Deepika Padukone: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న విషయం మనకు తెలిసిందే. మరి ఇలాంటి సందర్భంలోనే ప్రభాస్ లాంటి నటుడు సైతం సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు… ఇప్పటికే సలార్, కల్కి లాంటి వరుస సక్సెస్ లతో మంచి ఊపు మీదున్న ఆయన ఇప్పుడు చేయబోతున్న సినిమాల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పుడు అందుతున్న సమాచారం ప్రకారం ప్రస్తుతం ఆయన ‘ఫౌజీ’ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తి అయిన తర్వాత ‘స్పిరిట్’ సినిమా చేస్తాడు. ఇక ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ‘కల్కి 2’ సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇక ఇలాంటి క్రమంలోనే కల్కి మొదటి పార్ట్ లో దీపిక పదుకొనే కీలక పాత్ర వహించింది. అయితే ఇప్పుడు ఆమెను తీసేస్తున్నట్టు వైజయంతి మూవీస్ వారు అఫీషియల్ గా ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు. మరి దానికి కారణం ఏంటి అనే ధోరణి కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి.
Also Read: ‘ఓజీ’ లో ప్రకాష్ రాజ్ కి ఇలాంటి క్యారక్టర్ ఇచ్చారా..? పవన్ ఫ్యాన్స్ ఊరుకుంటారా!
ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం దీపికా పదుకొనే పెట్టే కండిషన్లు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని అందువల్లే ‘కల్కి 2’ సినిమా నుంచి ఆమెను తీసేసారు అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ఆమె టీం లో మొత్తం 25 మంది మెంబర్స్ ఉంటారు. వాళ్ళందరికీ ఫైవ్ స్టార్ హోటల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.
ఇక ఆమె రోజుకి 6 నుంచి 7 గంటలు మాత్రమే షూటింగ్లో పాల్గొంటుందట…ఇక ఇంతకు ముందు తీసుకున్న రెమ్యూనరేషన్ కంటే ఇప్పుడు 25% పెంచినట్టుగా తెలుస్తోంది. వీటన్నింటిని మేకర్స్ భరించలేక ఆమెను సినిమా నుంచి తీసేసినట్టుగా తెలుస్తోంది. మరి ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ప్రభాస్ కి ఉన్న క్రేజ్ అయితే చాలా ఎక్కువ…
ఇలాంటి క్రమంలోనే ఆమె ప్రభాస్ చేస్తున్న రెండు సినిమాలు నుంచి తప్పుకోవడం అనేది ఆమె కెరీర్ కి చాలా వరకు మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి… గతంలో స్పిరిటీ సినిమా కోసం సందీప్ రెడ్డి వంగ మొదట దీపిక పదుకొనె ని తీసుకోవాలి అనుకున్నప్పటికి ఆమె పెట్టిన కండిషన్స్ ని భరించలేక ఆమెను పక్కనపెట్టి త్రిప్తి డిమ్రీ ని హీరోయిన్ గా తీసుకున్నాడు…