Pakistan panic after Dhurandhar 2: మన ఇండియన్ మూవీ లవర్స్ కి సరికొత్త థియేట్రికల్ అనుభూతిని ఇచ్చిన చిత్రం ‘ధురంధర్'(Dhurandhar Movie). చాలా సాధారణమైన అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సునామీ ని సృష్టించిందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. రీసెంట్ గానే విడుదలైన ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం కేవలం 4 రోజుల్లోనే 700 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. రాబోయే రోజుల్లో ఈ చిత్రం కచ్చితంగా 2500 కోట్ల రూపాయిల గ్రాస్ మార్కుని అందుకుంటుందని బలమైన నమ్మకం తో ఉన్నారు మేకర్స్. కేవలం సోమవారం రోజున ఈ చిత్రానికి జరిగిన అడ్వాన్స్ బుకింగ్స్ గ్రాస్ 35 కోట్ల రూపాయిల వరకు ఉందట. దీనిని బట్టీ ఈ సినిమా వసూళ్ల సునామీ ప్రపంచవ్యాప్తంగా ఏ రేంజ్ లో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదంతా పక్కన పెడితే ఈ సినిమా తర్వాత పాకిస్థాన్ లో కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయని అంటున్నారు విశ్లేషకులు.
అందుకు సంబంధించిన ఒక ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఈ సినిమాలో చూపించినట్టుగానే పాకిస్థాన్ లో ఇండియన్ స్పై లు ఉన్నారేమో అనే అనుమానం వారిలో బలంగా నాటుకుపోయింది. ఎవరైనా గుర్తు తెలియని వ్యక్తి రోడ్డు మీద పడుకున్నప్పుడు, లేదా ఏదైనా వ్యక్తి అనుమానాస్పదంగా కనిపించినప్పుడు, వాళ్ళని తీసుకెళ్లి తనిఖీ చేయడం వంటివి చేస్తున్నారట. ముఖ్యంగా ల్యారీ నగరం లో ఇలాంటివి చోటు చేసుకుంటున్నాయని అంటున్నారు. ఇది నిజమో, లేకపోతే పుకారో అనేది తెలియదు కానీ, సోషల్ మీడియా లో మాత్రం దీనిపై చాలా ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. అందుకు సంబంధించిన వీడియో ని మీకోసం క్రింద అందిస్తున్నాము చూడండి. ఈ వీడియో కావాలని రీల్ కోసం చేసింది అయితే కాదు, అందులో కనిపిస్తున్నది నిజమైన పోలీసులే అట. ఒక్క సినిమా వాళ్లపై ఎలాంటి ప్రభావం చూపించిందో మీరే చూడండి.
అయితే ‘ధురంధర్ ‘ చిత్రాన్ని పాకిస్థాన్ మరియు మిడిల్ ఈస్ట్ దేశాల్లో విడుదల కానివ్వకుండా బ్యాన్ చేశారు కదా, ఇప్పుడు ఈ చిత్రాన్ని అక్కడి జనాలు ఎలా చూసారు, వాళ్లపై ఇంత ప్రభావం ఎలా పడింది అనే సందేహం మీకు కలగొచ్చు. థియేటర్స్ లో ఈ చిత్రం విడుదలకాకపోయిన, నెట్ ఫ్లిక్స్ లో విడుదలైంది. ఇక్కడ ఈ చిత్రానికి రికార్డు వ్యూస్ వచ్చాయి, ఆ వ్యూస్ లో అత్యధిక శాతం పాకిస్థాన్ దేశం నుండి వచ్చాయి , అక్కడ ఈ చిత్రం అనేక రోజులు అద్భుతమైన వ్యూస్ తో ట్రెండ్ అయ్యింది. అందుకే ఈ సినిమా ప్రభావం వాళ్లపై ఈ స్థాయిలో పడిందని అంటున్నారు విశ్లేషకులు.
After #Dhurandhar2, panic everywhere in Pakistan … now they’re out in Lyari searching for “Indian spies” on every street. pic.twitter.com/cZ23PpztLv
— Kashinath 2.0 (@TheDeolsFC) March 22, 2026