Kalki 2898 AD: కల్కి కంటే ఆ ప్లాప్ సినిమా 20 రెట్లు బెటర్ అంటున్న బాలీవుడ్ క్రిటిక్…

ప్రభాస్ చేసిన బాహుబలి, సలార్ సినిమాల మీద కూడా ఆయన తీవ్రమైన విమర్శలను చేశారు. ఇక అప్పటి నుంచి అందరూ ఆయన్ని పట్టించుకోవడం కూడా మానేసారు.

Written By: Gopi, Updated On : July 4, 2024 6:12 pm

Kalki 2898 AD

Follow us on

Kalki 2898 AD: ఒక సినిమాతో సూపర్ డూపర్ సక్సెస్ ని అందుకోవడం అంటే అంత ఈజీ కాదు అలాంటి ఫీట్ ని అలవోకగా సాధిస్తున్న హీరో ప్రభాస్…ప్రస్తుతం ఆయన ‘కల్కి ‘ సినిమాతో 700 కోట్లు రాబట్టాడు. ఇక తొందర్లోనే 1000 కోట్ల మార్క్ టచ్ చేయబోతుంది.

ఇక ఇదిలా ఉంటే బాలీవుడ్ మీడియా కల్కి సినిమా మీద విమర్శలను చేస్తుంది. ఇక తెలుగు సినిమా బాలీవుడ్ సినిమాలను డామినేట్ చేస్తున్న క్రమంలో మన తెలుగు సినిమాలను ఎలాగైనా సరే తక్కువ చేసి మాట్లాడాలనే ఉద్దేశ్యం తోనే బాలీవుడ్ మీడియా ఇలాంటి చవకబారు మాటలు మాట్లాడుతూ ఉంటుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇక అందులో భాగంగానే ఫిలిం క్రిటిక్ అని చెప్పుకునే కేఆర్ కే (కమల్ ఆర్ ఖాన్) అనే వ్యక్తి మరోసారి కల్కి సినిమా మీద భారీ విమర్శలను చేస్తున్నాడు. రన్బీర్ కపూర్ హీరోగా వచ్చిన బ్రహ్మాస్త్ర సినిమా కల్కి సినిమా కంటే 20 రెట్లు బెటర్ అంటూ ఆయన కామెంట్స్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

ఇక ఇంతకు ముందు ప్రభాస్ చేసిన బాహుబలి, సలార్ సినిమాల మీద కూడా ఆయన తీవ్రమైన విమర్శలను చేశారు. ఇక అప్పటి నుంచి అందరూ ఆయన్ని పట్టించుకోవడం కూడా మానేసారు. అయినప్పటికీ మరోసారి ఎక్స్ వేదిక గా మన తెలుగు సినిమా మీద విషం కక్కుతూ కేఆర్ కే ఒక పోస్ట్ చేశాడు.ఇక అది చూసిన ప్రభాస్ అభిమానులు, అలాగే తెలుగు సినిమా అభిమానులందరూ కూడా ఆయన మీద నెగిటివ్ కామెంట్లైతే చేస్తున్నారు.

నిజానికి హాలీవుడ్ ప్రేక్షకులు సైతం మెచ్చుకుంటున్న మన కల్కి సినిమాను ఫ్లాప్ సినిమా అయిన ‘బ్రహ్మాస్త్ర ‘ సినిమాతో పోల్చడమే ఒకతైతే కల్కి కంటే ఆ సినిమానే 20 రెట్లు బెటర్ అనడంలో ఆయనకు తెలుగు సినిమా మీద ఉన్న కుళ్ళు అయితే కనిపిస్తుంది. ఇక ఎవరు ఏమనుకున్నా తెలుగు సినిమా స్థాయి అనేది హాలీవుడ్ స్టాండర్డ్ లో ఉంటుందనేది మాత్రం వాస్తవం…ఇక దానికి అనుకూలంగానే మన దర్శకులు ఎవరిని పట్టించుకోకుండా విజువల్ వండర్స్ చేస్తూ సక్సెస్ లను అందుకుంటున్నారు…