రతీ ఒక్కరిలోనూ ఉంది. అనుకున్న పనులన్నీ సమయానికి పూర్తి అవుతున్నాయని, కేవలం VFX వర్క్ మాత్రమే కాస్త ఆలస్యం అయ్యే అవకాశం ఉందని, అదే కనుక జరిగితే కచ్చితంగా ఈ చిత్రం వాయిదా పడుతుందని అంటున్నారు విశ్లేషకులు. ఇకపోతే రీసెంట్ గానే హైదరాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన క్లైమాక్స్ షూట్ ని పూర్తి చేశారు.

ఇప్పుడు కేవలం ఐటెం సాంగ్ షూటింగ్ మాత్రమే బ్యాలన్స్ ఉంది. ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్ ఇప్పటికే పలువురి పేర్లను పరిశీలించారు. కానీ చివరికి మృణాల్ ఠాకూర్ ని ఎంచుకున్నారు. యూత్ ఆడియన్స్ లో మృణాల్ ఠాకూర్ కి పాన్ ఇండియా లెవెల్ లో ఎలాంటి క్రేజ్ ఉంది అనేది ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ నాలుగు నిమిషాల ఐటెం సాంగ్ కోసం ఆమె ఏకంగా 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ అందుకుంటుందట. అంటే నిమిషానికి కోటి రూపాయిలు అన్నమాట. ఈ పాటలో రామ్ చరణ్ , మృణాల్ ఠాకూర్ లతో పాటు జాన్వీ కపూర్ కూడా ఆడిపాడనుంది. రామ్ చరణ్ , మృణాల్ ఠాకూర్ కాంబినేషన్ లో ఇప్పటి వరకు ఒక్క సినిమా మీద కూడా రాలేదు. వీళ్ళ కాంబినేషన్ లో సినిమా వస్తే బాగుంటుందని అంతా అనుకున్నారు కానీ, చివరికి ఇలా ఐటెం సాంగ్ తో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

Also Read: 4 రోజుల్లో 700 కోట్లు.. తెలుగు రాష్ట్రాల నుండి ‘ధురంధర్ 2’ రాబట్టిన వసూళ్లు ఎంతంటే!

వాస్తవానికి ఈ ఐటెం సాంగ్ కోసం మేకర్స్ ముందుగా సమంత ని సంప్రదించారు. కానీ ఆమె ఐటెం సాంగ్స్ ఇప్పుడు చేయడానికి సుముఖత చూపించడం లేదు. ఆ తర్వాత బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో ఒకరైన అలియా భట్ ని కూడా సంప్రదించారు, కానీ కుదర్లేదు. చివరికి మృణాల్ ఠాకూర్ ని సంప్రదించగా, ఆమె క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసింది. ఇలా రామ్ చరణ్ కెరీర్ లో ఒక మెమరబుల్ సినిమాగా పిలవబడుతున్న ‘పెద్ది’ మూవీ షూటింగ్ ఒక ఐటెం సాంగ్ తో ముగియబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుదలైన రెండు పాటలకు బంపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు ఈ ఐటెం సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ రాబోతుందో చూడాలి.

Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

Oktelugu Epaper